Mouthwatering recipe: మహిళల కిట్టీ పార్టీల్లోనే కాదు స్నేహితులు ఇంటికి వచ్చినపుడు ఈ స్నాక్స్ చేసి పెట్టారంటే మిమ్మల్ని అస్సలు మర్చిపోరు. మీ స్నేహం మరింత బలపడుతుంది. అంతే కాదు మీ సర్కిల్లో మీరే స్టార్ అని పొగిడేస్తారు. ఇంట్లో తరచూ ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే వద్దనేవారెవరు చెప్పండి! సొర గారెలు ఆరోగ్యంతో పాటు నోటికి చాలా రుచిగా ఉంటాయి. వీటిని మళ్లీ మళ్లీ కావాలంటారు. ఈ సొర గారెలను నూనెలో ఫ్రై చేసుకోవచ్చు. నూనె ఇష్ట పడని వారు పెనంపైనా కాల్చుకుని తీసుకోవచ్చు.
పూరీలు నూనె పీల్చకుండా పొంగాలంటే పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు! - సింపుల్ ట్రిక్
సొర గారెలు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లోకి, సాయంత్రం స్నాక్స్‌లాగా ఉపయోగపడతాయి. ఇందులో వేసుకునే పదార్థాలు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించడంతో పాటు నోటికి రుచిగా, సువాసన భరితంగా ఉంటాయి.
mouthwatering_sora_garelu_recipe_in_telugu (GettyImages) సొర గారెల తయారీకి కావాల్సిన పదార్థాలు
- సొరకాయ - 200 గ్రాములు
- లేత సొరకాయ అయితే తొక్క తీయాల్సిన అవసరం లేదు.
- తురుము - 3 కప్పులు
- పచ్చి మిర్చి - 8 నుంచి 10
- ఉప్పు - అర టీస్పూన్
- ఉల్లి తరుగు - కప్పు
- కరివేపాకు తరుగు - అర కప్పు
- కొత్తి మీర - అర కప్పు
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- నువ్వులు - అర కప్పు
- శనగపప్పు - పావు కప్పు
- పెసర పప్పు - పావు కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా (ఒకటిన్నర టీస్పూన్)
- బియ్యం పిండి - 3 కప్పులు
తయారీ విధానం
- ముందుగా సొరకాయను గ్రేటర్‌కు పెద్ద రంద్రాలున్న వైపు తురుము కోవాలి.
- ఈ తురుమును కొలుచుకుని తీసుకోవాలి. లేకపోతే బియ్యం పిండి ఎంత వేసుకోవాలో అర్థం కాదు. అందుకే తురుమును గ్లాసులు లేదా కప్పుల్లో కొలుచుకోవాలి.
- పిండి కలుపుకోవడానికి సొరకాయ తరుగును కడాయిలోకి తీసుకోవాలి.
- ఇపుడు కారం కోసం పచ్చిమిర్చి తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
- ఈ పచ్చిమిర్చి పొడిని సొరకాయ తరుగులో వేసుకోవాలి.
- ఆ తర్వాత ఇందులోనే కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి.
- జీలకర్ర, నువ్వులు వేసుకోవాలి.
- ముందుగా గంటపాటు నాన బెట్టుకున్న పచ్చి శెనగ పప్పుతో పాటు పెసర పప్పు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి.
- ఈ మిశ్రమంలోకి సొరకాయ తరుగు ఎంత తీసుకున్నామో అంతే మొత్తంలో బియ్యం పిండి వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.
- ఈ సమయంలోనే రుచి చూసుకుని ఇంకా అవసరమైతే ఉప్పు వేసుకోవచ్చు.
- పిండి మొత్తంగా బాగా కలిశాక గారెల కోసం చిన్న చిన్న బాల్స్ చేసుకుని పెట్టుకోవాలి.
- మొత్తం పిండి ఒకేసారికాకుండా ఒక వాయికి సరిపడా బాల్స్ రెడీ చేసుకుంటే చాలు.
- ఓ పెద్ద కడాయిలో నూనె పోసుకుని మంట పెట్టుకుని అది వేడయ్యే లోగా గారెలు వత్తుకుంటే సరిపోతుంది.
- ఈ గారెలను నీళ్లలో తడిపి ఆరబెట్టిన వస్త్రంపై వేసుకుని నూనె వేడెక్కాక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
- ఓ వైపు కొంచెం ఫ్రై చేసుకుని మరో వైపు కాల్చుకుంటే కరకరలాడే సొరగారెలు రెడీ. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది.
- ఈ గారెలు తింటుంటే పంటి కింద సొర కాయ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పప్పులు తగులుతుంటే ఆ రుచే వేరు.
గంటల కొద్ది మెత్తగా ఉండే "సొరకాయ చపాతీ" - మీ పిల్లలు ఒక్కటి కూడా మిగల్చరు!
కరకరలాడే "పెరుమాళ్ వడలు" - అచ్చం తిరుపతి "వడ ప్రసాదం" రుచి!