IRCTC Sai Shivam Tour Package : ఐఆర్‌సీటీసీ టూరిజం తక్కువ ధరలోనే పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు జనాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి షిరిడీ, నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలనే వారికోసం అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. "సాయి శివం" పేరుతో IRCTC టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మరి, ఈ టూర్ ఎన్ని రోజులు సాగుతుంది? టికెట్ ధర ఎంత? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆపరేట్ చేస్తోన్న(IRCTC) సాయి శివం (Sai Shivam) టూర్ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ ఆలయం, నాసిక్ చూడొచ్చు. హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ పర్యటన మొత్తం 3 రాత్రులు, 4 రోజులుగా కొనసాగుతుంది.
ప్రయాణం కొనసాగనుందిలా
- మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6:40 గంటలకు ట్రైన్(అజంతా ఎక్స్ప్రెస్ - 17064) స్టార్ అవుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
- రెండో రోజు మార్నింగ్ 7 గంటల 10 నిమిషాలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్ చేసుకుని షిరిడీ తీసుకెళ్తారు. అక్కడ హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి. ఆ తర్వాత సాయిబాబాదర్శనం ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రి అక్కడే బస చేస్తారు.
- మూడో రోజు షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి నాసిక్కి బయలుదేరుతారు. అక్కడ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, పంచవటి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు ట్రైన్ ఉంటుంది. 09:20 గంటలకు అది బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- నాలుగో రోజు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ నుంచి IRCTC సూపర్ టూర్ - ఒకే ట్రిప్‌లో కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ చూడొచ్చు!