తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఫ్లవర్‌వాజుల్లోని పూలు త్వరగా వాడిపోతున్నాయా ? - ఈ టిప్స్​ పాటిస్తే ఎక్కువ కాలం ఫ్రెష్​గా ఉంటాయి! - FLOWER CARE TIPS

-ఇంటి అలంకరణలో ఒక భాగంగా మారిపోయిన ఫ్లవర్‌వాజులు -ఇలా చేస్తే పూలు ఎక్కువ టైమ్​ ఫ్రెష్​గా!

How to Keep Flowers Fresh in a Vase
How to Keep Flowers Fresh in a Vase (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2024, 1:08 PM IST

How to Keep Flowers Fresh in a Vase:చాలా మందికి పూల మొక్కలంటే ఎంతో ఇష్టం. ఇంట్లో ఏ కాస్త స్థలం ఉన్నా గులాబీ, బంతి, చామంతి పూల మొక్కలు నాటుతుంటారు. మనసు ఏం బాలేనప్పుడు కాసేపు అందమైన పుష్పాలను చూస్తుంటే.. టెన్షన్​లన్నీ తగ్గిపోయి ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. అయితే, ఇంట్లో పూల మొక్కలు పెంచుకున్నట్లే కొంతమంది లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బెడ్‌రూముల్లో ఫ్లవర్‌వాజుల్లో రకరకాలపుష్పాలను అమర్చుతుంటారు. ప్రస్తుత బీజీ లైఫ్​స్టైల్లో ఫ్లవర్‌వాజుల్లో పూలను చూస్తే.. మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది. అయితే, వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి తక్కువ సమయంలోనే వాడిపోతాయని.. అలా కాకుండా ఫ్లవర్‌వాజుల్లో అమర్చిన పూలు రోజంతా ఫ్రెష్​గా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీరు చూసేయండి..

కాడ భాగాన్ని పరిశీలించండి :ఎర్రని గులాబీ పూలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే వీటిని ఫ్లవర్‌వాజుల్లో ఎక్కువ మంది అమర్చుకుంటుంటారు. అయితే, రోజాపూలు కొనడానికి షాప్​కి వెళ్లినప్పుడు పూల రెక్కలన్నీ ఒక్కచోట కలిసే.. కాడ భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. దాన్ని కాస్త నొక్కినప్పుడు అది మరీ మెత్తగా అనిపిస్తే ఆ పూలు పాతవని గుర్తుంచుకోండి. అలాకాకుండా కాస్త మెత్తగా, కాస్త గట్టిగా అనిపిస్తే అవి ఫ్రెష్​ పూలని అర్థం. అలాంటి వాటిని ఎంపిక చేసుకుంటే రెండు రోజుల పాటు తాజాగా ఉంటాయంటున్నారు.

పువ్వులు నలిగిపోకుండా :ఇంట్లో రెండు మూడు చోట్ల ఫ్లవర్‌వాజులు పెట్టుకునే వారు.. ఎక్కువ పూలను తీసుకుంటుంటారు. ఇలాంటి వారు ఎక్కువ రకాల పువ్వులు తీసుకున్నప్పుడు వేటికవి విడివిడిగా ప్యాక్ చేయించుకుంటే మంచిది. ఇలా చేస్తే ఇంటికి చేరుకున్న అనంతరం వాటిని సులువుగా విడదీసుకోవచ్చు. అలాగే పువ్వులూ నలిగిపోకుండా ఉంటాయట.

  • ఫ్లవర్​వాజుల్లో వాటర్​లో ఉంచే పువ్వులకు కాండం ఎంతవరకు వాటర్​లో మునుగుతుందో చూసుకుని దాని కింద ఉండే ఆకులు కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల వాటర్​ క్లీన్​గా ఉంటుంది. అలాగే పువ్వులు కూడా ఎక్కువ టైమ్​ ఫ్రెష్​గా ఉంటాయి.
  • మరో విషయం.. పువ్వుల కాండాలు కూడా సరిచూసుకోవాలి. అవి విరిగి ఉన్నా.. లేక చివర్లు ఎండిపోయినట్టు ఉన్నా.. వాటిని కత్తిరించాలి. కట్​ చేసిన తర్వాత వాటిని ఫ్లవర్‌వాజులో పెట్టేంత వరకూ వాటర్​లో ఉంచాలి.
  • ఫ్లవర్‌వాజులు క్లీన్​గా ఉంటేనే పూలు ఎక్కువ టైమ్ వరకు ఫ్రెష్​గా ఉంటాయి. అందుకే సబ్బు, వేడినీళ్లను ఉపయోగించి ఫ్లవర్‌వాజులను ఎప్పటికప్పుడు క్లీన్​ చేస్తుండాలి.
  • వాడిపోయిన పూరేకల్ని తీసేయాలి. ఫ్లవర్‌వాజ్‌లో ఉండే వాటర్​ ఏ మాత్రం జిగురుగా అనిపించినా వెంటనే మార్చేయాలి.
  • ఇంట్లో నేరుగా ఎండ పడే చోట ఫ్లవర్‌వాజులు ఉంచినా అందులో అమర్చిన పుష్పాలు త్వరగా వాడిపోతాయి. కాబట్టి చల్లటి ప్రదేశాల్లోనే ప్లవర్‌వాజులు ఏర్పాటుచేసేలా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details