తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఘుమఘుమలాడే "తెలంగాణ స్టైల్ తలకాయ కూర" - ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అదుర్స్! - TALAKAYA CURRY RECIPE

-మటన్ ప్రియుల కోసం అద్భుతమైన నాన్​వెజ్ రెసిపీ -ఈ టిప్స్ పాటించారంటే అద్భుతమైన రుచి

HOW TO MAKE TALAKAYA CURRY
Talakaya Curry (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Oct 12, 2024, 12:35 PM IST

How to Make Talakaya Curry in Telugu:దసరా రోజు పిండి వంటలతో పాటు.. మాంసాహారం తినే ప్రతి ఇంటా నాన్​వెజ్ ఐటమ్స్ ఘుమఘుమలాడాల్సిందే. అందులో ఎక్కువ మంది మటన్ ప్రియులు "తలకాయ కూర" అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ, చాలా మందికి తలకాయ కర్రీని సరిగ్గా ప్రిపేర్ చేసుకోవడం రాదు! అందుకే అలాంటి వారు ఈ కొలతలు ఫాలో అవుతూ.. తలకాయ కూరను వండుకోండి. తిన్నవారు ఎవరైనా సరే మీ కర్రీ టేస్ట్​కి ఫిదా అవ్వాల్సిందే! అంత అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ, ఈ సూపర్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • కేజీ - తలకాయ మాంసం
  • పావుకిలో - ఉల్లిపాయ
  • 100 గ్రాములు - టమాటా
  • ఆరు - పచ్చిమిర్చి
  • చెంచా - అల్లంవెల్లుల్లిపేస్ట్‌
  • తగినంత - కారం, పసుపు
  • చెంచా - ధనియాలపొడి
  • చెంచా - షాజీర
  • రుచికి సరిపడా - ఉప్పు
  • చెంచా - గరంమసాలాపొడి
  • మూడురెబ్బలు - పుదీనా
  • కొద్దిగా - కొత్తిమీర తరుగు
  • తగినంత - నూనె

"ఆంధ్ర స్టైల్​ మటన్ మసాలా" కర్రీ - ఒక్కసారి ఇలా చేసి చూడండి! - టేస్ట్ అద్దిరిపోతుంది!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా వేడినీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి తలకాయ మాంసాన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే.. రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా కొత్తమీర తరుక్కొని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. షాజీరా, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి 4 నిమిషాల పాట దోరగా వేయించుకోవాలి.
  • అవి మగ్గిన తర్వాత అందులో తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉప్పు వేసి కలిపి మరో 3 నిమిషాల పాటు వేగనివ్వాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ మాంసం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పసుపు వేసుకొని బాగా కలిపి పదినిమిషాలుంచితే నీరంతా పోతుంది.
  • ఆ తర్వాత అందులో తగినంత కారం, ధనియాలపొడి, గరంమసాలాపొడి, జీలకర్రపొడి, పుదీనా వేసి మరో ఐదునిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆపై తగినంత వాటర్ యాడ్ చేసుకొని మీడియం మంటపైన నలభై నిమిషాలపాటు లేదా తలకాయ కూర మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక.. చివరగా కొత్తిమీర తరుగు చల్లుకుని దించుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే తెలంగాణ స్టైల్ "తలకాయ కర్రీ" రెడీ!
  • మరి ఆలస్యమెందుకు ఈ దసరా నాడు మీ ఇంట్లో తలకాయ కూరను ఇలా ట్రై చేయండి.. ఇంటిల్లిపాది ఆస్వాదించండి!

దసరా స్పెషల్​: ఘుమఘుమలాడే మద్రాస్​ స్టైల్​ "మటన్​ బకెట్​ బిర్యానీ" - తిన్నారంటే జిందగీ ఖుష్ అయిపోతుంది!!

ABOUT THE AUTHOR

...view details