ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

భావితరాల విద్యార్థుల కోసం ఆర్ట్​ గ్యాలరీ - సంతోషంగా ఉందన్న పూర్వ విద్యార్థులు - Students Exhibit Their Fine Arts - STUDENTS EXHIBIT THEIR FINE ARTS

Yogi Vemana University Students Exhibit Their Fine Arts : మనం చెప్పే చాలా మాటలకంటే ఒక మంచి చిత్రం ద్వారా తెలిపే సందేశం ఎక్కువ గుర్తుండి పోతుంది. కానీ, అలాంటి చిత్రాలు వేయాలంటే నైపుణ్యంతోపాటు ఆలోచన, ఓపిక అవసరం. అవి తమలో నిండుగా ఉన్నాయని కెరీర్‌గా ఆర్ట్స్‌నే ఎంచుకున్నారు ఆ యుువత. నేర్చుకున్న కళను భవిష్యత్తు తరాలకు అందాలని "ది టెన్ ఆర్ట్ షో" పేరుతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు.

Yogi Vemana University Students Exhibit Their Fine Arts
Yogi Vemana University Students Exhibit Their Fine Arts (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 5:41 PM IST

Yogi Vemana University Students Exhibit Their Fine Arts : కొంతమంది విద్యార్థులు ఆర్ట్స్‌నే కెరీర్​గా ఎంచుకొని జీవితంలో ముందుకూ వెళ్తున్నారు. విద్య నేర్పిన కళాశాలకు వినూత్నంగా ఏదైనా చేయాలనుకున్నారు ఈ యువత. కళాశాల ప్రోత్సాహంతో ది టెన్‌ ఆర్ట్‌ షో పేరిట కళాప్రదర్శన ఏర్పాటు చేశారు. సందేశాలతో చక్కటి చిత్రాలు గీసి అందరిని ఆలోచింపజేశారు ఈ యువ కళాకారులు.

కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు మంచి ఆదరణ ఉంటుంది. ఏటా చాలామంది ఆసక్తిగల ఔత్సాహికులు ఇక్కడ చేరి కళానైపుణ్యాలు పెంపొందించుకుంటున్నారు. అయితే ఇప్పటికే నైపుణ్యాలు నేర్చుకుని కెరీర్‌లో స్థిరపడిన యువత కళాశాల కోసం వినూత్నంగా చేయాలనుకున్నారు. రాబోయే విద్యార్థులకు ట్రెండ్‌ సెట్టర్‌గా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేశారు.

వేణుగానంతో మైమరిపిస్తున్న యువ కళాకారిణి - జాతీయ స్థాయిలో ప్రశంసలు - A Girl Mesmerizing with her Flute

భావితరాల విద్యార్థుల కోసం ప్రత్యేక చిత్రాలు వేసి "ది టెన్ ఆర్ట్ షో" పేరుతో ప్రదర్శన నిర్వహించారు ఈ కళాకారులు. చిత్రలేఖనం, పెయింటింగ్, శిల్పం, డిజైనింగ్, ప్రింట్ మేకింగ్, గ్రాఫిక్స్, యానిమేషన్ విభాగాల్లో రూపొందించిన చిత్రాలు విద్యార్థులను ఆలోచింపజేశాయి.

"దసరారోజు కర్నూలు జిల్లాలో బన్నీ ఉత్సవం ఘనంగా జరుగుంది. ఇది తరతరాలుగా జరుగుతున్న పండుగా. వాళ్ల సాంప్రదాయాన్ని అందరికీ తెలిపే విధంగా మంచి చిత్రాన్ని గీశాను. ఇది అందర్ని ఆకట్టుకుంటుంది. ఇదే కళాశాలలో చదువుకుని ఇక్కడే కళాప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది." - ఈరప్ప, ఆర్టిస్టు, కడప యోగివేమన విశ్వవిద్యాలయం

"ఆర్ట్​ను నమ్ముకున్న వాళ్లు ఎప్పుడు నష్టపోలేదు. చాలా మంది ఎంతో ఇష్టంగా చేరుతున్నారు. భావాలు, సామాజిక, సంస్కృతులను ప్రతిబింబించే ఎన్నో సందేశాలు చిత్రాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ భవిష్యత్తులో వచ్చే విద్యార్థులకు ఆదర్శంగా ఉండేందుకు ఈ గ్యాలరీని ఏర్పాటు చేశారు. బీఎఫ్ఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి." - మృత్యుంజయరావు, హెచ్ఓడీ, ఫైన్ ఆర్ట్స్ విభాగం

పూర్వ విద్యార్థుల స్ఫూర్తితో ప్రస్తుతం ఫైన్ ఆర్ట్స్ విభాగంలో అనేకమంది విద్యార్థులు ప్రవేశం పొందుతున్నారు. శిల్పం, చిత్రలేఖనం, డ్రాయింగ్, పెయింటింగ్‌లో మెళకువలు నేర్చుకుంటున్నారు. ప్రింట్‌మేకింగ్‌ నేర్చుకుని రాణిస్తున్నారు. ఈ ఆర్ట్ ప్రదర్శన ద్వారా తాము మరిన్ని విషయాలు నేర్చుకున్నామని విద్యార్థులు చెబుతున్నారు. అందరిలా గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేయకుండా కొత్తగా ఆలోచించి చాలా మంది విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించారు ఈ కళాకారులు. సందేశాత్మక చిత్రాలతో అందరిని ఆలోచింపజేశారు. ప్రతిభను ప్రదర్శించి ప్రముఖుల మన్ననలు అందుకున్నారు ఈ యువత.

కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదిక - ఇంజినీరింగ్​ కాలేజీల్లో స్పేస్​ డే వేడుకలు - National Space Day Celebrations

హాబీతో ప్రత్యేకత చాటుకున్న యువకుడు - నాణేల సేకరణతో అంతర్జాతీయ రికార్డులు - RAVITEJA COINS COLLECTIN

ABOUT THE AUTHOR

...view details