తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

లంచ్ బాక్స్​లోకి అద్దిరిపోయే రెసిపీ - కర్ణాటక స్పెషల్ "వైట్ చిత్రాన్నం" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా!

ఉదయాన్నే హడావుడి లేకుండా నిమిషాల్లో చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ - ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఒక్క మెతుకు కూడా మిగల్చరు!

Karnataka Special White Chitrannam
White Chitrannam Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2024, 1:48 PM IST

Karnataka Special White Chitrannam Recipe :నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయాన్నే పిల్లలకు బ్రేక్​ఫాస్ట్ రెడీ చేసి.. లంచ్ బాక్స్​ కూడా అదే టైమ్​కి ప్రిపేర్ చేయడం కష్టమైన పనిగా భావిస్తుంటారు. అలాంటి వారికోసమే జస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ అయ్యే ఒక సూపర్ లంచ్ బాక్స్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. కర్ణాటక స్పెషల్ "వైట్ చిత్రాన్నం". ఇది చాలా రుచికరంగా ఉండడమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఇంతకీ.. ఈ సూపర్ టేస్టీ ఎండ్ హెల్దీ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • అన్నం - 1 కప్పు
  • పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
  • నూనె - 4 టేబుల్ స్పూన్లు
  • జీడిపప్పు పలుకులు - 15
  • పల్లీలు - 4 టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • మినప పప్పు - 1 టేబుల్ స్పూన్
  • శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
  • మిరియాలు - అర టీస్పూన్
  • ఎండుమిర్చి - 2
  • పచ్చిమిర్చి - 3
  • ఉల్లిపాయ తరుగు - అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • సోయాకూర తరుగు - ముప్పావు కప్పు
  • పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
  • నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్

పిల్లలకు లంచ్​ బాక్స్​ పెట్టే టైమ్​ లేనప్పుడు - పదే పది నిమిషాల్లో "టమాటా రైస్" చేయండిలా!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలనుఅర కప్పు పరిమాణంలో సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. అలాగే.. పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకోవాలి. సోయాకూరను సన్నగా తరిగి సిద్ధంగా పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. జీడిపప్పు పలుకులు, పల్లీలు వేసుకొని గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం అదే నూనెలో.. ఆవాలు, జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. ఆ తర్వాత శనగపప్పు, మినప పప్పు, మిరియాలు వేసుకొని స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మిశ్రమాన్ని ఎర్రగా వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే ఎండుమిర్చిని తుంపి వేసుకొని తాలింపుని క్రంచీగా మారే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • తాలింపు మంచిగా వేగిన తర్వాత.. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకొని.. ఆనియన్స్ కాస్త రంగు మారి మెత్తబడే వరకు వేయించుకోవాలి. అయితే, ఆనియన్స్ వేయించుకునేటప్పుడే ఉప్పు వేసుకొని వేయించుకుంటే అవి త్వరగా మగ్గుతాయి.
  • ఆవిధంగా మిశ్రమాన్ని వేయించుకున్నాక.. అందులో ముందుగా తరిగి పెట్టుకున్న సోయాకూర తరుగు వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. అంతేకానీ.. మరీ ఎక్కువసేపు వేయించుకోవద్దు.
  • ఆ తర్వాత అందులో పొడిపొడిగా వండుకున్నటువంటి అన్నం, పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని రైస్ వేడెక్కేంత వరకు అన్నీ కలిసేలా హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి.
  • అనంతరం నిమ్మరసం యాడ్ చేసుకొని మరోసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇక చివరగా ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులు, పల్లీలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే కర్ణాటక స్పెషల్ "వైట్ చిత్రాన్నం" రెడీ!

పిల్లలు లంచ్ బాక్స్ తినకుండా తెస్తున్నారా? - ఇలా 'ఆలూ రైస్' చేసి పెట్టండి! - బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు!

ABOUT THE AUTHOR

...view details