తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

రొమ్ము క్యాన్సర్​ నుంచి ఆర్థరైటిస్​ దాకా - ఆల్​ బుకారా తింటే ఎన్నో సమస్యలకు చెక్! - Aloo Bukhara Health Benefits - ALOO BUKHARA HEALTH BENEFITS

Albakara Health Benefits : రంగులోనేమో యాపిల్‌లా.. ఆకారంలో టమాటల కనిపించే ఆల్​బుకారా పండ్లు వర్షాకాలంలో మొదలవ్వగానే దొరుకుతుంటాయి. అయితే చూడటానికి చిన్నగానే ఉన్నా.. ప్రయోజనాలు మాత్రం పుట్టెడు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Aloo Bukhara Health Benefits
Albakara Health Benefits (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 8, 2024, 11:09 AM IST

Aloo Bukhara Health Benefits:సీజన్ల వారిగా మాత్రమే లభించే పండ్లలో ఆల్ బుకారా(Plum)ఒకటి. ముఖ్యంగా ఈ పండ్లు వర్షాకాలంలో మాత్రమే లభిస్తాయి. చూడటానికి యాపిల్​ తీరుగా ఎర్రగా.. ఉంటాయి. ఇక రుచికి పుల్లగా, తియ్యగా టేస్టీగా ఉంటాయి. ఇందులో పోషకాలు కూడా ఎక్కువే అని.. వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. మరి ఈ సీజనల్​ పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

పోషకాలు:ఇందులో ఫైబర్​ కంటెంట్​ అధికంగా ఉంటుంది. అలాగే కొవ్వు శాతం కూడా తక్కువే. అంతేకాకుండా విటమిన్​ సి, ఎ, డి, బి12, బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్​, కాల్షియం కంటెంట్​ అధికంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ప్రయోజనాలు చూస్తే.:

  • ఈ పండులో విటమిన్‌ సి ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దీన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇది అలసటను తగ్గిస్తుంది. నీరసాన్ని దరి చేరనివ్వదు. దాంతో ఇన్‌ఫెక్షన్లు, అల్సర్లు తలెత్తవని నిపుణులు అంటున్నారు.
  • ఇందులోని విటమిన్‌-ఎ దంతక్షయం రాకుండా రక్షిస్తుంది. అలాగే కళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని చెబుతున్నారు.
  • ఈ పండులోని పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఈ పండ్లలో గైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కాబట్టి మధుమేహులూ తినొచ్చు.
  • 2019లో Journal of Medicinal Foodలో ప్రచురితమైన అద్యయనం ప్రకారం.. ఆల్​బుకారా పండ్లలోని పోషకాలు టైప్​ 2 డయాబెటిస్​ ఉన్నవారి రక్తంలో గ్లూకోజ్​ స్థాయిలను తగ్గిస్తుందని, ఇన్సులిన్​ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కొరియాలోని Kyungpook National Universityలో ఫుడ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీలో ప్రొఫెసర్​ డాక్టర్​ Jin-Hyang Lee పాల్గొన్నారు.
  • "రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచేందుకు ఆల్​బుకారాలోని ఎక్స్‌ట్రాక్ట్‌లు టైప్ 2 డయాబెటిస్ నిర్వహణకు ఉపయోగకరంగా ఉండవచ్చు" అని లీ పేర్కొన్నారు.
  • ఈ పండులో పీచూ, మెగ్నీషియం, ఫోలిక్‌ ఆమ్లం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఎముకలు పటిష్టమవుతాయి. అలాగే ఆర్థ్రరైటిస్‌, ఆస్టియోపోరోసిస్‌ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని అంటున్నారు.
  • ఈ పండ్లు శరీరంలోని మలినాలు బయటకు వెళ్లేలా చేస్తాయి. అలాగే వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు జీవక్రియలతోపాటు రక్తప్రసరణనూ సాఫీగా సాగేలా చేస్తాయని అంటున్నారు. రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాల పెరుగుదలకూ సాయపడుతుందని అంటున్నారు.
  • ఈ పండ్లలోని పొటాషియం శరీర కణాలకు మేలు చేస్తుంది. గుండెపోటు, రక్తపోటును నియంత్రిస్తుంది.
  • ఆల్ బుకారా పండ్లు తింటే.. శ్వాస, రొమ్ము సంబంధిత క్యాన్సర్లు రావని పలు పరిశోధనలు సైతం చెబుతున్నాయి.
  • ఈ పండులోని ఫైబర్​ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని.. దీన్ని తరచూ తీసుకున్న వారిలో మలబద్ధకం సమస్య తగ్గుతుందని అంటున్నారు. ఇందులోని ఫైబర్ త్వరగా ఆకలి వేయకుండా ఆపుతుందని.. తద్వారా బరువు తగ్గేందుకు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ABOUT THE AUTHOR

...view details