How to Make Veg Supreme Pizza At Home : పిజ్జా.. పిల్లల నుంచీ పెద్దవాళ్లవరకూ ఇష్టపడే ఆహార పదార్థాల్లో ఒకటి. ఎప్పుడైనా కుటుంబమంతా కలిసి సరదాగా పిజ్జా తినాలనుకున్నప్పుడు.. ఆర్డరిస్తే వచ్చే పిజ్జాలో తలా ఒక ముక్కా ఎవరికీ సరిపోదు. కాబట్టి, మీరు ఇకపై పిజ్జా తినాలనుకుంటే బేకరీ లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేయాల్సిన పనిలేదు. మీరే ఇంట్లో కుక్కర్ లేదా పాన్ మీద ఈజీగా ఇలా డోమినోస్ స్టైల్లో "వెజ్ పిజ్జా"ను ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది! మరి, ఇంకెందుకు ఆలస్యం అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
పిజ్జా బేస్ తయారీ కోసం :
ఈస్ట్ కోసం :
- డ్రై ఈస్ట్ - 4 గ్రాములు
- చక్కెర - 2 టీస్పూన్లు
- మైదా - అరటీస్పూన్
పిండి కోసం :
- మైదా - పావు కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- మిల్క్ పౌడర్ - 2 టీస్పూన్లు
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- బటర్ - 1 టేబుల్‌స్పూన్
- కార్న్ మీల్(మొక్కజొన్నల పిండి) - అరకప్పు
టాపింగ్ కోసం :
- మోజరెల్లా చీజ్ - ఒక కప్పు
- ప్రాసెస్డ్ చీజ్ తరుగు - ముప్పావు కప్పు
- ఆనియన్ పెటల్స్ - కొన్ని
- క్యాప్సికం ముక్కలు - కొన్ని
- పన్నీర్ ముక్కలు - 50 నుంచి 75 గ్రాములు
- ఆయిల్/నెయ్యి - కొద్దిగా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవాలి. అందులో భాగంగా మొదట ఈస్ట్ రెడీ చోసుకోవాలి.
- దానికోసం ఒక చిన్న బౌల్లో ఇన్స్టంట్ డ్రై ఈస్ట్, చక్కెర, మైదా తీసుకొని అరకప్పు గోరువెచ్చని వాటర్ పోసుకొని కలిపి ఈస్ట్‌ని చక్కగా పొంగనివ్వాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, ఉప్పు, మిల్క్ పౌడర్, నూనె, బటర్వేసుకొని పిండి బ్రెడ్ పొడిలా అయ్యేంత వరకు కలుపుకోవాలి.
- ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొంగిన ఈస్ట్ నీళ్లను అందులో పోసుకొని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. అయితే, పిండి అనేది మరీ గట్టిగా, చపాతీ పిండి మాదిరిగా ఉండకూడదు. కాస్త పల్చగా, సాఫ్ట్‌గా ఉండేటట్లు కలుపుకోవాలి.
- ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసున్నాక.. దాన్ని పెద్ద చపాతీ పీట లేదా శుభ్రమైన కిచెన్ బండ మీద ఆ పిండి ముద్దను వేసుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు బాగా చేతితో పిండిని విడదీస్తూ మిక్స్ చేసుకోవాలి. అంటే.. రాక్ అండ్ రోల్ పద్ధతిలో పిండిని బాగా సాగదీస్తూ వత్తుతూ కలుపుకోవాలి.
- మీరు పర్ఫెక్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకున్నారని తెలుసుకోవడానికి అందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని కాస్త స్ప్రెడ్ చేస్తే చిరగని పల్చని తెరలా స్ప్రెడ్ అవ్వాలి. అలా అయితే అప్పుడు రెసిపీలోకి కావాల్సిన పిండి రెడీ అయిందని అర్థం చేసుకోవాలి.
