Psychiatrist Advice for Family Problem :జీవితంలో మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగవు. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే నిర్ణయాలు జరిగిపోతుంటాయి. మన చుట్టూ సమస్యలున్నాయని బాధపడకుండా.. ఆ చిక్కుల నుంచి ఎలా బయటపడగలమో ఆలోచించాలి. అప్పుడే జీవితంసాఫీగా ముందుగా సాగిపోతుందని మానసిక నిపుణులు చెబుతుంటారు. అయితే, ఓ మహిళ.. తన భర్తకు ఓ అనారోగ్య సమస్య ఉందని తెలిసి కూడా ఆ విషయం దాచి పెళ్లిచేశారని ఆందోళన చెందుతోంది. ఇంతకీ ఆమె సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇదీ సమస్య
'నాకు ఏడాదికిందట మ్యారేజ్ అయింది. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మా వారు ఒక్కోసారి కోపంలో ఏవేవో మాట్లాడుతుంటారు. మళ్లీ అంతలోనే అసలు ఏమీ జరగనట్లు చాలా కూల్‌గా ఉంటారు. మొదట్లో ఇది ఆయన తత్వం అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఆయన 5 ఏళ్ల నుంచీ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని ఇటీవలే వాళ్ల బంధువుల్లో ఒకరిద్వారా నాకు తెలిసింది. పెళ్లికి ముందు మా దగ్గర నిజం దాచారు. ఇప్పుడు నేను గర్భవతిని. పుట్టబోయే బిడ్డకు కూడా ఈ డిజార్డర్ వస్తుందేమో అని భయంగా ఉంది. ఏం చేయాలో చెప్పండి' అంటూ.. మానసిక నిపుణుల సహాయం కోరుతోంది ఓ మహిళ. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్కుప్రముఖ మానసిక నిపుణురాలు 'డాక్టర్ మండాది గౌరీదేవి' చక్కటి పరిష్కారం చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
నార్మల్‌గానే కొంతమంది భావోద్వేగాల్లో మార్పులు ఉంటుంటాయి. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడేవారిలో ఇలాంటివి ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకరకమైనటు వంటి మానసిక వ్యాధి. ఏదిఏమైనా కూడా.. ఇప్పటికే మీ వారు ఈ వ్యాధిని గుర్తించి, చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి శాశ్వత పరిష్కారం లేనప్పటికీ, మెడిసిన్ ద్వారా నియంత్రించుకోవచ్చు.