తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోరూరించే కమ్మని "మసాలా పెరుగు కర్రీ" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్! - MASALA CURD CURRY

కూరగాయలు లేనప్పుడు చిటికెలో ప్రిపేర్ చేసుకునే సూపర్ రెసిపీ - ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలనడం పక్కా!

HOW TO MAKE MASALA CURD RECIPE
Masala Curd Curry Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2024, 6:05 PM IST

Masala Curd Curry Recipe in Telugu : ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేసే టైమ్ లేని సందర్భాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "మసాలా పెరుగు కర్రీ". చాలా రుచికరంగా ఉండే దీన్ని చాలా తక్కువ సమయంలో, సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు! ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పెరుగు - 1 కప్పు
  • నూనె - 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
  • సన్నని ఉల్లిపాయ తరుగు - 1 కప్పు
  • పచ్చిమిర్చి - 3
  • బిర్యానీ ఆకులు - 2
  • లవంగాలు - 4
  • యాలకులు - 3
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • పసుపు - పావు టీస్పూన్
  • కారం - రుచికి తగినంత
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • గరం మసాలా - అరటీస్పూన్
  • కరివేపాకు - కొద్దిగా
  • శనగపిండి - 2 టీస్పూన్లు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

టేస్టీ అండ్​ స్పైసీ "పెరుగు ఊర కారం పచ్చడి"- వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్​లో తాజా పెరుగునుతీసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగా పెరుగులో ఎలాంటి ఉండలు లేకుండా కలిపిపెట్టుకోవడం వల్ల కర్రీ చిక్కటి గ్రేవీతో చాలా రుచికరంగా వస్తుంది.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ తరుగు వేసుకొని గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆవిధంగా ఆనియన్స్​ను వేయించుకున్నాక అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, జీలకర్ర వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, తాజా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకున్నాక అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, కరివేపాకువేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో శనగపిండిని వేసుకొని కలిపి మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మిక్స్ చేసుకుని పెట్టుకున్న పెరుగును యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఆపై ఒక కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి బాగా ఉడికించుకోవాలి.
  • అయితే, ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి గరిటెతో కలుపుతూ మిశ్రమంలో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇందుకోసం 6 నుంచి 7 నిమిషాల వరకు టైమ్ పట్టొచ్చు.
  • ఇక చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే కమ్మని "మసాలా పెరుగు కర్రీ" రెడీ!
  • దీన్ని అన్నం, చపాతీ ఇలా దేనిలోకి తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది!

పెరుగు మిగిలినప్పుడు పుల్లగా అయిందని పడేస్తున్నారా? - కానీ, ఇలా అద్భుతంగా వాడొచ్చని మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details