Paramannam Recipe in Telugu : దసరా పండగ అంటేనే.. నోరూరించే పిండి వంటలు, ఘుమఘుమలాడే నాన్‌వెజ్ వంటకాలకు కేరాఫ్ అడ్రస్. ఇవే కాదండి.. వీటితోపాటు ఇంట్లో ఏదైనా ఒక స్వీట్ తప్పకుండా ఉండాల్సిందే. అప్పుడే అసలైన పండగ మజా..! అయితే, ఈ దసరా రోజు ఇంట్లో ఏ స్వీట్ చేయాలా? అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే, ఈస్టోరీ మీ కోసమే. అందరూ నచ్చేలా.. అందరికీ ఎంతో ఇష్టమైన పరమాన్నం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దాదాపు అందరూ ఈ రెసిపీ చేస్తారు. కానీ.. రుచికరంగా చేయడం అందరికీ రాదు. టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే పండగ సంబరం రెట్టింపవుతుంది కదూ..! మరి ఇక లేట్ చేయకుండా దసరా తీయని వేడుకల కోసం.. ఎంతో రుచికరమైనపరమాన్నం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- బియ్యం -కప్పు
- పెసరపప్పు-అరకప్పు
- శనగపప్పు-పావుకప్పు
- పాలు-కప్పు
- వాటర్- 5 కప్పులు
- బెల్లం -2 కప్పులు
- యాలకులపొడి- అరటీస్పూన్
- పచ్చకర్పూరం-చిటికెడు
- నెయ్యి-2 టేబుల్‌స్పూన్లు
- జీడిపప్పు-పావు కప్పు
- కిస్మిస్-2టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం..
- ముందుగా స్టౌ పై గిన్నె పెట్టి పెసరపప్పు వేయాలి. పెసరపప్పు 4 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మరొక గిన్నెలో బియ్యం, ఫ్రై చేసిన పెసరపప్పు, శనగపప్పు తీసుకోవాలి. వీటిని 2 సార్లు కడగాలి. తర్వాత 2 కప్పుల నీళ్లను పోసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు నానబెట్టుకోవడం వల్ల బియ్యం, పప్పులు చక్కగా ఉడుకుతాయి.
- తర్వాత ఇందులోనే మరో మూడు కప్పుల నీళ్లు, పాలను పోసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టౌపై పెట్టి ఉడికించుకోవాలి.
- స్టౌ మీడియమ్ ఫ్లేమ్‌లో పెట్టి రైస్, పప్పులు ఉడికించుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసుకుని కలుపుకోవాలి.
- పరమాన్నం కాస్త గట్టిగా మారిన తర్వాత ఇందులో యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ సన్నని మంట మీద పెట్టి ఉడికించుకోవాలి.
- మరొక పక్కన స్టౌ పై పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఇవి బాగా వేగిన తర్వాత పరమాన్నంలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత స్టౌ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ పరమాన్నం రెడీ.
- దసరా పండగ రోజున ఇలా పరమాన్నం చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఈ పండగ రోజు పరమాన్నం ఇలా ట్రై చేయండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది.
దసరా స్పెషల్: ఘుమఘుమలాడే మద్రాస్ స్టైల్ "మటన్ బకెట్ బిర్యానీ" - తిన్నారంటే జిందగీ ఖుష్ అయిపోతుంది!!
దసరా స్పెషల్ స్వీట్స్ : నోరూరించే "రవ్వ జిలేజీ, మూంగ్‌దాల్ లడ్డు, పాల బూరెలు"- ఈజీగా చేసుకోండిలా!