తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పప్పు, బియ్యం నానబెట్టే పనిలేదు - కేవలం 10 నిమిషాల్లోనే అద్దిరిపోయే గోధుమపిండి ఉల్లిదోశ! - Godhuma Pindi Dosa Recipe in Telugu - GODHUMA PINDI DOSA RECIPE IN TELUGU

ఎప్పుడూ తినే రొటీన్ దోశలు కాకుండా వెరైటీగా గోధుమపిండితో దోశ ట్రై చేయండి.. టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంకా దీని తయారీకి ఎక్కువగా కష్టపడాల్సిన పనికూడా లేదు. ఈజీగా ఇన్​స్టంట్​గా చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Godhuma Pindi Dosa Recipe in Telugu
Godhuma Pindi Dosa Recipe in Telugu (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Oct 6, 2024, 9:41 AM IST

Godhuma Pindi Dosa Recipe in Telugu: మనలో చాలా మందికి దోశలు అంటే చాలా ఇష్టం. కానీ దోశల తయారీ విధానం చూసి కాస్త వెనుకడగు వేస్తుంటారు. ఎందుకంటే దోశలు చేసుకోవాలంటే ముందు రోజు నుంచి అన్నీ రెడీ చేసుకోవాల్సిందే. ఇక అలాంటి టెన్షన్ అక్కర్లేకుండా ఇన్​స్టంట్​గా దోశలు వేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడు రొటీన్​గా చేసేవి కాకుండా వెరైటీగా గోధుమ పిండి ఉల్లిదోశ చేసుకోవచ్చు. ఇంకా దీనిని చాలా సులభంగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమపిండి దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • అర కప్పు గోధుమ పిండి
  • ఒక చెంచా బియ్యం పిండి
  • పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు
  • రుచికి సరిపడా ఉప్పు
  • కొద్దిగా కొత్తిమీర
  • ఒక చెంచా నూనె
  • ఒక టీ స్పూన్ ఆవాలు
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • ఒక టీ స్పూన్ శనగపప్పు
  • ఒక కరివేపాకు రెమ్మ
  • 4 పచ్చిమిరపకాయ ముక్కలు
  • పావు కప్పు టమాటా ముక్కలు
  • పావు టీ స్పూన్ అల్లం తురుము
  • పావు చెంచా పసుపు

గోధుమపిండి దోశ తయారీ విధానం:

  • ముందుగా స్టౌ ఆన్ చేసి ఒక కడాయిలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి.
  • ఇప్పుడు అందులోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి.
  • ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని రంగు మారేదాకా మగ్గనివ్వాలి.
  • అనంతరం అందులోనే పచ్చిమిర్చి, అల్లం తరుగు కూడా వేసి ఓ నిమిషం పాటు వేయించాలి.
  • ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టి మెత్తగా అయ్యేవరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత పసుపు వేసుకుని కలిపి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • దోశ కోసం తాలింపు రెడీ అయినట్లే.
  • మరోవైప ఓ పెద్ద గిన్నె తీసుకుని అందులో గోధుమపిండి, బియ్యం పిండి, ఉప్పు వేసుకుని ఒకసారి పొడిగానే బాగా కలపాలి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా కలుపుతూ దోశ పిండిలాగా చేసుకోవాలి.
  • ఇప్పుడు ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాళింపు మిశ్రమం, కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకుని బాగా కలపాలి.
  • అంతే.. ఆ తర్వాత దోశలు వేసుకోవడమే. అయితే.. సాధారణ దోశల కన్నా కాస్త మందంగా పోసుకోవాలి.
  • అంచుల వెంబడి నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి.
  • దోశపై మూత పెట్టి నిమిషం ఉంచి తీస్తే దోశ త్వరగా బాగా ఉడుకుతుంది
  • రెండు వైపులా రంగు మారేదాకా రెండు నిమిషాలు కాల్చుకుని తీసేస్తే క్రిస్పీ, టేస్టీ ఇన్​స్టంట్ గోదుమపిండి ఉల్లిదోశ రెడీ.
  • దీనిని ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. లేదా నేరుగా అలానే కూడా తినేయొచ్చు.

టేస్టీ "పింక్ సాస్ పాస్తా"- ఇలా చేస్తే రెస్టారెంట్లకు వెళ్లాల్సిన అవసరం లేదు!! - How to Make Pink Sauce Pasta

సండే స్పెషల్​: టేస్టీ అండ్​ స్పైసీ "చికెన్​ ధమ్​ కిచిడి" - ఒక్కసారి తిన్నారంటే రుచి మర్చిపోరు! - Chicken Dum Khichdi in Telugu

ABOUT THE AUTHOR

...view details