Telangana Tourism Warangal Heritage Tour:చాలా మంది కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు పర్యాటక ప్రాంతాలకు టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి టూర్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. మరి మీరు కూడా అలానే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం.. తెలంగాణ టూరిజం ఓ ప్యాకేజీని ప్రకటించింది. అది కూడా చాలా తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తోంది. ఇంతకీ.. ఆ ప్యాకేజీ ఏంటి? టికెట్ ధర ఎంత? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలంగాణ టూరిజం.. "Hyderabad-Warangal-Kakatiya-Ramappa Heritage Tour" పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ మొత్తం రెండు రోజులు ఉంటుంది. ఈ టూర్లో భాగంగా యాదాద్రితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ పర్యటక ప్రాంతాలను సందర్శించవచ్చు.
ప్రయాణ వివరాలు చూస్తే:
ఫస్ట్ డే:
- మొదటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని IRO ఆఫీసు నుంచి టూర్ మొదలవుతుంది.
- ఉదయం 8:30 గంటలకు భువనగిరి కోటకు చేరుకుంటారు. అక్కడ విజిట్ చేసిన తర్వాత యాదగిరిగుట్టకు బయల్దేరుతారు.
- మార్నింగ్ 9:00 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుని.. హరిత హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు.
- ఆ తర్వాత 9:45 గంటలకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ఉంటుంది. దర్శనం అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతారు.
- ఉదయం 11:00 నుంచి 11:30 AM వరకు జైన దేవాలయం సందర్శన ఉంటుంది.
- ఆ తర్వాత మధ్యాహ్నం 12:00 గంటలకు హస్తకళలకు ప్రసిద్ధి చెందిన పెంబర్తికి చేరుకుంటారు. అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు.
- అనంతరం 1:30 గంటలకు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుని చెకిన్ అవుతారు. చెక్-ఇన్ తర్వాత భోజనం చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు.
- ఆ తర్వాత 4:00 PM నుంచి 8:30 PM వరకు.. వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయాన్ని దర్శించుకుంటారు. అలాగే.. వరంగల్ ఫోర్ట్ సౌండ్ & లైట్ షో ప్రదర్శనను వీక్షిస్తారు.
- అనంతరం రాత్రి 9:00 గంటలకు హోటల్‌కి తిరిగి వచ్చి.. ఆ రాత్రికి అక్కడే డిన్నర్, స్టే ఉంటుంది.