తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఎయిర్‌ హోస్టెస్‌ హైహీల్సే ఎందుకు వేసుకుంటారో తెలుసా? - కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా! - WHY AIR HOSTESS WEAR HIGH HEELS

ఎయిర్‌హోస్టెస్‌ హైహీల్స్‌ ధరించడం మీరు చూసే ఉంటారు - అలా వేసుకోవడం వెనుక దాగి ఉన్న కారణాలివే!

REASONS for AIR HOSTESS WEAR HEELS
Why Air Hostess Wear High Heels (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2024, 10:41 PM IST

Why Air Hostess Wear High Heels? : కొన్ని రంగాల్లో పని చేసే ఉద్యోగులు యూనిఫాంధరించడం తప్పనిసరిగా ఉంటుంది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కచ్చితంగా ఆయా దుస్తులు, యాక్సెసరీస్‌ ధరించాలన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంటాయి. ఇందుకు విమానయాన రంగమూ మినహాయింపు కాదు. ఇందులో పనిచేసే ఉద్యోగులు ఫార్మల్‌ దుస్తులకు స్టైలిష్‌ యాక్సెసరీస్‌ని ధరిస్తూ మరింత మోడ్రన్​ లుక్​తో కనిపిస్తుంటారు.

ఈ క్రమంలోనే చాలా ఏవియేషన్‌ సంస్థల్లో ఎయిర్‌హోస్టెస్‌ హైహీల్స్‌ ధరించడం మనం చూస్తుంటాం. అవి వారికి మరింత అందాన్ని తెచ్చిపెడుతుంటాయి. ఈ ప్రొఫెషనల్, స్టైలిష్ లుక్ చూసి కొందరు మహిళలు తాము ఎయిర్ హోస్టెస్ అవ్వాలని కలలు కంటుంటారు. కానీ.. మీకు ఎప్పుడైనా ఎయిర్‌ హోస్టెస్‌ హైహీల్సే ఎందుకు ధరిస్తారు? అనే డౌట్ వచ్చిందా? అయితే, అందుకు గల కారణాలేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

ఎయిర్‌హోస్టెస్‌ హైహీల్స్‌ ధరించే సంప్రదాయం వారి మోడ్రన్‌ లైఫ్‌స్టైల్‌లో భాగమనుకుంటారు ఎక్కువ మంది. కానీ.. వాస్తవానికి ఈ ట్రెడిషన్‌ ఇప్పటిది కాదు.. 19వ శతాబ్దంలోనే ఇది మొదలైందట! 1960-70 మధ్యకాలంలో.. అమెరికాకు చెందిన ‘పసిఫిక్‌ సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌’ అనే విమానయాన సంస్థ.. డ్రస్‌కోడ్‌గా తమ మహిళా ఫ్లైట్‌ అటెండెంట్స్‌ "మినీ స్కర్ట్స్‌ని" ధరించాలని నిర్ణయించింది. అలాగే.. దానికి జతగా హైహీల్స్‌ ధరించాలన్న నియమం పెట్టింది.

పురుష ప్రయాణికులను ఆకర్షించడం కోసమే అప్పట్లో ఆ సంస్థ ఇలా చేసిందట. ఎందుకంటే.. ఆ రోజుల్లో చాలామంది పురుషులు వర్తక వాణిజ్యం దృష్ట్యా ఒక దేశం నుంచి మరో దేశానికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎక్కువగా ప్రయాణించే వారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విమాన ప్రయాణం చేసేలా వాళ్లను ఆకర్షించడానికే ఎయిర్‌హోస్టెస్‌ డ్రస్సింగ్‌ స్టైల్‌ని ఈవిధంగా నిర్ణయించారట.

