Instant Breakfast Recipe in Telugu: డైలీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ, చపాతీ.. వంటి టిఫెన్స్ ప్రిపేర్ చేసుకుంటుంటాం. అయితే, కొన్ని సందర్భాల్లో అలాంటి టిఫెన్స్ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇంట్లో ఉండవు. ఒకవేళ ఉన్నా.. వాటిని తయారు చేసుకోవడానికి కావాల్సినంత టైమ్ ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో.. ఈ ఇన్స్టంట్ ఊతప్పం రెసిపీని ట్రై చేయండి. కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లో దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు! ఇంతకీ, దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బొంబాయి రవ్వ - 1 కప్పు
- బంగాళ దుంపలు - 2(మీడియం సైజ్‌వి)
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉల్లిపాయ - 1(మీడియం సైజ్)
- క్యారెట్లు - 2(మీడియం సైజ్)
- పచ్చిమిర్చి - 4
- కరివేపాకు - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
- ఆయిల్ - కొద్దిగా(కాల్చుకోవడానికి)
తెల్ల ఇడ్లీతో షుగర్ సమస్యా! - చక్కటి ఆరోగ్యాన్ని అందించే రాగి ఇడ్లీ - ఇలా ప్రిపేర్ చేసుకోండి!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన బంగాళదుంపలనుపొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక నీళ్లలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అలాగే.. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నని తరుగులా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీరను సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి. క్యారెట్స్‌ను కూడా సన్నని తరుములా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో బొంబాయి రవ్వ వేసుకొని మెత్తగా అవ్వడానికి రెండుసార్లు అలా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలను వేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని మెత్తని మిశ్రమంలా మిక్సీ పట్టుకోవాలి.
- అనంతరం దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై అందులో ఉప్పు, కట్ చేసుకొని పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగుతో పాటు సన్నని క్యారెట్తురుమూ వేసుకొని అన్నీ కలిసేలా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆవిధంగా ప్రిపేర్ చేసుకున్నాక.. అందులో బేకింగ్ పౌడర్ వేసుకొని దానిపై రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మరోసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆపై వెంటనే ఈ పిండితో బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవాలి.
- అందుకోసం.. స్టౌపై పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక కలిపిపెట్టుకున్న మిశ్రమం నుంచి పాన్‌కి తగినట్లుగా పిండిని తీసుకొని ఊతప్పంలా వేసుకోవాలి.
- ఆపై మూతపెట్టి స్టౌను లో ఫ్లేమ్‌లో ఉంచి ఒకవైపు చక్కగా కాలనివ్వాలి. వన్‌సైడ్ మంచిగా కాలాక గరిటెతో టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "ఇన్స్టంట్ ఊతప్పం" రెడీ!
- తర్వాత వీటిని ఇంట్లో ఉన్న ఊరగాయతో కలిపి తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది!
పప్పు నానబెట్టి రుబ్బాల్సిన పనే లేదు - ఈ పదార్థాలతో నిమిషాల్లో అతి మృదువైన ఇడ్లీలు రెడీ!