How to Make Tomato Nilava Pachadi: మనం ఏ కర్రీ వండినా సరే.. అందులో దాదాపు టమాటాలను తప్పనిసరిగా వాడుతుంటాం. పుల్లపుల్లగా ఉండే ఈ టమాటాలు వంటల టేస్ట్‌ను మరింతగా పెంచుతాయి. అలాంటిది కేవలం టమాటాలతోనే తయారు చేసే రోటి పచ్చళ్లు అంటే మరి ఇంకెంత టేస్టీగా ఉంటాయి! ఈ టమాటా పచ్చడిని ఒక్కసారి చేసుకుంటే 3 నెలల పాటు నిల్వ పెట్టుకోవచ్చట. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ నేపథ్యంలోనే టామాటా నిల్వ పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలి? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- కిలో టమాటా
- 100 గ్రాముల చింతపండు
- ఒక టీ స్పూన్ పసుపు
- ఒక టేబుల్ స్పూన్ మెంతులు
- 2 టేబుల్ స్పూన్ల ఆవాలు
- ఒక కప్పు కారం
- అర కప్పు ఉప్పు
- 2 వెల్లుల్లి గడ్డలు
తయారీ విధానం..
- ముందుగా ఎర్రగా పండిన టమాటాలను తీసుకుని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడవాలి. ఆ తర్వాత కాసేపు గాలికి ఆరబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
- చింతపండులో గింజలు, ఈకలు లేకుండా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో టమాటా ముక్కలు, చింతపండును వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. (మాడిపోయి అడుగు అంటకుండా ఉండేందుకు మధ్యమధ్యలో కలపాలి)
- టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత మూత తీసి ఉడికించుకోవాలి. (మూత పెట్టడం వల్ల ఆవిరి నీళ్లు పడి పచ్చడి త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది)
- ఇందులో పసుపు వేసి కలిపి టమాటా దగ్గర పడేంత వరకు ఉడికించుకుని ఆ తర్వాత పక్కను పెట్టి చల్లారబెట్టుకోవాలి.
- మరో గిన్నెను తీసుకుని మెంతులు వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఆవాలు వేసుకుని నిమిషం పాటు వేయించి పక్కకు పెట్టుకోవాలి. అనంతరం వీటిని మిక్సీ పట్టుకుని పొడిగా చేసుకోవాలి.
- చల్లారబెట్టుకున్న టమాటా మిశ్రమంలో కారం, ఉప్పు, మెంతులు- ఆవాలు పొడి, వెల్లుల్లి వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని జార్‌లోకి తీసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. (ఒక వేళ మీకు టమాటా ముక్కలు నోటికి తగలాలంటే కొద్దిగా మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోకుండా కలపాలి)