RTC Buses to YSRCP Meetings : కార్లు, ఆటోలు వంటి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించలేని సామాన్యులకు ఉన్న ఏకైక రవాణా సాధనం ఆర్టీసీ. ప్రైవేటు రవాణా సదుపాయాలతో పోలిస్తే కాస్త పేదలకు అందుబాటులో ఉండేది ఇదే. పేదలు ఆధారపడేది దీనిపైనే. అందుకే దాన్ని ప్రజా రవాణా సంస్థ అంటాము. అయితే ప్రజా రవాణా ప్రజాసేవను గాలికి వదిలేసి జగన్ పార్టీ సేవలో తరిస్తోంది.
తమ జీవనావసరాల కోసం లక్షలాది ప్రజలు రోజూ ప్రయాణించే దారుల్లో సర్వీసులను రద్దు చేసి వైఎస్సార్సీీప సభలకు బస్సులు సమకూరుస్తోంది. ఎన్నికలు ముగిసేదాకా ఇలానే చేస్తే ప్రజలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. ఆర్టీసీకి దూరం అవుతారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ ఎందుకు అధ్వాన్నంగా మారింది. ఇదీ నేటి ప్రతిధ్వని చర్చ.
మహిళలపై నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపిన జగన్‌కు ఎందుకు ఓటేయాలి?
ప్రతిధ్వని చర్చలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు ఈశ్వరయ్య పాల్గొంటున్నారు. వైఎస్సార్సీపీ తన అధికారబలంతో విశాఖపట్నం, దెందులూరు, రాప్తాడుల్లో సిద్ధం సభలకు జనాలను తరలించేందుకు వేలాది ఆర్టీసీ బస్సులను భారీగా తరలించడం ప్రజలపై ఎటువంటి ప్రభావాన్ని చూపింది అనే అంశంపై నేటి ప్రతిధ్వనిలో చర్చించారు.
ఆర్టీసీ మీద ఆధారపడే వారంతా ఏఏ వర్గాల వారు. ఇంకా ఎన్నికలకు 50-60 రోజులు ఉన్నాయి. ఈలోపు ఆర్టీసీని వైఎస్సార్సీపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మాదిరిగా వాడేస్తే జనం ఏమైపోవాలనే ప్రశ్నలపై చర్చించారు. ఆర్టీసీ సంస్థ పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలకు బస్సులు అద్దెకు ఇవ్వటం తెలిసిందే. ప్రయాణికులకు నష్టం లేకుండా ఒక్కో డిపోలో 2-3 బస్సులు ఇవ్వటం సహజం. కానీ, ఆయా డిపోల నుంచి మొత్తం 80 శాతం, 50 శాతం బస్సులను వైఎస్సార్సీపీ అప్పగించేయటం ప్రభుత్వం చేయాల్సిన పనేనా అనే అంశంపై ప్రతి ధ్వని చర్చ కొనసాగించింది.
అంబేద్కర్ ఏం చెప్పారు ? సీఎం జగన్ ఏం చేస్తున్నారు ?
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆర్టీసీలో ఒక్క కొత్త బస్సు కొనలేదని, కాలం చెల్లిన బస్సులతోనే కాలక్షేపం చేస్తున్నారని కూడా తెలుస్తోంది. దీని ప్రయాణం ప్రయాణికుల భద్రతపై ఎలా ఉంటుందని చర్చించారు. ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం వలన కార్మికులకు, ప్రయాణికులకు, ఆ సంస్థకు ప్రత్యేకంగా కలిగిన ప్రయోజనాలేంటి. ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ఫించన్ పథకం ఎందుకు వర్తింప చేయట్లేదనే చర్చ నిర్వహించారు.
ఏపీలో రహదారులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. దానివలన బస్సుల కండీషన్ దారుణంగా తయారైంది. వాటికి మరమత్తులు లేవు. కొత్త బస్సులు రావు. ఇలా అయితే ఆర్టీసీ మనుగడ ప్రమాదంలో పడదా అనే అంశంపై చర్చలు కొనసాగించారు.
వైఎస్ కుటుంబాన్ని కడుపులో పెట్టుకున్న కడప జిల్లాకు జగన్ చేసిందేమిటి ?