Pratidhwani :రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ముంబయి సినీ నటి వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు బాసులపై వేటు పడింది. ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్‌లు సస్పెండ్ అవటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. దీనిని బట్టి జగన్ ప్రభుత్వం అధికార వ్యవస్థను ఎంత భ్రష్ఠు పట్టించిందో అర్థం అవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో అధికార యంత్రాంగం ఎంతగా కుమ్మక్కు అయిందో అర్థం అవుతోంది. సామాన్యులు, మహిళలను తప్పుడు కేసుల్లో ఇరికించి అమాయకులను వేధించి వేపుకుని తిన్న ఘటనల్లో ఇది ఒకటి మాత్రమే. తవ్వి తీయాలే కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పనిచేసిన అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు టాప్ టూ బాటమ్ బోను ఎక్కే వీలుంది. వేర్వేరు కేసుల్లో సస్పెండ్ అవటానికి అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందా? గత పాపాల పుట్టలను బద్దలు కొట్టి అక్రమార్కులపై వేటు వేస్తుందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ సమావేశంలో హైకోర్టు న్యాయవాది కె. రజనీ, ప్రముఖ న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు పలకా శ్రీరామమూర్తి పాల్లొన్నారు.
కాదంబరీ జత్వానీ కేసు - సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు - three senior IPS officers Suspended
ముంబై నటి అక్రమ నిర్భందం, బెదిరింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్లు 1590, 1591, 1592ను ప్రభుత్వం విడుదల చేసింది. కాన్ఫిడెన్షియల్ అని ప్రభుత్వ వెబ్‌సైట్ పేర్కొంది. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు పడింది. ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను డీజీపీ సస్పెండ్ చేశారు. మరికొందరు పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.