తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఎప్పుడైనా "ఆనియన్​ చపాతీ" తిన్నారా? - బ్రేక్​ఫాస్ట్​, డిన్నర్​కు సూపర్ ఛాయిస్! - HOW TO MAKE ONION CHAPATI AT HOME

- రెగ్యులర్​ చపాతీలు బోర్​ కొడితే ఇవి ట్రై చేయండి - తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది!​

How to Make Onion Chapati at Home
How to Make Onion Chapati at Home (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2024, 10:09 AM IST

How to Make Onion Chapati at Home: చపాతీ.. నేటి జనరేషన్​లో మెజార్టీ జనాలు వీటిని తినడానికే ఇంట్రస్ట్​ చూపిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు.. బీపీ, షుగర్​ను కంట్రోల్లో పెట్టాలనుకునేవారు కూడా కనీసం రోజులో ఒకపూటైనా చపాతీలను ఆహారంగా తీసుకుంటుంటారు. అంతేనా.. చాలా మంది తల్లుల్లు తమ పిల్లల లంచ్​ బాక్స్​ల్లో కూడా వీటిని పెడుతుంటారు. అయితే.. ఎప్పుడూ ఒకే రకమైన చపాతీలు తినాలంటే బోర్​ కొడుతుంది. అలాంటప్పుడు వెరైటీగా ఏమైనా తినాలనిపిస్తుంది. అలాంటి వారు ఓ సారి సూపర్​ సాఫ్ట్​గా, మరింత టేస్టీగా ఉండే ఆనియన్​ చపాతీలు ట్రై చేయండి. మామూలు చపాతీ కన్నా వీటి టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. పైగా దీనిలోకి వేరే కర్రీ ఏమి అవసరం లేదు. మరి ఈ రెసిపీ ప్రిపేర్​ చేయడానికి కావాల్సిన పదార్థాలు, కుకింగ్​ ప్రాసెస్​ ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • గోధుమ పిండి - 2 కప్పులు
  • పచ్చిమిర్చి - 2
  • ఉల్లిపాయ - 1
  • స్ప్రింగ్​ ఆనియన్స్​ - అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • గరం మసాలా - 1 టీ స్పూన్​
  • కారం - 1 టీ స్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, స్ప్రింగ్​ ఆనియన్స్​ను సన్నగా కట్​ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఓ బౌల్​ తీసుకుని అందులోకి గోధుమపిండి, సన్నగా కట్​ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, స్ప్రింగ్​ ఆనియన్స్​ ముక్కలు వేసుకోవాలి.
  • ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, కారం వేసుకోవాలి.
  • అనంతరం ఉల్లిపాయ ముక్కలను గట్టిగా పిండుతూ పిండిని ఓ సారి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి మాదిరి కలుపుకోవాలి. అయితే ఇక్కడ పిండిని ఎంత సేపు ఒత్తుకుంటే చపాతీలు అంత సాఫ్ట్​గా, రుచికరంగా వస్తాయి.
  • అలా కలుపుకున్న పిండి ముద్దపై తడి క్లాత్​ కప్పి ఓ 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  • అరగంట తర్వాత పిండి ముద్దను మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ ఉండను తీసుకుని చపాతీలు చేసే పీటపై పెట్టి పొడి పిండి చల్లుతూ చపాతీలుగా ఒత్తుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి చపాతీ పెనం పెట్టి వేడి చేసుకోవాలి. పెనం బాగా కాలుతున్నప్పుడు మాత్రమే ఒత్తుకున్న చపాతీలను వేసి రెండు వైపులా ఓ నిమిషం పాటు కాల్చుకోవాలి.
  • ఆ తర్వాత రెండు వైపులా కొద్దిగా నూనె అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని హాట్​ బాక్స్​లో పెట్టుకోవాలి.
  • ఇలా ఒత్తుకున్న చపాతీలన్నింటినీ కాల్చుకోవాలి. ఆ తర్వాత ప్లేట్​లోకి సర్వ్​ చేసుకుని తింటే సూపర్​ సాఫ్ట్​గా, మరెంతో రుచికరంగా ఉండే ఉల్లిపాయ చపాతీ రెడీ.
  • వీటిని విడిగా తిన్నా టేస్ట్​ అద్దిరిపోతుంది. ఒకవేళ కాంబినేషన్​ కావాలంటే బాగా చిలికిన పెరుగులో రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వ్​ చేసుకుంటే కాంబినేషన్​ అద్దిరిపోతుంది.
  • కేవలం ఇది మాత్రమే కాకుండా పచ్చిమిర్చి పచ్చడి కూడా సూపర్​గా ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details