తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మంచు కురిసే వేళ అద్దిరిపోయే "మసాలా టీ" - వేడివేడిగా గొంతులోకి దిగుతుంటే ఆ కిక్కే వేరబ్బా! - MASALA TEA RECIPE

మసాలా టీ ఇలా ప్రిపేర్ చేస్తే సూపర్ టేస్ట్ - ప్రాసెస్ కూడా చాలా సింపుల్!

How To Make MASALA CHAI
Masala Tea Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2025, 11:54 AM IST

Updated : Jan 19, 2025, 12:15 PM IST

Masala Tea Recipe in Telugu : మనలో చాలా మందికి మార్నింగ్ లేవగానే కప్పు టీ కడుపులో పడందే రోజు మొదలు కాదు. అయితే, ఇటీవల కొందరు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, బరువును కంట్రోల్​లో ఉంచుకోవడానికి గ్రీన్ టీ, అల్లం టీ, పుదీనా టీ వంటివి రోజువారీ అలవాట్లలో భాగం చేసుకోవడం మనకు తెలిసిందే. అవి మాత్రమే కాదు చలికాలం పొద్దున్నే ఓసారి ఇలా "మసాలా చాయ్" ట్రై చేయండి. ఘూటుఘూటుగా ఉండి వేడివేడిగా గొంతులోకి దింగుతుంటే కలిగే ఆ కిక్కు వేరే లెవల్​లో ఉంటుంది. పైగా ఈ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ చలికాలం మంచుల కురిసే వేళ​లో ఇలా మసాలా టీని చేసుకొని తాగుతుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతం. మరి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • యాలకులు - 6
  • లవంగాలు - 5
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • అల్లం - రెండు ఇంచుల ముక్క
  • పంచదార - నాలుగు చెంచాలు
  • టీ పొడి - నాలుగు చెంచాలు
  • కాచిన పాలు - 3 గ్లాసులు

చలికాలంలో జలుబు, దగ్గు వేధిస్తోందా? - "ఉసిరి టీ" తాగితే మంచిదట! - పైగా ఈ ప్రయోజనాలు కూడా!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా యాలకులు, లవంగాలు, దాల్చినచెక్కను పొడిలా దంచుకోవాలి. ఆపై ఆ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచాలి. అలాగే, అల్లం ముక్కను కచ్చాపచ్చాగా దుంచుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై టీ కాచే గిన్నె పెట్టి మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోవాలి.
  • అర గ్లాసు వాటర్ తగ్గే వరకు బాగా మరిగించుకున్నాక ఆ నీటిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాల పొడి, కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం మొత్తం వేసి కలిపి ఇంకో అర గ్లాసు వాటర్ తగ్గే వరకు మరోసారి బాగా మరిగించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో పంచదార, టీ పొడి వేసి కలిపి మరికాసేపు బాగా మరగనివ్వాలి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఎంత బాగా మరిగితే టీ అంత రుచిరంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.
  • ఆవిధంగా మిశ్రమాన్ని మరిగించుకున్నాక అందులో కాచిన పాలను పోసుకోవాలి. అయితే, ఇక్కడ పచ్చి పాలను వాడకూడదు. అలా పోస్తే అవి విరిగిపోతాయని గుర్తుంచుకోవాలి.
  • అనంతరం ఒక పొంగు వచ్చేంత వరకు పాల మిశ్రమాన్ని మరిగించుకొని దింపేసుకుంటే చాలు. అంతే, ఘాటుఘాటుగా ఉండే టేస్టీ "మసాలా చాయ్" రెడీ!
  • ఆ తర్వాత వడకట్టుకొని మార్నింగ్ లేవగానే వేడివేడిగా ఈ టీని తాగుతుంటే ఆ కిక్కే వేరబ్బా! ఇందులోకి ఉస్మానియా బిస్కెట్స్ ​మంచి కాంబినేషన్. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ట్రై చేయండి. అద్భుతమైన ఫీలింగ్​ని ఆస్వాదించండి.

నెయ్యితో తయారైన టీ.. ఇప్పుడో ట్రెండ్! - తాగితే ఏమవుతుందో తెలుసా?

Last Updated : Jan 19, 2025, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details