HEALTH PROBLEMS WITH ANGER :'ముక్కు మీద కోపం ముఖానికే అందం' అనేది పచ్చి అబద్ధమట. 'వీడేంటే ఇంత కోపంగా ఉన్నాడు, త్వరగా ముసలోడైపోతాడు' అంటూ ఉప్పెన సినిమాలో హీరోయిన్ కృతిశెట్టి (బేబమ్మ) చెప్పే డైలాగ్ 100శాతం నిజమంటున్నారు వైద్య నిపుణులు. కోప్పడితే హార్మోన్లు విడుదలై చర్మం ముడతలు పడుతుందని, వృద్ధాప్యం తొందరగా రావడం ఖాయమని పేర్కొంటున్నారు. కోపం ఎన్నో అనారోగ్య సమస్యలకు మూలం, దాని వల్ల దీర్ఘకాలిక జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కోపం ఎక్కువగా ప్రదర్శించే వారిలో అవయవాల స్పందన, హార్మోన్ల ప్రభావం, గుండె పనితీరుపై చేసిన అధ్యయనాలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి.
మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!
కోపం, నవ్వడం అనేవి మానసిక స్పందనలు. ఈ భావోద్వేగాలు కొన్నిసార్లు మనల్ని రక్షించడానికి ఉపయోగపడితే మరికొన్ని సార్లు మనకు కావలసిన వాటిని పొందడానికి సహాయపడతాయి. అదే పనిగా నవ్వినా, కోపానికి గురైనా అది ఆరోగ్య సమస్యగానే గుర్తించాలంటున్నారు నిపుణులు. కోపం తరచుగా, తీవ్రంగా వస్తే ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందట. కోపం వల్ల వచ్చే సమస్యలు, శరీరంలో జరిగే మార్పులేమిటో తెలుసుకుందామా!
కోపం శరీరంపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో కోపంగా వారిలో శరీరం, మనస్సు రెండూ ఒత్తిడికి గురవుతాయని పరిశోధనలు తేల్చాయి.
శారీరకంగా జరిగే నష్టాలు :
- కోపం వచ్చినప్పుడు హృదయ స్పందన పెరుగుతుంది. శ్వాస వేగం పెరుగుతుంది. దాంతో సహజంగానే రక్తపోటు(BP) పెరిగి గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. గుండె జబ్బులకు ముఖ్యమైన ప్రమాద కారకం కోపమే అని వైద్యులు చెప్తున్నారు.
- కోపానికి గురైన సమయంలో స్ట్రెస్ హార్మోన్లు అడ్రినల్, కార్టిసాల్ ఉత్పత్తి అవుతాయట. అవి నాలుగు నుంచి ఐదు గంటల పాటు రక్తంలో అలాగే ఉండిపోవడం వల్ల హృదయ స్పందన అమాంతం పెరుగుతుంది. శ్వాస వేగం అధిక రక్తపోటుకు దారితీస్తుందట. కోపం జీర్ణ వ్యవస్థను కూడా ప్రభావితం చేయడం వల్ల కడుపు నొప్పి, అల్సర్, ఇతర జీర్ణ సమస్యలకు దారితీస్తుందట. నిద్ర లేమి సమస్యకు కోపం మూల కారణమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రోగనిరోధక వ్యవస్థపై పెను ప్రభావం చూపడం వల్ల తరచూ అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు.
- రెండు నిమిషాల కోపం ఆరుగంటల పాటు ఇమ్యూనిటీని ప్రభావితం చేస్తుందట.
- చర్మం కణాలు దెబ్బతినడంతో పాటు పొడిగా, కళా విహీనంగా మారుతుందట. తద్వారా వృద్ధాప్యం ఛాయలు తొందరగా వచ్చే అవకాశాలున్నాయి. కోపం వల్ల మెడ, భుజం, చెంప భాగాల్లో స్ట్రెస్ పెరిగి తలనొప్పికి దారి తీస్తుందట. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా స్పందిస్తారట. కోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యపై పరిశోధనల కోసం ఇక్కడ(Health problems with anger)క్లిక్ చేయండి