- ఆ తర్వాత అడుగు నుంచి రెండు చేతులతో పిండిని వత్తుకుంటూ తిప్పుతూ ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక బౌల్లో కాస్త ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని అందులో మీరు రెడీ చేసుకున్న పిండి ముద్దను ఉంచి ఆపై కొద్దిగా నూనెను అప్లై చేసి బౌల్లోకి గాలి చొరబడకుండా క్లాత్ లేదా కవర్‌తో కప్పి కనీసం 45 నిమిషాల పాటు అలా వదిలేయాలి. పిండి రెట్టింపు అయిందనుకున్నాక క్లాత్ తీసి పిండి లోపల ఏర్పడిన ఎయిర్ని తీసేయాలి.
- తర్వాత ఆ పిండి ముద్దను రెండు భాగాలుగా విభజించుకొని.. ఆపై ఒక్కో పిండి ముద్దను పై నుంచి లోపలికి లాగుకుంటూ స్మూత్ బాల్ మాదిరిగా చేసుకోవాలి.
- అనంతరం చపాతీ పీట లేదా శుభ్రమైన బండ మీద కార్న్ మీల్ చల్లుకొని పిండి ముద్దను ఉంచి రెండు వైపులా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీరోలర్ సహాయంతో అరఇంచు మందం ఉండేలా రోల్ చేసుకోవాలి.
- తర్వాత కుక్కర్లో పిజ్జా ప్రిపేర్ చేసుకునే వారు దాని సైజ్‌లో ఉండేలా ప్లేట్ బోర్లించి పిజ్జా రోలర్‌తో కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు కుక్కర్ లేదా పాన్‌లో సరిపోయే విధంగా ఉండే ప్లేట్ తీసుకొని దానిపై బటర్ లేదా ఆయిల్ అప్లై చేసుకొని కాస్త మొక్కజొన్న పిండి చల్లుకొని రోల్ చేసుకున్న పిజ్జా షీట్‌ను ఉంచి అంచుల వెంబడి కాస్త వాటర్ పూసి అరఇంచు మందం లోపలికి ఫోల్డ్ చేసుకుని గట్టిగా సీల్ చేసుకోవాలి.
- ఇలా సీల్ చేసుకున్నాక ఫోర్క్ స్పూన్‌తో పిజ్జా షీట్ మొత్తం పిక్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపై క్లాత్ కప్పి పావు గంటపాటు అలా వదిలేయాలి.
- పావుగంట తర్వాత ఆ పిజ్జా బేస్ డబుల్ అయిపోతుంది. అనంతరం ఆ పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్‌ను అప్లై చేసుకోవాలి. ఆపై మోజరెల్లా చీజ్, ప్రాసెస్డ్ చీజ్‌ను సమాంతరంగా పరచుకోవాలి. అలాగే దానిపై ఆనియన్, క్యాప్సికం పెటల్స్ సర్దుకున్నాక అక్కడక్కడ కొన్ని పన్నీర్ ముక్కలతో టాపింగ్ చేసుకొని పిజ్జా బేస్ అంచులను కాస్త ఆయిల్‌తో బ్రష్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై హీట్ బయటకు పోని పాన్ లేదా కుక్కర్ఉంచి దానిపై మూతపెట్టి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి.
- 10 నిమిషాల తర్వాత మూత తీసి లోపల ఏదైనా స్టాండ్ ఉంచి పిజ్జా ఉంచిన ఫ్లేట్ పెట్టి అంచులను మరోసారి ఆయిల్‌తో బ్రష్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 25 నిమిషాలు, మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. లేదా చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు బేక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మూత తీసి చూస్తే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "డోమినోస్ స్టైల్ వెజ్ పిజ్జా" రెడీ!
ఇవీ చదవండి :
బేకరీ స్టైల్ "దిల్పసంద్" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ సూపర్‌గా ఉంటుంది!
బేకరీలో దొరికే ఎగ్ పఫ్స్ ఇంట్లోనే - అది కూడా ఓవెన్ లేకుండానే! - ఇలా ప్రిపేర్ చేసుకోండి