ఇదీ మరో కారణం : ఎయిర్ హోస్టెస్​ల డ్రెస్సింగ్ స్టైల్ మేల్ ప్యాసింజర్లను ఆకర్షించడానికే కాదు.. హైహీల్స్‌ అమ్మాయిల్ని పొడవుగా, నాజూగ్గా, అందంగా, హుందాగా కనిపించేలా చేస్తాయి. వీటిని.. ప్రొఫెషనల్‌ దుస్తులపైకి మ్యాచ్‌ చేస్తే వాళ్లు మరింత స్టైలిష్‌గా కనిపించే ఛాన్స్ ఉంటుందని నమ్మిన మరికొన్ని విమానయాన సంస్థలూ తమ ఎయిర్‌హోస్టెస్‌ కోసం యూనిఫాంతో పాటుగా హైహీల్స్‌ ధరించాలన్న నియమం పెట్టాయట!

రూ.150 టికెట్‌తో 50 నిమిషాల ఫ్లైట్ జర్నీ- ఈ సూపర్ స్కీమ్ గురించి మీకు తెలుసా?

కొన్ని సంస్థలు హైహీల్స్‌కు.. గుడ్‌బై!

ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగినులు మోడ్రన్‌ దుస్తులు, బన్‌ హెయిర్‌స్టైల్‌, హైహీల్స్‌తో.. స్టైలిష్‌గా, హుందాగా కనిపిస్తుంటారు. అయితే.. హైహీల్స్ వేసుకోవడం వల్ల అందం మాటేమో గానీ.. వాటిని నిరంతరాయంగా ధరించడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, శారీరక నొప్పులు వేధిస్తుంటాయి. ఇలా కారణమేదైనప్పటికీ.. హైహీల్స్ వేసుకోవడం వల్ల ఉద్యోగినులు ఎదుర్కొనే అసౌకర్యాన్ని అర్థం చేసుకున్న కొన్ని విమానయాన సంస్థలు.. ఎయిర్‌హోస్టెస్‌ డ్రస్‌కోడ్‌, ఫుట్‌వేర్‌ నియమనిబంధనల్లో పలు మార్పులు తీసుకొచ్చాయి. హైహీల్స్‌కు తెరదించుతూ.. సౌకర్యవంతమైన ఫుట్‌వేర్‌ ధరించే అవకాశం కల్పిస్తున్నాయి.

  • అలాంటి వాటిల్లో కొన్నింటిని చూస్తే.. ఇటీవలే చైనావిమానయాన సంస్థ ‘ఎయిర్‌ ట్రావెల్‌’ తమ ఉద్యోగులు హైహీల్స్‌ ధరించాలన్న నియమాన్ని సడలించింది. ఇక నుంచి మహిళా ఫ్లైట్‌ అటెండెంట్స్‌ హీల్స్‌కు బదులుగా ఫ్లాట్స్‌ ధరించచ్చని ఓ ప్రకటన విడుదల చేసింది.
  • అలాగే.. గత ఏడాది ఆస్ట్రేలియాకు చెందిన ‘Qantas’ ఎయిర్‌లైన్స్‌ సంస్థ తమ మహిళా ఫ్లైట్‌ అటెండెంట్స్‌ కోసం హైహీల్స్‌ నిబంధనల్ని సడలించింది. వీటికి బదులుగా ఫ్లాట్స్‌ ధరించచ్చన్న నియమాన్ని తీసుకొచ్చింది.
  • ఇవే కాకుండా.. 2021లో ఉక్రెయిన్‌లోని ‘స్కై అప్‌ ఎయిర్‌లైన్స్‌’, 2020లో ‘జపాన్ ఎయిర్‌లైన్స్’తో పాటు మరికొన్ని ఎయిర్‌లైన్స్‌ కంపెనీలూ తమ మహిళా ఫ్లైట్‌ అటెండెంట్స్‌ డ్రస్‌కోడ్‌, ఫుట్‌వేర్‌ విషయాల్లో ఉన్న నిబంధనల్ని సడలిస్తూ.. ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

విమానంలో ఈ ఆహార పదార్థాలను అస్సలు అనుమతించరు- అవేంటో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details