Chicken Pickle recipe :ప్రస్తుతం కోళ్ల ధరలు దిగొచ్చాయి. గుడ్లు కూడా తక్కువ ధరకే దొరుకుతున్నాయి. నాన్ వెజ్ ఇష్టపడే వారికి ఇదొక చక్కని అవకాశం అని చెప్పుకోవచ్చు. చికెన్ పచ్చడి పెట్టుకుంటే రోజుల తరబడి మాంసాహారం లాగించేయొచ్చు. అందులోనూ ఆంధ్ర స్టైల్లో చికెన్ పచ్చడి పెట్టుకుంటే! ఇంకెందుకు ఆలస్యం అదేదో కానిచ్చేద్దాం పదండి!
పక్కా కొలతలతో అదిరే "గోంగూర చికెన్ పచ్చడి" - ఇలా పెడితే నెల రోజులపాటు నిల్వ!
ఇంట్లో కూరగాయలు లేనపుడు కారం, పెరుగు, పచ్చడి గుర్తొస్తాయి. ఈ మూడు పదార్థాలు ఉంటే చాలు ఆ పూట గడిచినట్టే. మరీ ముఖ్యంగా తెలుగిళ్లలో పచ్చళ్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే మాంసాహార పచ్చళ్లలో ఎంతో మందికి నచ్చిన చికెన్ పచ్చడి తయారీ కోసం రెండు టిప్స్ పాటిస్తే చాలు.
- చికెన్ పచ్చడికి నాటుకోడి కంటే కండ ఎక్కువ, ఎముకలు తక్కువగా ఉండే బాయిలర్ చికెన్ బాగుంటుంది.
- చికెన్ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల ముక్కలు గట్టి పడి పచ్చడి రుచించదు.
ఆంధ్రా స్టైల్ చికెన్ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
- బాయిలర్ చికెన్ - కిలో
- నూనె - 400 గ్రాములు
- అల్లం వెల్లులి పేస్ట్ - 5 టేబుల్ స్పూన్లు లేదా 60 గ్రాములు
- ఉప్పు - 50 గ్రాములు
- పచ్చళ్ల కారం - 50 గ్రాములు
- మెంతి పొడి - 1 టీస్పూన్
- నిమ్మరసం - 3 టీ స్పూన్లు
- పసుపు - 1 టీ స్పూన్
తయారీ విధానం
- ముందుగా చికెన్ శుభ్రం చేసుకుని ఉప్పు, పసుపు కలుపుకొని కడాయిలో వేసి నీరు ఇంకిపోయే వరకు వేడి చేయాలి.
- మరోవైపు కడాయిలో నూనె పోసి వేడయ్యాక చికెన్ ఫ్రై చేసుకోవాలి. కాస్త రంగు మారితే దించేసుకుంటే సరిపోతుంది.
- మిగిలిన నూనెలో అల్లం వెల్లులి ముద్ద పచ్చి వాసన పోయేదాక వేపుకుని అందులోనే చికెన్ ముక్కలు, మెంతి పొడి, ఉప్పు, కారం వేసి ఒక పొంగు వచ్చాక మంట ఆర్పేస్తే చాలు. స్పైసీ కోరుకునే వాళ్లు ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకోవచ్చు. అంతే చికెన్ పచ్చడి రెడీ.
- చికెన్ పూర్తిగా చల్లారేందుకు 3గంటలకు పైగా పడుతుంది. అప్పుడే ముక్కలు పీల్చుకున్న నూనె పైకితేలుతుంది. ఈ సమయంలో నిమ్మరసం కలిపి నిల్వ చేయడానికి సీసాలో తీసుకుంటే సరిపోతుంది. పచ్చడి అప్పటికప్పుడు తింటే పెద్దగా రుచి ఉండదు. మూడూ రోజుల తర్వాత ముక్క మెత్తబడి ఉప్పు, కారం, మసాలా పట్టి రుచి బాగుంటుంది.
- ఈ పచ్చడి ఫ్రిజ్‌లో మూడు నెలలు, బయట రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది.
క్రిస్పీ ఓట్స్ మసాలా వడలు - సింపుల్ టిప్స్‌తో సూపర్ టేస్ట్
బాలీవుడ్ బ్యూటీ కొత్త రెసిపీ - నెట్టింట వైరల్‌గా మారిన 'కొబ్బరి చిప్పల్లో ఇడ్లీ