తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

తెలంగాణ పెళ్లిళ్ల స్పెషల్ "రెడ్ చికెన్" - ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్ అదుర్స్! - RED CHICKEN HYDERABADI RECIPE

-డిఫరెంట్​ రుచితో​ చికెన్​ కర్రీ -ఈ టిప్స్​తో తక్కువ సమయంలో చేసుకోవచ్చు!

Red Chicken Hyderabadi Recipe
Red Chicken Hyderabadi Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Oct 15, 2024, 12:05 PM IST

Red Chicken Hyderabadi Recipe: పెళ్లి భోజనం అంటేనే స్పెషల్. దావత్​లకు పోయినప్పుడు ఎప్పుడూ తినే మసాలాలతో చికెన్ చేస్తే ఎవరు తింటారు చెప్పండి. అందుకే వైరైటీగా ఇలా రెడ్ చికెన్ ట్రై చేయండి. ముఖ్యంగా తెలంగాణలో జరిగే పెళ్లిళ్లో ఇది పక్కా ఉంటుంది! అలా అని కేవలం పెళ్లిలోనే కాకుండా వీకెండ్స్​ లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇది బాగారా రైస్ లేదా రుమాలీ రోటీతో భలేగా ఉంటుంది. రెగ్యూలర్ మసాలాలు వేసి చేసే వాటికంటే చాలా బాగుంటుంది. ఇంకా దీనిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మసాలా కోసం కావాల్సిన పదార్థాలు

  • 10 బాదం పప్పులు
  • 10 పిస్తా పప్పులు
  • 10 జీడి పప్పులు
  • 2 టీ స్పూన్ల చిరోంజి
  • అర ఇంచు దాల్చిన చెక్క
  • 4 యాలకలు
  • 2 లవంగాలు
  • అర టీ స్పూన్ మిరియాలు

కావాల్సిన పదార్థాలు

  • అర కిలో చికెన్
  • రుచికి సరిపడా ఉప్పు
  • అర చెక్క నిమ్మరసం
  • ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 3 టేబుల్ స్పూన్ల నూనె
  • 2 టీ స్పూన్ల నెయ్యి
  • 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ (ఆప్షనల్)
  • 3 పచ్చిమిరపకాయలు
  • పావు కప్పు పెరుగు
  • 2 టమాటాల పేస్ట్
  • ఒక టీ స్పూన్ షాజీరా
  • ఒక టీ స్పూన్ ధనియాల పొడి
  • ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి
  • 2 టీ స్పూన్ల కశ్మీరి కారం
  • ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం
  • 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్
  • ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్
  • ఒకటిన్నర టేబుల్ స్పూన్ టమాటా కెచప్
  • ఒక టేబుల్ స్పూన్ వెనిగర్
  • అర కప్పు వేయించిన ఉల్లిపాయ తరుగు
  • చిన్నకట్ట కొత్తిమీర
  • రెండు చిటికెల రెడ్ ఫుడ్ కలర్ (ఆప్షనల్)

తయారీ విధానం

  • ముందుగా చికెన్​ను శుభ్రంగా కడిగి ఉప్పు, అల్లం వెల్లులి పేస్ట్, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి ఓ పాన్​లో మసాలా పేస్ట్ కోసం బాదం, పిస్తా, జీడి పప్పులు, చిరోంజి, దాల్చిన చెక్క, యాలకలు, లవంగాలు, మిరియాలు, పచ్చిమిరపకాయలు వేసి లో ఫ్లేమ్​లో కాసేపు వేయించుకుని దించేసుకోవాలి.
  • ఆ తర్వాత దీనిని మిక్సీ జార్​లో వేసి కొద్దిగా నీళ్లు పోసి వెన్నలా మెత్తగా చేసుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చికెన్​లో గ్రైండ్ చేసిన మసాలా మిశ్రమం, పెరుగు, టమాటా పేస్ట్, షాజీరా, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, కశ్మీరి చిల్లీ పౌడర్, కారం, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కెచప్, వెనిగర్, వేయించుకున్న ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర వేసి ఫ్రిజ్​లో పెట్టుకోవాలి.
  • కనీసం 2 గంటలు ఫ్రిజ్​లో పెడితే ఫ్లేవర్స్ మసాలాలూ చికెన్​కు బాగా పట్టి రుచిగా ఉంటుంది. (అవసరమైతే కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు)
  • రెండు గంటల తర్వాత స్టౌ ఆన్ చేసి ఓ పాన్​లో నెయ్యి వేసి కరిగించుకోవాలి.
  • ఇందులోనే నానబెట్టుకున్న చికెన్​ను వేసి బాగా కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. (ప్రతీ 5 నిమిషాలకి ఒక సారి చికెన్​ను కలుపుతూ ఉండాలి)
  • ఆ తర్వాత నూనె పైకి తేలాక ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి దించేసుకుంటే టేస్టీ తెలంగాణ వెడ్డింగ్​ స్టైల్​ రెడ్ చికెన్ రెడీ!

ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలు- ఎంతో రుచికరమైన "పాలకోవా" ఈజీగా చేసుకోవచ్చు!

అద్దిరిపోయే కొరియన్ స్టైల్ "పొటాటో బైట్స్" - ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఒక్కటీ వదలరు!

ABOUT THE AUTHOR

...view details