IRCTC Royal Rajasthan Package: రాజస్థాన్ అనగానే.. రాచరికానికి దర్పం పట్టే కోటలు, ప్యాలెస్‌లు, సరస్సులు.. ఇలా ఎన్నో మదిలోకి వస్తాయి. ఫేమస్ సెలబ్రిటీల వివాహాలు కూడా ఎక్కువగా ఇక్కడే జరుగుతుంటాయి. అందుకే చాలా మంది వీటిని చూడాలని అనుకుంటుంటారు. అందుకే.. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందుబాటు ధరలోనే ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రాజస్థాన్‌లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ఐఆర్సీటీసీ టూరిజం "‘రాయల్ రాజస్థాన్ (ROYAL RAJASTHAN)" పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌తో పాటూ ఉదయ్‌పూర్, జోధ్‌పూర్ వంటి నగరాలను సందర్శించొచ్చు. 5 రాత్రులు, 6 పగళ్లతో ఈ టూర్ ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటిరోజు:హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తెల్లవారుజామున 4:45 గంటలకు ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రెండు గంటల్లో జైపూర్ విమానాశ్రయానికి రీచ్ అవుతారు. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత.. అక్కడి నుంచి హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెషప్ అనంతరం జైపూర్ సిటీ ప్యాలెస్ వీక్షిస్తారు. తిరిగి హోటల్‌కు చేరుకుని లంచ్ పూర్తి చేసి అమేర్ ఫోర్ట్ చూడటానికి వెళ్తారు. తిరిగి అదే హోటల్లో భోజనం,స్టే చేయాల్సి ఉంటుంది.
- రెండో రోజు:ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకున్నాక హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి పుష్కర్‌కు బయలుదేరుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయ్యి పుష్కర్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఒకవేళ సమయం ఉంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఆ రాత్రికి భోజనం, బస ఆ హోటల్లోనే ఉంటుంది.
- మూడో రోజు:ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత జోధ్‌పూర్‌కు బయల్దేరుతారు. మెహ్రాన్ఘర్ కోటను సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్లో చెకిన్ అవుతారు. ఆ రాత్రికి భోజనం, స్టే జోధ్‌పూర్‌లో ఉంటుంది.
- నాలుగో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి ఉమైద్ భవన్ ప్యాలెస్ అందాలు వీక్షిస్తారు. అక్కడి నుంచి రణక్ పూర్ బయలుదేరుతారు. అక్కడ జైన దేవాలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి ఉదయ్‌పూర్ స్టార్ట్ అవుతారు. అక్కడికి చేరుకుని హోటల్లో చెకిన్ అయ్యి.. రాత్రికి భోజనం, స్టే అక్కడే చేస్తారు.
- ఐదో రోజు: హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సిటీ ప్యాలెస్ అందాలు వీక్షిస్తారు. మధ్యాహ్నం నాథ్‌ద్వారా వెళ్తారు. అక్కడ స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ దర్శించుకుంటారు. తిరిగి ఉదయ్‌పూర్ చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఉదయపూర్ హోటల్లో డిన్నర్ ఇంకా స్టే ఉంటుంది.
- ఆరో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి సహేలియోన్ కీ బరీ చూస్తారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు స్టార్ట్ అవుతారు. సాయంత్రం 4:45 గంటలకు విమానం హైదరాబాద్‌కు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.
కూర్గ్ అందాలను చూసేందుకు - IRCTC సూపర్ ప్యాకేజీ! ధర చాలా తక్కువ!