తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

IRCTC అద్దిరిపోయే టూర్ - తక్కువ ధరకే "మధ్యప్రదేశ్​" అందాలను చుట్టేసి రావొచ్చు! - IRCTC MADHYA PRADESH TOUR

మధ్యప్రదేశ్​ అందాలను వీక్షించే అద్భుత అవకాశం - తక్కువ ధరలోనే ఐర్​ఆర్​సీటీసీ సూపర్ టూర్!

IRCTC MADHYA PRADESH TOUR
Magical Madhya Pradesh Tour (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 10 hours ago

IRCTC Magical Madhya Pradesh Tour : మధ్యప్రదేశ్​లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు సందర్శించాలనుకుంటున్నారా? అయితే, మీకోసం ఒక సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్​సీటీసీ. తక్కువ ధరలో మధ్యప్రదేశ్ అందాలను కనులారా వీక్షించే గొప్ప అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ, ఈ ప్యాకేజీ ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటుంది? ధర ఎంత? ఏ ఏ ప్రదేశాలు చూడొచ్చు? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​(ఐఆర్​సీటీసీ) "మ్యాజికల్​ మధ్యప్రదేశ్" పేరుతో ఈ టూర్​ని ఆపరేట్ చేస్తోంది. ఇది మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్​ నుంచి ట్రైన్​ జర్నీ ద్వారా మధ్యప్రదేశ్​ అందాలను చూసి రావొచ్చు​​.

టూర్ కొనసాగనుందిలా..

డే 1 :మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్​లో 4 గంటల 40 నిమిషాలకు మీ టూర్ స్టార్ట్ అవుతుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్(ట్రైన్ నంబర్ 12707)లో ఓవర్ నైట్ జర్నీ కొనసాగుతుంది.

డే 2 : రెండో రోజు మార్నింగ్ 8 గంటల 15 నిమిషాలకు భోపాల్ రీచ్ అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి హోటల్​కు వెళ్తారు. హోటల్​లో చెకిన్ అండ్ ఫ్రెషప్ తర్వాత సాంచికి బయలుదేరుతారు. సాంచి స్తూపాన్ని సందర్శిస్తారు. అనంతరం భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్​ దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరిగి భోపాల్ చేరుకుంటారు. ఈవెనింగ్ ట్రైబల్ మ్యూజియం విజిటింగ్ ఉంటుంది. ఆ రాత్రికి భోపాల్​లోనే బస చేస్తారు.

డే 3 : మూడో రోజు బ్రేక్​ఫాస్ట్ అనంతరం పచ్మార్హికి స్టార్ట్ అవుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యాక.. ఫ్రీ టైమ్​లో అక్కడి ​ప్రదేశాలు వీక్షించొచ్చు. ఆ తర్వాత ఆ రోజు రాత్రికి అదే హోటల్​లో స్టే ఉంటుంది.

డే 4 :నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత పాంచ్​​ పాండవ్​ కేవ్స్, జట శంకర్​ ఆలయాన్ని​ దర్శించుకుంటారు. అదేవిధంగా.. బీ ఫాల్స్​, సన్​సెట్​ పాయింట్​ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం తిరిగి హోటల్​కు చేరుకుని అక్కడే నైట్​ స్టే చేస్తారు.

డే 5 :ఐదో రోజు మార్నింగ్ టిఫెన్ అనంతరం ​​జబల్​పూర్​కి స్టార్ట్ అవుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యాక.. మధ్యాహ్నం మార్బుల్​ రాక్స్, ధుంధర్ జలపాతం విజిట్ చేస్తారు. ఆ తర్వాత జబల్​పూర్​ రైల్వే స్టేషన్​కి బయలుదేరుతారు. అక్కడి నుంచి తెల్లవారు జామున 2 గంటలకు సికింద్రాబాద్​కు రిటర్న్​ జర్నీ మొదలవుతుంది.

డే 6 : ఆరో రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్​కు చేరుకోవడంతో మీ పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ధర వివరాలు చూస్తే :

1 నుంచి 3 గురు ప్యాసింజర్స్​కు..

  • కంఫర్ట్​(3AC)లో ట్విన్​ షేరింగ్​కు రూ.24,150 చెల్లించాలి. ట్రిపుల్​ షేరింగ్​కు రూ.18,440గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.13,550, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.11,910 చెల్లించాలి.
  • స్టాండర్డ్(SL)లో ట్విన్ షేరింగ్​కు రూ.21,750 చెల్లించాలి. ట్రిపుల్ షేరింగ్​కు రూ.16,050గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.11,150, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.9,510 చెల్లించాలి.

4 నుంచి 6 గురు ప్యాసింజర్స్​కు..

  • కంఫర్ట్​(3AC)లో ట్విన్​ షేరింగ్​కు రూ. 20350 చెల్లించాలి. అదే ట్రిపుల్ షేరింగ్​కు రూ.17,140 పే చేయాలి.
  • స్టాండర్డ్(SL)లో ట్విన్ షేరింగ్​కు రూ.17,950, ట్రిపుల్ షేరింగ్​కు రూ.14,740గా నిర్ణయించారు.

ఐఆర్​సీటీసీ ఆపరేట్ చేస్తున్న ఈ టూర్​ ప్రతి శుక్రవారం పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఇవీ చదవండి :

ఇయర్​ ఎండ్​ షిరిడీ టూర్ - తక్కువ ధరకే IRCTC అద్భుత ప్యాకేజీ!

IRCTC "గోల్డెన్​ సాండ్స్​ ఆఫ్​ రాజస్థాన్​" - అందుబాటు ధరలోనే ఆరు రోజుల ప్యాకేజీ - ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు!

ABOUT THE AUTHOR

...view details