తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

టేస్టీ అండ్​ హెల్దీ "బీట్​రూట్​ సూప్‌"- ఇలా చేస్తే నిమిషాల్లోనే కమ్మటి రుచి! - BEETROOT SOUP RECIPE

- చలికాలంలో సూప్​లు ఎక్కువగా తాగుతుంటారా? - బీట్​రూట్​ సూప్​ తప్పక ట్రై చేయాల్సిందే!

Beetroot Soup
How to Make Beetroot Soup (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 10:00 AM IST

How to Make Beetroot Soup :తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ చలి తీవ్రత పెరిగిపోతోంది. పగలంతా ఎండ ఉన్నా.. సాయంత్రమైతే చాలు మెల్లగా చలి మొదలవుతోంది. ఈ చలికాలంలో చాలా మంది వేడిగా ఉన్న ఆహారం తినడానికి ఇష్టపడతారు. అలాగే సూప్​లు తాగడానికి ఆసక్తి చూపిస్తారు. మనకు సూప్​లు అనగానే క్యారెట్​, కొత్తిమీర, టమాటాలతో చేసిన వివిధ రకాల సూప్​లు ఎక్కువగా గుర్తుకొస్తుంటాయి. అయితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్​రూట్​తో కూడా రుచికరమైన సూప్​ తయారు చేయవచ్చు. ఈ స్టోరీలో చెప్పిన విధంగా బీట్​రూట్​ సూప్​ చేస్తే వేడివేడిగా ఎంతో కమ్మగా ఉంటుంది. ఈ సూప్​బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఇంట్లోనే హాట్​హాట్​ బీట్​రూట్​ సూప్​ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • బీట్​రూట్​-1
  • బటర్​ -టేబుల్​ స్పూన్​
  • బిర్యానీ ఆకు-1
  • మిరియాలు- అరటీస్పూన్​
  • చిన్న అల్లం ముక్క
  • వెల్లుల్లి రెబ్బలు-3
  • ఉల్లిపాయ -1
  • క్యారెట్-1​
  • మిరియాల పొడి-చిటికెడు
  • ఉప్పు-రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా ఉల్లిపాయ, క్యారెట్లను శుభ్రంగా కడిగి సన్నగా కట్​ చేసుకోవాలి.
  • తర్వాత బీట్​రూట్​పై చెక్కు తీసేసుకుని సన్నగా ముక్కలు కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై నాన్​స్టిక్​ పాన్​ పెట్టి బటర్​ వేయండి. బటర్​ కరిగిన తర్వాత బిర్యానీ ఆకు, మిరియాలు, అల్లం ముక్క, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి వేసి వేయించండి.
  • వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ, క్యారెట్​ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించండి.
  • తర్వాత బీట్​రూట్​ ముక్కలు వేసి కలపండి. స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోండి.
  • తర్వాత కప్పు నీళ్లు పోసి మూతపెట్టి మరికొద్ది మగ్గించుకోండి. ఇప్పుడు స్టౌ ఆఫ్​ చేసి ఈ మిశ్రమం కొద్దిగా చల్లారనివ్వండి.
  • తర్వాత బిర్యానీ ఆకు తీసేసి.. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోండి.
  • దీనిని మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • తర్వాత ఒక జాలీలోకి తీసుకోని సూప్​ వడకట్టుకోండి. కొద్దిగా నీళ్లు పోస్తే సూప్​ చిక్కగా వస్తుంది.
  • ఈ సూప్​ని స్టౌపై పెట్టి ఒక మూడు నిమిషాలు మరిగించుకోండి.
  • ఇందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలపండి. తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోండి.
  • ఈ బీట్​రూట్​ సూప్​ని బౌల్లోకి తీసుకుని పైన ఫ్రెష్​ క్రీమ్ లేదా చిక్కని కోకనట్​ మిల్క్​తో సర్వ్​ చేసుకుంటే సరిపోతుంది.
  • ఇలా చేస్తే వేడివేడిగా బీట్​రూట్​ సూపర్​గా ఉంటుంది.
  • నచ్చితే ఈ వింటర్​లో ఈ సూప్​ ఓసారి ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి:
వింటర్​ స్పెషల్​​ : ఘుమఘుమలాడే "టమాటా కొత్తమీర సూప్​" - వేడివేడిగా గొంతులోకి జారుతుంటే అదుర్స్!

వింటర్​ స్పెషల్​ - రెస్టారెంట్​ స్టైల్​ "టమాటా సూప్​"- ఇలా చేస్తే టేస్ట్​ అద్భుతం!

ABOUT THE AUTHOR

...view details