తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

బియ్యప్పిండితో జంతికలు చేస్తే గట్టిగా వస్తున్నాయా? - ఇలా ట్రై చేస్తే కరకరలాడుతూ గుల్లగా వస్తాయి! - Rice Flour Jantikalu Recipe - RICE FLOUR JANTIKALU RECIPE

Rice Flour Murukulu Recipe : బియ్యప్పిండితో మురుకులు చేసుకుంటే గట్టిగా లేదా మెత్తగా వస్తున్నాయని బాధపడుతుంటారు చాలా మంది. అలాంటి వారు ఓసారి ఇలా ప్రిపేర్ చేసుకుని చూడండి. జంతికలు గుల్లగా, క్రంచీగా, క్రిస్పీగా వస్తాయి! మరి, ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Rice Flour Jantikalu
Rice Flour Murukulu Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 18, 2024, 3:42 PM IST

How to Make Rice Flour Jantikalu : చాలా మంది ఇష్టపడే పిండి వంటకాల​లో ఒకటి.. జంతికలు. వీటినే 'మురుకులు' అని కూడా అంటారు. పండగలు, శుభకార్యాల సమయంలో, ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకుంటుంటారు ఎక్కువ మంది. ఈ క్రమంలోనే కొందరు మురుకులను బియ్యప్పిండితో తయారు చేసుకున్నప్పుడు.. మెత్తగా, గట్టిగా వస్తున్నాయని బాధపడుతుంటారు. అలాంటివారు ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే జంతికలు గుల్లగా, క్రంచీగా వస్తాయి! పైగా వీటి తయారీకి శనగపిండి వాడట్లేదు కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్, అజీర్తి వంటి సమస్యలు రావట. మరి, ఇంకెందుకు ఈ సూపర్ టేస్టీ.. బియ్యప్పిండి జంతికలు ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పుట్నాల పప్పు - ముప్పావు కప్పు
  • బియ్యప్పిండి - రెండున్నర కప్పులు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నువ్వులు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
  • కారం - 2 టీస్పూన్లు
  • బటర్ - 25 గ్రాములు
  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు(ఆప్షనల్)
  • వాటర్ - పిండి తడుపుకోవడానికి కావాల్సినంత
  • ఆయిల్ - వేయించడానికి తగినంత

తయారీ విధానం :

  • ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం.. మొదటగా మిక్సీ జార్​లో పుట్నాలను తీసుకొని మెత్తని పౌడర్​లా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులో బియ్యప్పిండి, ఉప్పు, నువ్వులు, కారం, బటర్.. ఇలా ఒక్కొక్కటి వేసుకొని పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • అయితే, ఇక్కడ మీరు నువ్వులు వద్దనుకుంటే వాముని వాడుకోవచ్చు. అలాగే.. మీ దగ్గర బటర్ లేకపోతే కాగబెట్టుకున్న నెయ్యిని వేసుకోవచ్చు.
  • తర్వాత ఆ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్​గా మారేంత వరకు కలుపుకోవాలి.
  • ఆ విధంగా పిండిని కలిపిపెట్టుకున్నాక దానిపై ఒక పల్చని తడిగుడ్డను ఉంచి పది నిమిషాల పాటు అలా వదిలేయాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని డీప్​ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యేలోపు.. మురుకులు ప్రిపేర్ చేసుకునేది తీసుకుని దాని లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి.
  • తర్వాత మీరు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిముద్దను తీసుకొని మురుకుల గొట్టంలో పైన కొద్దిగా గ్యాప్ ఉంచి కూరుకోవాలి.
  • ఇక నూనె వేడి అయిందనుకున్నాక.. మంటను లో ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకొని మురుకుల గొట్టంతో నేరుగా నూనెలో మురుకుల షేప్​లో పిండిని వత్తుకోవాలి.
  • లేదంటే.. చిల్లుల గరిటె తీసుకొని దాని మీద మీకు కావాల్సిన షేప్​లో పిండిని వత్తుకొని ఆపై వాటిని కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వొచ్చు.
  • ఆ తర్వాత మంటను మీడియం టూ హై ఫ్లేమ్​లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మురుకులను అటూ ఇటూ గరిటెతో తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా కాలే వరకు వేయించుకోవాలి.
  • క్రిస్పీగా వేగాయనుకున్నాక.. ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే బియ్యప్పిండి జంతికలు రెడీ!
  • అయితే.. మురుకులు వేయించేటప్పుడు ఈ టిప్ పాటిస్తే అవి చాలా క్రంచీగా, క్రిస్పీగా రావడమే కాకుండా నూనె పీల్చకుండా గుల్లగా వస్తాయంటున్నారు వంట నిపుణులు. అదేంటంటే.. వేయించేటప్పుడు మురుకులను మరీ ఎక్కువగా.. తక్కువగా ఫ్రై చేయకూడదు.
  • ఎందుకంటే తక్కువగా ఫ్రై చేస్తే.. లోపల మెత్తమెత్తగా ఉంటాయి. ఎక్కువగా ఫ్రై చేస్తే బాగా గట్టిగా వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • అందుకే.. మురుకులను మీడియం, లైట్​ గోల్డెన్ కలర్​లోకి ఛేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుందట.

ABOUT THE AUTHOR

...view details