ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

జగన్ బాధిత సంఘంలో అగ్రస్థానంలో ఉన్నది దళిత వర్గాలే! - Dalith Voters in Andhra Pradesh - DALITH VOTERS IN ANDHRA PRADESH

ETV Bharat Prathidwani : 2019లో ఒక్క ఛాన్స్‌ అని జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధేయపడ్డారు. కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారు. 2024 ఎన్నికల్లో దళితులు ఎటు? అనే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ETV Bharat Prathidwani
ETV Bharat Prathidwani

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 12:14 PM IST

ETV Bharat Prathidwani :2019లో ఒక్క ఛాన్స్‌ అని జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధేయపడ్డారు. కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారు. మన దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాల్చకుండా ఉంటుందా? మా వాడే అనుకుని ఓటు వేసిన అందరికీ అరచేతిలో స్వర్గం కాదు ఆద్యంతమూ నరకం చూపిస్తున్నారని ఇప్పుడు అందరూ గగ్గోలు పెడుతున్నారు. జగన్ బాధిత సంఘంలో అగ్రస్థానంలో ఉన్నది దళిత వర్గాలే. రాష్ట్రంలో ఐదోవంతు పైగా జనాభా వారిదే అయినా ఆ నిష్పత్తిలో ఉద్యోగాలేవి? నిధులు ఏవి? అభివృద్ధి ఏది? సంక్షేమం ఏది? భద్రతేది? భరోసా ఏది? 2024 ఎన్నికల్లో దళితులు ఎటు? అనే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

వైసీపీకి దళితులు ఎందుకు ఓటువేయాలి?: మాదిగ ఐకాస - Jagan government

Madiga JAC Leaders : సీఎం జగన్​కు ఎందుకు ఓట్లు వేయాలి, ఈ ఐదేళ్ల పాలనలో దళితులను హతమార్చినందుకు వేయాలా.? లేదంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పథకాలను రద్దు చేసినందుకు వేయాలా అని మాదిగ ఐకాస రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాదిగ గతంలో ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గెలుపు కోసం రాష్ట్రంలోని 35 దళిత సంఘాలన్నీ ఏకమయ్యాయని తెలిపారు.

చంద్రబాబు నాయుడు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మాదిగ ఐకాస రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు వెల్లడించారు. కూటమికి ఓట్లు వేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా 35 మాదిగ సంఘాల ఆధ్వర్యంలో యాత్ర చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ లో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రతి దళితుడు వైఎస్ జగన్ ఓటమికి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రాభివృద్ధి జరగాలంటే వైఎస్సార్సీపీ పాలన పోవాలి: మాదిగ సంఘాల జేఏసీ - Madiga Communities JAC Meeting

వైఎస్ జగన్ గత ఎన్నికల్లో కోడి కత్తి కేసును సాకుగా చూపించి గెలుపొందారు. తాజాగా జరగబోయే ఎన్నికల్లో గులక రాయిని సాకుగా చూపించి మళ్లీ అధికారం చేపట్టాలని అనుకుంటున్నారని వెంకటేశ్వరావు విమర్శించారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్​ను నమ్మే రోజులు పోయాయని పేర్కొన్నారు. సీఎం జగన్ అధికారంలోకిి వచ్చింది మెుదలు గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చి న ఉపకార వేతనాలను రద్దు చేశాడని పేర్కొన్నారు. అమ్మ ఒడి పేరుతో కేవలం ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే డబ్బులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు ఎంతో చక్కగా పని చేశాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో దళిత, గిరిజనులకు ఎంతోమందికి వాహనాలు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు ఓటు వేయాలని కోరారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే, దళితులు ఉండరని పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంటుందని మాదిగ ఐకాస నేత వెంకటేశ్వరరావు తెలిపారు.

దళితుడ్ని చంపి దండేస్తే ఊరుకుంటామా?- అనంతబాబుపై దండెత్తిన దళితులు - Protest Against MLC Ananthababu

ABOUT THE AUTHOR

...view details