ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

హోటల్ స్టైల్​ "పూరీ కర్రీ" సీక్రెట్ ఇదే! - 'ఆ ఒక్కటి' వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది! - HOTEL STYLE PURI CURRY

పూరీ కర్రీ ఇలా చేయండి - మిమ్మల్ని మీరు మెచ్చుకోకుండా ఉండలేరు!

puri_curry_recipe_in_telugu
puri_curry_recipe_in_telugu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2025, 5:28 PM IST

PURI CURRY RECIPE IN TELUGU :"అదేంటోగానీ హోటళ్లలో ఇచ్చే పూరీ కర్రీ ఎంతో బావుంటుంది. మేం ఎంత ట్రై చేసినా ఆ టేస్ట్ రావట్లేదు" అని ఆలోచిస్తున్నారా! మీరూ అలా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారా? మీకు వంట రాకపోయినా సరే హోటల్ స్టైల్లో అద్దిరిపోయే పూరీ కర్రీ ఇలా ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు మెచ్చుకోకుండా ఉండలేరు!

10నిమిషాల్లో చిక్కటి గడ్డ పెరుగు - రసాయనాలు లేకుండానే చిన్న చిట్కాతో ఇలా తయారు చేసుకోండి

హోటల్ స్టైల్ పూరీ కర్రీ ఎంతో రుచి మాత్రమే కాదు తయారీ కూడా చాలా ఈజీ! వంట ఏమాత్రం తెలిసినా, తెలియకున్నా పూరీ కర్రీని అదిరిపోయేలే చేసేయొచ్చు. కాకపోతే కొన్ని చిట్కాలు పాటించాలంతే! కూరలో వాడే దినుసులు ఎప్పుడు, ఏమేం వేయాలో తెలుసుకుంటే చాలు.

కావల్సిన పదార్థాలు

  • నూనె - టేబుల్ స్పూన్
  • ఎండు మిర్చి - 1
  • తాలింపు గింజలు - పోపు కోసం
  • ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు
  • ఉల్లి పాయలు - 2
  • పచ్చి మిర్చి - 5
  • ఉప్పు - తగినంత
  • పసుపు - తగినంత
  • అల్లం తరుగు (తప్పనిసరి) దీని వల్లే రుచి
  • క్యారెట్ ముక్కలు - పావు కప్పు
  • పచ్చి బఠాణీ - పావు కప్పు
  • ఆలుగడ్డ - 1 (ఉడికించింది)
  • నీళ్లు - గ్లాసున్నర
  • కరివేపాకు - 2 రెమ్మలు (పోపులో వేయొద్దు)
  • శనగపిండి - పావు కప్పు
  • కొత్తిమీర - కొద్దిగా

హోటల్ టేస్ట్ ని మించిన ఆలు కర్రీ మొదటి సారి చేసే వాళ్లయినా సరే ఇలా ఈజీగా చేసుకోవచ్చు

  • ముందుగా కడాయిలో నూనె పోసుకుని ఎండు మిర్చి, తాలింపు గింజలు వేసుకోవాలి. చిటపటలాడుతున్నపుడే ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగ పప్పు, మినప్పప్పు వేసుకుని అవి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని వేయించాలి. నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది.
  • అల్లం తరుగు వేసుకుని కలిపి మీడియం ప్లేమ్​లో వేగనివ్వాలి. (అల్లం తరుగు వల్లనే పూరీ కర్రీకి రుచి వస్తుంది)
  • ఆ తర్వాత పావు కప్పు పచ్చి బఠానీ, పావు కప్పు క్యారెట్ తురుము వేసుకుని కలుపుకోవాలి.
  • మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్​లో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.
  • ఉడికించి పొట్టు తీసుకున్న ఆలుగడ్డను చల్లార్చుకుని చిదిమి వేసుకోవాలి.
  • అంతా మిక్స్ చేసుకుని మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్​లో ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత గ్రేవీకి తగినంత నీళ్లు పోసుకోవాలి.
  • మరో ఐదు నిమిషాలు ఉడికించుకుని ఆ సమయంలో కరివేపాకు తుంచి వేసుకోవాలి. కరివేపాకు పోపులో కాకుండా ఇప్పుడు వేసుకుంటేనే సువాసన, రుచి వస్తుంది.
  • పావుకప్పు శనగ పిండిని పావు కప్పు నీళ్లు కలుపుకొని కర్రీలో పోసుకోవాలి.
  • శనగ పిండి వల్ల కర్రీకి చిక్కదనం వస్తుంది.
  • శనగపిండి బదులు గోధుమ పిండి లేదా కార్న్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. లో టు మీడియం ఫ్లేమ్​లో మధ్య మధ్యలో కలుపుకొంటూ మరీ ఎక్కువగా కాకుండా ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది.
  • మరీ చిక్కగా అనిపిస్తే రుచి చూసుకుని నీళ్లు పోసుకుంటే చాలు
  • చివరిగా కొత్తి మీర తరుగు వేసుకుంటే రుచికరమైన పూరీ కర్రీ రెడీ అయినట్లే!

కిట్టీ పార్టీలోకి సూపర్ స్నాక్! - ఈ గారెల రుచే వేరు - రెండు, మూడుతో ఆగరంతే!

పూరీలు నూనె పీల్చకుండా పొంగాలంటే పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు! - సింపుల్ ట్రిక్

ABOUT THE AUTHOR

...view details