తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అమ్మమ్మల కాలం నాటి "కంది పచ్చడి" - మీరు ఎన్నడూ చూడని రుచి చూస్తారు! - Kandi Pachadi Recipe

కందిపప్పుతో.. పప్పు, సాంబార్​ చేయడం మనందరికీ తెలుసు. కానీ.. ఈ పప్పుతో అద్దిరిపోయే కంది పచ్చడి కూడా చేయొచ్చని మీకు తెలుసా? ఆ ప్రాసెస్ ఏంటో మీరూ చూడండి..

Kandi Pachadi Recipe
Kandi Pachadi Recipe in Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 11:41 AM IST

Kandi Pachadi Recipe in Telugu :మనలో చాలా మందికి భోజనంలో ఎన్ని కూరలున్నా కూడా.. నిల్వ పచ్చడిఉండాల్సిందే. పచ్చడితో రెండు ముద్దలు తింటేనే తృప్తిగా ఉంటుంది. ఇలాంటి వారికోసం మహిళలు ఇంట్లో ఎప్పుడూ టమాటా, గోంగూర, దోసకాయ వంటి వివిధ రకాల పచ్చళ్లను తయారు చేస్తుంటారు. అయితే.. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి కందిపప్పుతో అద్దిరిపోయే కంది పచ్చడి ట్రై చేయండి.

ఇది అమ్మమ్మల కాలం నాటి పచ్చడి. దీన్ని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే.. టేస్ట్​ అమృతంలా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏవీ లేనప్పుడు చేసుకునే బెస్ట్​ రెసిపీల్లో ఇదీ ఒకటి. మరి ఇంకెందుకు ఆలస్యం? సూపర్ టేస్టీగా చాలా త్వరగా రెడీ అయ్యే కందిపచ్చడిని ఎలా చేయాలి ? ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • కంది పప్పు- కప్పు
  • ఎండుమిర్చి-15
  • జీలకర్ర-టీస్పూన్​
  • కరివేపాకు-2
  • చింతపండు-కొద్దిగా
  • వెల్లుల్లి రెబ్బలు-10
  • ఉల్లిపాయ -1
  • పసుపు

తాలింపు కోసం..

  • ఆవాలు
  • జీలకర్ర
  • మినపప్పు
  • నూనె-2 టేబుల్​స్పూన్లు

తయారీ విధానం..

  • ముందుగా స్టౌ పై పాన్​ పెట్టి కందిపప్పు వేయించుకోవాలి. సన్నని మంటమీద కందిపప్పుని ఎర్రగా వేపుకుంటే కంది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దోరగా వేగిన పప్పుని గిన్నెలోకి తీసుకుని నీటిలో నానబెట్టండి.
  • అలాగే చింతపండు కూడా కొద్దిసేపు నీటిలో నానబెట్టుకోండి.
  • ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా నూనె పోయండి. తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేపుకోండి.
  • ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఒకసారి గ్రైండ్​ చేయండి.
  • అలాగే ఇప్పుడు గిన్నెలో నానబెట్టుకున్న కందిపప్పు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన చింతపండు వేసి గ్రైండ్​ చేయండి. మధ్యలో కొన్ని నీళ్లు యాడ్​ చేసుకుంటూ పచ్చడిలా అయ్యే దాకా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది రోటిలో నూరుకుంటే చాలా బాగుంటుంది.
  • పచ్చడి నూరుకున్న తర్వాత తాలింపు కోసం పాన్​లో ఆయిల్ వేయండి.
  • నూనె హీట్​ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేయండి. ఇప్పుడు ఆ తాలింపులో గ్రైండ్ చేసుకున్న కంది పచ్చడి వేసుకుని బాగా కలుపుకోండి.
  • అంతే.. ఇలా సింపుల్​గా తయారయ్యే ఈ కంది పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా మీ ఇంట్లోవారికి ఈ పచ్చడి చేసి తినిపించండి.

ఇవి కూడా చదవండి :

కాకరకాయ తినలేకపోతున్నారా? - ఇలా "కాకర ఉల్లికారం" ప్రిపేర్ చేయండి - ప్లేట్ మొత్తం పక్కా ఖాళీ!

నెల్లూరు స్టైల్​ "రసం" - ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి - డైరెక్టుగా రసమే తాగేస్తారు!

ABOUT THE AUTHOR

...view details