Prathidhwani :పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు. ఈరోజది ఆంధ్రప్రదేశ్‌లో ఓ నియంత పాదాల కింద నలిగిపోతోంది. 2019లో సీఎంగా ప్రమాణ స్వీకార వేదికపై నుంచే జగన్ కొన్ని మీడియా సంస్థలపై వార్ ప్రకటించారు. గిట్టని మీడియాను శత్రువులుగా భావిస్తూనే ఉన్నారు. తన పోరాటం ప్రతిపక్షాలపై కాదు కొన్ని మీడియా సంస్థలపైనే అని బెదిరింపులకూ దిగారు. తద్వారా తన పార్టీ శ్రేణులనూ మీడియాపై దాడికి ఉసిగొల్పారు.
YSRCP Leaders Attack on Journalists in Andhra Pradesh :తనకో సొంత మీడియా పెట్టుకుని, గిట్టని వారిపై విషం చిమ్ముతూ అసత్యాలు వల్లె వేస్తూ అధికార బలంతో అనుచిత లబ్ది చేకూరుస్తూ ఓ చెడు ఉదాహరణగా నిలిచారు జగన్. వార్తలు నచ్చకపోతే చదవటం మానేయచ్చు. అసత్యమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ భౌతిక దాడులు చేయటం కేవలం నియంతలకే సాధ్యం. రాష్ట్రంలో ఉన్నది అంబేద్కర్ రాజ్యంగమా? జగన్ రాజ్యాంగమా? ఇదే అంశంపై ప్రతిధ్వనిలో చర్చించటానికి ఇద్దరు నిపుణులు మన డిబేట్‌లో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ అధ్యక్షుడు కె. శ్రీనివాసరెడ్డి, ఏపీ టుమారో వ్యవస్థాపకులు ఎన్. చక్రవర్తి పాల్గొన్నారు.
మీడియా వ్యక్తులపై వైఎస్సార్సీపీ దాష్టీకాలు :
19 ఫిబ్రవరి, 2024 :అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జరిగిన జగన్ సిద్ధం సభ కవరేజీ కోసం వెళ్లిన ఆంధ్రజ్యోతి పత్రిక ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. నువ్వు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల వాడివా అని ప్రశ్నిస్తూ గుర్తింపు కార్డు చూపించాలని పట్టుబట్టి సభా ప్రాంగణంలోనే పిడిగుద్దులతో ముఖం మీద, వీపు మీద రక్తం వచ్చేలా కొట్టారు.
'మీడియాపై జగన్ ఫ్యాక్షన్ దాడి'- రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన గళం
14 ఫిబ్రవరి, 2024 :అమరావతి మండలంలోని మల్లాది ఇసుక రీచ్ వద్ద అక్రమ ఇసుక తవ్వకాల ఫొటోలు తీస్తున్న ఈనాడు విలేకరి పరమేశ్వరరావుపై వైఎస్సార్సీపీ నేతలు దాడిచేశారు. ఫొటోలు తీస్తున్న పరమేశ్వరరావును వైఎస్సార్సీపీ నేతలు బంధించి ఫోన్ లాక్కున్నారు.
23 జనవరి, 2024:తిరుపతి పట్టణంలోని శ్రీకల్యాణవేంకటేశ్వర స్వామి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఉందని చంద్రగిరి మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను పిలిపించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి 'నాపై వార్తలు రాసింది, సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఎవడ్రా? మీ ఇళ్లకు వచ్చి మీ కుటుంబసభ్యుల ముందే కాళ్లు, చేతులు విరుస్తా. ఏడేళ్లు నక్సలైట్గా పని చేసి వచ్చా. నాపై, నా కొడుకుపై తప్పుడు మెసేజ్లు పెడితే ఊరుకోను. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే కఠిన చర్యలుంటాయి. తలకిందులుగా వేలాడదీసి చర్మం వలుస్తా. దీనికోసం కొందరితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నా' అని అంటూ ఇద్దరు విలేకర్ల పేర్లను ప్రస్తావిస్తూ బెదిరించారు.
విలేకరులపై దాడి చేసే హీన స్థితికి జగన్ దిగజారిపోయాడు: దేవినేని ఉమ
08 జనవరి, 2024 : అనంతపురం జిల్లా ఉరవకొండలో సాధికార సభ జరుగుతుండగా మధ్యలోనే జనం వెళ్లిపోతున్న ఫొటోలు తీస్తున్నారన్న అక్కసుతో 'ఈనాడు' ఫొటోగ్రాఫర్, ఈటీవీ, న్యూస్ టుడే కంట్రిబ్యూటర్లపై 150 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడిలో 'ఈనాడు' ఫొటోగ్రాఫర్ సంపత్, న్యూస్టుడే విలేకరులు ఎర్రిస్వామి, భీమప్ప, ఈటీవీ విలేకరి మంజునాథకు గాయాలయ్యాయి.
2024 లో గడిచిన 50 రోజుల్లోనే మీడియాపై ఇన్ని దాడులకు తెగిబడ్డారు అధికార పార్టీ నేతలు. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి వారి తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన వారిపై ఎన్నో దాడులు చేశారు.
సిద్ధం సభలో ఏబీఎన్ ఫోటోగ్రాఫర్పై దాడి హేయం : టీడీపీ