తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

స్టౌ మీద చాయ్ పొంగడం చిరాగ్గా ఉంటోందా? - ఈ "Tea ఫౌంటెయిన్" ఉంటే ఆ సమస్యే రాదు! - New Chai Maker

Chai Fountain Uses: చాయ్ ఎంత మధురంగా ఉంటుందో.. అది స్టౌమీద పొంగితే అంత చిరాగ్గా ఉంటుంది. ఆ టీ మరకల్ని క్లీన్ చేసుకోవడం ఒక పెద్ద పని. అయితే.. ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఒక "చాయ్‌ ఫౌంటెయిన్" వచ్చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

USES OF LOKA CHAI MAKER
Loka Chai Maker Uses (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 21, 2024, 10:40 AM IST

While Making Tea does it Spilling on Gas? :మనలో చాలా మందికి మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. కొందరికైతే టీ తాగకపోతే ఆ రోజు ఏదీ తోచదు. చాలా మంది టీని ఉత్తేజపరిచే రిఫ్రెష్​గా భావిస్తారు. ఇంత వరకూ బాగానే ఉన్నప్పటికీ.. టీ తయారు చేయడం కష్టంగా ఫీలవుతుంటారు. ఎందుకంటే.. స్టౌపైన చాయ్ పెట్టి ఏదైనా పని చేసుకుందామంటే కుదరదు. అలా వెళ్లి ఇలా వచ్చేసరికి పొంగుతాయి. అందువల్ల అక్కడే నిల్చొని ఉండాల్సి వస్తుంది.

కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. టీ చేసుకునే క్రమంలో అది పొంగి గ్యాస్ బర్నర్, స్టౌ మొత్తం తడిసిపోతుంది. ఆ టీ మరకలను తొలగించడం అనేది మరొక పెద్ద పనిగా ఉంటుంది. ఈ కష్టాలు తీర్చేందుకు మార్కెట్లోకి సరికొత్త చాయ్ మేకర్ వచ్చేసింది. అదే.. "చాయ్ ఫౌంటెయిన్".

ఇంట్లోనే హైదరాబాదీ​ "ఇరానీ చాయ్​" - ఈ టిప్స్​ పాటిస్తే జిందగీ ఖుష్ అయ్యే టీ ఆస్వాదిస్తారు!

ఈ చాయ్‌ ఫౌంటెయిన్​ స్టౌమీద పెట్టి.. అందులో పాలు, పంచదార, టీపొడి వేసుకుని మీ పని మీరు చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే.. ఆ ఫౌంటెయిన్​ నుంచి చాయ్ పొంగి స్టౌమీద పడదు. ఈ పాత్రను తయారు చేసిన ప్రత్యేక ఆకృతి వల్ల టీ పొంగినా తిరిగి ఆ పాత్రలోకే చేరిపోతుంది. అంతేకాదు.. అందులోనే ఫిల్టర్‌ కూడా ఉంటుంది. కాబట్టి.. మీరు మళ్లీ టీని వడకట్టాల్సిన పని కూడా ఉండదు. అంటే.. ఆ చాయ్ ఫౌంటెయిన్​తోనే నేరుగా కప్పుల్లోకి ఒంపుకోవచ్చు అన్నమాట. అంతేకాదు.. ఈ చాయ్ ఫౌంటెయిన్​ను క్లీన్ చేసుకోవడం కూడా చాలా తేలికేనట. ఎందుకంటే.. ఈ పాత్ర నాన్‌స్టిక్‌, స్టీల్‌తో చేసి ఉంటుందంటున్నారు నిపుణులు. సో.. విన్నారుగా? మీకు నచ్చితే.. చాయ్​ పొంగులకు చెప్పండి గుడ్ బై. చాయ్ ఫౌంటెయిన్​కు చెప్పండి వెల్కమ్.

ఇవీ చదవండి :

మీరు వాడే "టీ పొడి" స్వచ్ఛమైనదా? కల్తీదా? - ఈ టిప్స్​తో నిమిషాల్లో కనిపెట్టండి!

ఛాయ్​ ఎంత సేపు మరిగిస్తున్నారు? - అంతకు మించితే ఆరోగ్యానికి ముప్పు తప్పదు!

ABOUT THE AUTHOR

...view details