Woman Jumped From The Bus In Nirmal: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో ప్రయాణిస్తున్న బస్సులో నుంచి మహిళ దూకింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేసారు. కుటుంబ గొడవల వల్లే తాను బస్సు దూకిందని సమాచారం.
రన్నింగ్ బస్‌లో నుంచి దూకేసిన మహిళ - భర్త చూస్తుండగానే - WOMAN JUMPED FROM THE BUS IN NIRMAL
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో ప్రయాణిస్తున్న బస్సులో నుంచి దూకిన మహిళ - తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలింపు
Published : Nov 12, 2024, 2:28 PM IST
స్థానికుల వివరాల ప్రకారం : నిజామాబాద్‌కు చెందిన ఓ కుటుంబం అత్తవారింటికి భైంసా మండలం దేగం గ్రామానికి వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో దేగం గ్రామంలో హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. ముధోల్లోని కంటి ఆసుపత్రి వద్దకు రాగానే మహిళ ప్రయాణికురాలు ఒక్కసారిగా బస్సులోంచి కిందకు దూకింది. దీంతో తీవ్రగాయాలయ్యాయి. అటువైపు నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే బస్సు డ్రైవర్ బస్సును ఆపాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దూకడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.