తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

క్రిస్మస్​ స్పెషల్​ "మష్రూమ్​ 65" - ఇలా చేస్తే టేస్ట్​ అదుర్స్​ - ఓసారి ట్రై చేయండి! - HOW TO MAKE MUSHROOM 65 AT HOME

-పుట్టగొడుగులతో కూర, పులావ్​, బిర్యానీ రొటీన్​ -ఇలా వెరైటీగా 65 ట్రై చేయండి

How to Make Mushroom 65 at Home
How to Make Mushroom 65 at Home (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 8 hours ago

How to Make Mushroom 65 at Home:శాకాహారులకు మాంసకృత్తులు అందించే పదార్థాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి. అయితే చాలా మంది ఎప్పుడో ఒకసారి వీటిని తింటుంటారు. అది కూడా రెస్టారెంట్స్​, హోటల్స్​కు వెళ్లినప్పుడు మాత్రమే ట్రై చేస్తుంటారు. ఎందుకంటే వీటిని ఇంట్లో ఎలా వండుకోవాలో తెలియదు. అయితే అలాంటి వారు మేము చెప్పే పద్ధతిలో ఓసారి పుట్టగొడుగుల 65 ప్రిపేర్​ చేసుకోండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. ఎలాగో క్రిస్మస్​, న్యూ ఇయర్​ రాబోతున్నాయి. అలాంటి సమయాల్లో వీటిని ట్రై చేస్తే పార్టీ టైమ్​కు పర్ఫెక్ట్​ కాంబినేషన్​. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • మైదా - పావు కప్పు
  • కార్న్​ఫ్లోర్​ - పావు కప్పు
  • కారం- అర టేబుల్​ స్పూన్​
  • ఉప్పు - 1 టీ స్పూన్​
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - అర టేబుల్​ స్పూన్​
  • వాటర్​ - పావు కప్పు
  • మష్రూమ్స్ -200 గ్రాములు

టాసింగ్​ కోసం:

  • నూనె - 3 టేబుల్​ స్పూన్లు
  • వెల్లుల్లి తరుగు - 2 టేబుల్​ స్పూన్లు
  • ఎండుమిర్చి - 2
  • పచ్చిమిర్చి - 2
  • ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్​ స్పూన్లు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కారం - అర టేబుల్​ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర పొడి - 1 టీస్పూన్​
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • గరం మసాలా- పావు టీ స్పూన్​
  • పెరుగు - అర కప్పు
  • రెడ్​ ఫుడ్​ కలర్​ - చిటికెడు(ఆప్షనల్​)​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నిమ్మరసం - అర చెక్క

తయారీ విధానం:

  • ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి కట్​ చేసుకుని పక్కన పెట్టాలి.
  • ముందుగా ఓ బౌల్​లోకి మైదా, కార్న్​ఫ్లోర్​, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్​, పావు కప్పు వాటర్​ పోసి పిండిని దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత కట్​ చేసిన మష్రూమ్స్​ను ఆ బౌల్​ వేసి ముక్కలకు పిండి పట్టేలా బాగా కోట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా మరుగుతున్నప్పుడు కోట్​ చేసిన మష్రూమ్స్​ కొద్దికొద్దిగా వేసుకుని మంటను హై ఫ్లేమ్​లో పెట్టి పైన కోటింగ్​ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని మష్రూమ్స్​ను నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటిని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు టాసింగ్​ చేయాలి. అందుకోసం.. స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్​ హీటెక్కిన తర్వాత వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి వేసి వెల్లుల్లి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసి ఓ నిమిషం వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోకి కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి జస్ట్​ 30 సెకండ్స్​ వేయించుకోవాలి.
  • ఆ తర్వాత పెరుగు వేసి మంటను సిమ్​లో పెట్టి బాగా కలపాలి. పెరుగు బాగా కలిసిన తర్వాత స్టవ్​ను హైలో పెట్టి ఫుడ్​ కలర్​ వేసి కలిపి పెరుగు దగ్గరకు వచ్చేలా ఉడికించుకోవాలి.
  • పెరుగు మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు ఫ్రై చేసిన మష్రూమ్స్​ వేసి 30 సెకన్ల పాటు హై ఫ్లేమ్​లో టాసింగ్​ చేయాలి.
  • ఆ తర్వాత కొత్తిమీర తరుగు, నిమ్మరసం చల్లి మరోసారి టాస్​ చేసిన తర్వాత వేడివేడిగా ప్లేట్​లోకి వేసి సర్వ్​ చేసుకుని టమాట సాస్ లేదా గ్రీన్​ చట్నీతో తింటే అద్దిరిపోవాల్సిందే.
  • నచ్చితే ఈ క్రిస్మస్​కు మీరూ ట్రై చేసి ఇంటిల్లిపాది ఎంజాయ్​ చేయండి.

వంటసోడా లేకుండా అద్దిరిపోయే "అరటికాయ బజ్జీలు" - ఇలా చేస్తే నూనెె తక్కువ, రుచి ఎక్కువ!

బ్యాచిలర్స్ రెసిపీ "చికెన్ టిక్కా బిర్యానీ" - వంట రాని వారు కూడా ఈజీగా చేసేస్తారు!

ABOUT THE AUTHOR

...view details