తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మీ ఇంట్లోని గీజర్ ఎప్పుడు సర్వీసింగ్ చేయించాలో తెలుసా? - చేయించకపోతే జరిగేది ఇదేనట! - Geyser Maintenance Tips - GEYSER MAINTENANCE TIPS

Geyser Maintenance Tips : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇళ్లలో వేడి నీళ్ల కోసం గీజర్లను వాడుతున్నారు. అయితే.. వాటి మెయింటెనెన్స్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించకపోతే మొదటికే మోసం రావొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సర్వీసింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Tips for Geyser Maintenance
Geyser Maintenance Tips (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 4:36 PM IST

Tips for Geyser Maintenance : వర్షాకాలం, చలికాలం.. ఈ రెండు సీజన్లలో చల్లని వాటర్​తో స్నానం చేయడం కాస్త కష్టమే. దీంతో.. చాలా మంది ఇళ్లల్లో గీజర్లు వాడుతుంటారు. ఇందులో.. ఎలక్ట్రిక్, గ్యాస్ అనే రెండు రకాల గీజర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, అందులో మీరు ఎలాంటి రకం గీజర్ వాడుతున్నా.. దాని మెయింటెనెన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమంటున్నారు సాంకేతిక నిపుణులు. ముఖ్యంగా గీజర్ వాడే ప్రతి ఒక్కరూ.. దాని సర్వీసింగ్​కు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా అవసరమంటున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీరు ఇప్పటికే గీజర్ వాడుతున్నట్లయితే లేదా కొత్తది తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అదేంటంటే.. ప్రతి ఏడాది ఎయిర్ కండీషనర్ల మాదిరిగా గీజర్​ను సర్వీస్ చేయించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు సాంకేతిక నిపుణులు. అయితే.. గీజర్ సర్వీసింగ్ టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి.. మీ గీజర్​లో ఏదైనా సమస్య తలెత్తినా లేదంటే సర్వీసింగ్ చేయించి ఏడాది అయినా వెంటనే టెక్నీషియన్ రావాలంటే రాకపోవచ్చు. అంతేకాదు.. కొన్నిసార్లు కొంతకాలం వేచి ఉండక తప్పదు! అందుకే.. మీరు ముందుగానే అలర్ట్ అయి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకోవడం బెటర్ అంటున్నారు.

వాటర్ క్వాలిటీ : కొన్ని ప్రాంతాలలో నీటిలో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే మరికొన్ని వాటర్ కాస్త మురికిగాను ఉంటుంది. ఇలాంటి చోట్ల ఉండేవారు గీజర్ మెయింటెనెన్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. హార్డ్ వాటర్ గీజర్​లో కాల్షియం, ఇతర ఖనిజాల నిక్షేపాలను ఏర్పరుస్తుంది. ఫలితంగా వాటి సామర్థ్యం దెబ్బతింటుందంటున్నారు. అందుకే.. తరచుగా చెక్ చేస్తుండాలంటున్నారు.

ఎక్కువ వినియోగం : మీరు గీజర్​ను ఎక్కువగా వినియోగిస్తున్నా దీని మెయింటెనెన్స్ విషయంలో అలర్ట్​గా ఉండాలంటున్నారు. అలాంటి టైమ్​లో వీలైతే సంవత్సరానికి రెండుసార్లు సర్వీసింగ్ చేయించడం మంచిదని సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించకపోతే లోపల ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి దాని సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చు. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరగడమే కాకుండా కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్​కి దారితీసే అవకాశాలు లేకపోలేదంటున్నారు నిపుణులు! అదేవిధంగా.. గీజర్‌ నుంచి వాటర్‌ లీకవుతున్నాయా? లేదా? అని తరచూ చెక్‌ చేస్తుండాలి. ఏదైనా లీకేజీ అనిపిస్తే వెంటనే మంచి టెక్నీషియన్‌తో రిపేర్‌ చేయించాలని చెబుతున్నారు.

కాబట్టి.. మీరు గీజర్ వాడుతున్నట్లయితే చాలా రోజుల నుంచి సర్వీసింగ్ చేయించకపోతే వెంటనే సంబంధిత టెక్నీషియన్​ని పిలిపించి ఒకసారి సర్వీసింగ్ చేయంచడం మంచిదని సూచిస్తున్నారు. అలాకాకుండా.. మా గీజర్ బాగానే నడుస్తుందనుకుంటే మాత్రం ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పెద్ద మొత్తంలో ఖర్చుకు దారితీయవచ్చంటున్నారు. ఏదేమైనప్పటికీ.. గీజర్​ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు సాంకేతిక నిపుణులు.

ఇవీ చదవండి :

అలర్ట్: మీ ఇంట్లో గీజర్‌ ఉందా? - ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్!

వేడి నీటి కోసం హీటర్ వాడుతున్నారా? ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details