How To Make Tricolour Dosa Recipe : దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ జెండా పండుగ వేళ ఇంట్లో సరికొత్త వంటలు ప్రిపేర్ చేస్తే.. పిల్లలు ఎంతో ఆనందంగా ఆరగిస్తారు. స్కూల్లో ఇచ్చే మిఠాయిలకు అదనంగా.. అమ్మ పెట్టే స్పెషల్ డిష్ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. అందుకే.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే తిరంగా ఇడ్లీ, దోశలను ప్రిపేర్ చేయండి. ఇడ్లీ అంటే ముఖం చిట్లించే వారు కూడా వదలకుండా లాగించేస్తారు. మరి, ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
తిరంగా ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
- ఇడ్లీ పిండి మూడు కప్పులు
- క్యారెట్ తురుము- అరకప్పు
- పాలకూర రసం- అరకప్పు
- ఉప్పు రుచికి సరిపాడా
తిరంగా ఇడ్లీ తయారు చేయు విధానం :
- ముందుగా ఇడ్లీ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
- తర్వాత పిండిని మూడు బౌల్స్లోకి సమానంగా తీసుకోవాలి.
- ఇప్పుడు నారింజ రంగు కోసం ఒక ఇడ్లీ పిండి బౌల్లో క్యారెట్ తురుము వేసుకుని కలుపుకోవాలి.
- అలాగే ఆకుపచ్చ రంగు కోసం మరొక గిన్నెలోని పిండిలో పాలకూర రసం వేసుకుని కలుపుకోవాలి.
- ఈ మూడు రంగుల పిండిని ఇడ్లీ పాత్రలోకి వేసుకోవాలి.
- తర్వాత స్టౌపై ఇడ్లీ పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇడ్లీ పాత్రలు పెట్టుకుని సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది.
- ఎంతో రుచికరమైన తిరంగా ఇడ్లీ రెసిపీ రెడీ.
తిరంగా దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
- దోశ పిండి - 3 కప్పులు
- ఉప్పు రుచికి సరిపడా
నారింజ రంగు కోసం..
- టమాటా-1
- క్యారెట్ - 1
- ఎండుమిర్చి-3