ETV Bharat / offbeat

మృదువైన "సగ్గుబియ్యం ఇడ్లీలు" - ఇలా చేసుకుంటే నోటికి ఎంతో రుచిగా ఉంటాయి! - SAGGUBIYYAM RAVA IDLI

మినపప్పు, రవ్వతో ఇడ్లీలు చేయడం కామన్​ - ఓసారి ఇలా సగ్గుబియ్యం ఇడ్లీలు చేసేద్దాం!

Saggubiyyam Rava Idli
Saggubiyyam Rava Idli in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2025, 2:24 PM IST

Saggubiyyam Rava Idli in Telugu : పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇడ్లీలను ఇష్టంగా తింటారు. ఎలాంటి నూనెలు, కారం మసాలాలు లేకపోవడం, పొట్టకి హాయిగా అనిపించడంతో అందరి ఫేవరెట్​ బ్రేక్​ఫాస్ట్​ లిస్ట్​లోకి ఇడ్లీ చేరిపోయింది. ఇడ్లీలు ఎప్పుటికప్పుడు చేసుకునేందుకు వీలుగా మహిళలు వారానికి సరిపడా ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్​లో పెట్టుకుంటారు. ఇలా మినప్పప్పు నానబెట్టుకుని ఇడ్లీ పిండి రెడీ చేసుకోవడం అందరికీ తెలిసిందే! అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి కొత్తగా సగ్గుబియ్యం ఇడ్లీలు చేసేయండి. సగ్గుబియ్యంతో ఇడ్లీలు ఎలా చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారా? ఈ స్టోరీ పూర్తిగా చదివితే మీకు ఫుల్​ క్లారిటీ వచ్చేస్తోంది. మరి ఇక లేట్​ చేయకుండా మృదువైన సగ్గుబియ్యం ఇడ్లీలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • సన్న సగ్గుబియ్యం - కప్పు
  • ఇడ్లీ రవ్వ - కప్పు
  • చిలికిన పెరుగు - కప్పు
  • నీళ్లు - కప్పు
  • కొత్తిమీర తరుగు - అరకప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా ఒక బౌల్లో సన్న సగ్గుబియ్యం వేసుకుని బాగా కడిగి నీటిని వడకట్టుకోండి. తర్వాత అదే కప్పుతో వేడి నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. (మీ దగ్గర సన్న సగ్గుబియ్యం లేకపోతే లావు వాటినే మిక్సీలో కాస్త బరకగా గ్రైండ్​ చేసి వాడుకోవచ్చు.)
  • తర్వాత ఇందులో ఇడ్లీ రవ్వ, చిలికిన పెరుగు, నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. (ఇక్కడ మీరు అన్నీ సగ్గుబియ్యం తీసుకున్న కప్పు కొలతతో తీసుకోవాలి.)
  • ఆపై ఇడ్లీ పిండిలో కాస్త కొత్తిమీర తరుగు వేసి మిక్స్​ చేయండి.
  • ఇప్పుడు ఇడ్లీ పాత్రలపై కాస్త నెయ్యి రాసి 2 టేబుల్​స్పూన్ల పిండి కొద్దిగా వేసుకోండి.
  • ఇలా పిండిని మొత్తం అన్ని ఇడ్లీ పాత్రల్లో వేసుకోండి.
  • అనంతరం ఇడ్లీలు స్టీమ్​ చేయడానికి పాత్ర పెట్టి 2 గ్లాసుల నీళ్లను పోయండి.
  • తర్వాత ఇడ్లీ పాత్రలు పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్​లో స్టీమ్​ చేసుకోండి.
  • ఆపై లో ఫ్లేమ్​లో 5 నిమిషాలు స్టీమ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి 5 నిమిషాల తర్వాత ఇడ్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే మృదువైన సగ్గుబియ్యం ఇడ్లీలు మీ ముందుంటాయి.
  • ఈ సగ్గుబియ్యం ఇడ్లీలు పల్లీ చట్నీ, టమాటా చట్నీతో అద్దిరిపోతాయి.
  • సగ్గుబియ్యం ఇడ్లీ తయారీ నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి.

పెసర్లు నానబెట్టడం, రుబ్బడం అవసరం లేదు! -ఈ పొడితో ఎప్పుడైనా "కమ్మటి పెసరట్టు" వేసుకోవచ్చు!

అద్దిరిపోయే చిట్టిచిట్టి "పెసర పునుగులు" - ఈ అల్లం చట్నీతో తింటే టేస్ట్​ అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.