తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోట్లో వేసుకుంటే కరిగిపోయే "రసమలై" - ఇంట్లోనే సింపుల్​గా ఇలా ప్రిపేర్ చేసుకోండి! - టేస్ట్ అదుర్స్! - Rasmalai Recipe

Rasmalai Recipe in Telugu : మనలో చాలా మంది స్వీట్స్ అంటే ఎంతో ఇష్టపడతారు. అందులో రసమలైను ఇష్టపడేవారు ఎక్కువ మందే ఉంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా.. సూపర్ టేస్టీ "రసమలై రెసిపీ" తీసుకొచ్చాం. మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Soft Rasmalai
Rasmalai Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Oct 2, 2024, 4:42 PM IST

How to Make Soft Rasmalai at Home : ఎక్కువ మంది ఇష్టపడే స్వీట్ ఐటమ్స్​లో ఒకటి.. రసమలై. అయితే, చాలా మంది వీటిని టేస్ట్ చేయాలంటే స్వీట్ షాప్స్​కి వెళ్లాల్సిందే అనుకుంటారు. కానీ.. అలా వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా రసమలై ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకున్నారంటే బయట దొరికే వాటికంటే రుచికరంగా, పర్ఫెక్ట్​గా వస్తాయి! ఇంతకీ, ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

రసమలై ఉండల కోసం :

  • పాలు - 1 లీటర్
  • నిమ్మరసం - 2 టీస్పూన్లు

రసమలై జ్యూస్ కోసం :

  • పాలు - అరలీటర్
  • పంచదార - 7 టేబుల్​స్పూన్లు
  • యాలకుల పొడి - అరటీస్పూన్
  • కుంకుమ పువ్వు - చిటికెడు
  • పిస్తా తరుగు - 2 టేబుల్ స్పూన్లు
  • బాదం పలుకుల తరుగు - 2 టేబుల్ స్పూన్లు
  • యెల్లో ఫుడ్ కలర్ - చిటికెడు

చక్కెర సిరప్ కోసం :

  • పంచదార - ఒకటిన్నర కప్పు(350 గ్రాములు)
  • వాటర్ - 4 కప్పులు

తయారీ విధానం :

  • ముందుగా రసమలై ఉండల కోసం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టౌపై ఒక గిన్నెలో పాలు పోసుకొని మరిగించుకోవాలి.
  • తర్వాత స్టౌ ఆఫ్ చేసి పాలను రెండు నిమిషాలు చల్లార్చుకున్నాక అందులో నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. అదే.. పాలు వేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం వేసుకుంటే రసమలై సాఫ్ట్​గా రావు.
  • ఆవిధంగా కలుపుకున్నాక.. మళ్లీ ఆ బౌల్​ను స్టౌపై పెట్టి పాలు పూర్తిగా విరిగిపోయి.. నీళ్లు, పాలు సెపరేట్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి.
  • పాలు, నీళ్లు సెపరేట్ అయ్యాయనుకున్నాక.. స్టౌ ఆఫ్ చేసి అందులో ఒక కప్పు నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి.
  • అనంతరం ఒక ఖాళీ గిన్నెలో జాలి గంటెను ఉంచి దానిపై ఒక పల్చని కాటన్ క్లాత్ కప్పి పాలను వడకట్టుకోవాలి. తర్వాత క్లాత్​లోని మిశ్రమంలో వాటర్ పోసుకొని రెండు సార్లు బాగా కడగాలి. లేదంటే.. నిమ్మరసంలోని పులుపు అలాగే ఉండి రసమలై ఉండలు పుల్లపుల్లగా ఉండడమే కాకుండా సరైన టేస్ట్ రావు.
  • తర్వాత క్లాత్​ను చుట్టలా చుట్టి చేతితో బాగా పిండుతూ అందులోని అదనపు వాటర్​ను పిండేయాలి. ఆపై దాన్ని 20 నుంచి 30 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
  • ఆలోపు రసమలై జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం.. స్టౌపై పాన్ పెట్టి పాలు వేడి చేసుకోవాలి. పాలు వేడి అవ్వడం స్టార్ట్ అయ్యాక పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి ఒకసారి కలుపుకోవాలి. సాఫ్రాన్ లేకపోతే స్కిప్ చేయొచ్చు.
  • అనంతరం అందులో సన్నగా కట్ చేసుకున్న పిస్తా, బాదం పప్పుల తరుగు వేసి పాలను 6 నుంచి 7 నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత పాలు పసుపు కలర్​లోకి రావడానికి యెల్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి.
  • ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి పాలు కాస్త చిక్కబడే వరకు మరిగించుకోవాలి. అంటే.. కనీసం 5 నుంచి 8 నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి.
  • ఆవిధంగా మరిగించుకున్నాక.. స్టౌ ఆఫ్ చేసుకొని పాన్​ను దించి పక్కన పెట్టుకొని ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్​ బౌల్​ తీసుకొని అందులో క్లాత్​లో ఉన్న పాల ఘన పదార్థాన్ని వేసుకొని చేతితో మాష్ చేసుకుంటూ మెత్తని పిండి ముద్దలా తయారుచేసుకోవాలి. ఆపై ఆ పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం చక్కెర సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం.. స్టౌపై గిన్నె పెట్టుకొని చక్కెర, వాటర్ వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి.
  • ఆలోపు ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పిండి ఉండలను చేతితో కట్​లెట్​ షేప్​లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు చక్కెర కరిగి పాకంలా మారాక.. అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలను వేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్​ మీద 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • 10 నిమిషాలయ్యాక మూత తీసి చూస్తే ఉండల పరిమాణం రెట్టింపు అవుతుంది. అప్పుడు వాటిని మరోవైపు టర్న్ చేసుకొని మూతపెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని బౌల్​ను దింపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరో బౌల్​లో కొన్ని ఐస్​ క్యూబ్స్ తీసుకొని సగభాగం వరకు షుగర్ సిరప్ పోసుకోవాలి. ఆపై ఉడికించుకున్న ఉండలను అందులో వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా రసమలై ఉండలు మరీ మెత్తగా ఉడకకుండా త్వరగా కూల్ అవుతాయి.
  • అనంతరం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసమలై జ్యూస్​ను ఒక బౌల్​లోకి తీసుకొని.. అందులో ఐస్​క్యూబ్స్​లో ఉంచిన ఉండలను అదనపు షుగర్ సిరప్ తొలగిపోయేలా చేతితో జాగ్రత్తగా వత్తుకొని వేసుకోవాలి.
  • ఆ తర్వాత వెంటనే తినేయకుండా.. ఆ మిశ్రమాన్ని కనీసం 4 నుంచి 5 గంటలు ఫ్రిజ్​లో పెట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్​ బౌల్​లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. నోట్లో వేసుకుంటే కరిగిపోయే సూపర్ టేస్టీ "రసమలై" స్వీట్ రెడీ!

ఇవీ చదవండి :

గోధుమ పిండితో బాదుషా! - రుచి, ఆరోగ్యం ఒకేసారి - ఈ పండక్కి ఇలా తయారు చేయండి!

స్వీట్​ షాప్​ స్టైల్లో "బూందీ లడ్డూ" - ఈ టిప్స్​తో తయారు చేస్తే అమోఘమైన రుచి!

ABOUT THE AUTHOR

...view details