తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఉల్లిపాయల కటింగ్​, ఉడికించినవి​ వడకట్టడానికి ఎక్కువ టైమ్ పడుతోందా? - ఈ టూల్స్ ఉంటే ఆ పని చాలా ఈజీ!

మార్కెట్లో అందుబాటులో ఎన్నో రకాల కిచెన్​ టూల్స్​ వీటిని ఉపయోగించడం వల్ల పని తొందరగా కంప్లీట్​

By ETV Bharat Features Team

Published : 5 hours ago

Useful Kitchen Tools
Kitchen Tools (ETV Bharat)

Useful Kitchen Tools: ఇంట్లో ఎక్కువ సమయం వంటగదిలోనే శ్రమిస్తుంటారు మహిళలు. అయినా కూడా కిచెన్​లో పని ఓ పట్టాన కంప్లీట్ అవ్వదు. అందుకు ప్రధాన కారణం.. కొన్ని వంటింటి పనులు పూర్తవ్వడానికి ఎక్కువ టైమ్ పట్టడమే! అయితే, మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని చిన్న చిన్న వస్తువులు/యాక్సెసరీస్‌ కిచెన్​లో ఉంటే.. ఆయా పనులు త్వరగా పూర్తవ్వడమే కాకుండా టైమ్ ఆదా అవుతుందంటున్నారు నిపుణులు. మరి, వంటింట్లో సహాయపడే ఆ కిచెన్టూల్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • కాయగూరలు, ఉల్లిపాయలువంటివి కట్‌ చేయడానికి చాలా టైమ్ పడుతుంది. ​అదే మీ కిచెన్​లో ఓ ‘వెజిటబుల్‌ చాపర్‌’ ఉంటే ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా వాటిని ఈజీగా తరుక్కోవచ్చు. దాంతో టైమ్ ఆదా అవుతుందంటున్నారు నిపుణులు. అలాగే.. టమాటా ప్యూరీ వంటివి కూడా ఇదే చాపర్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
  • అలాగే.. ఉడికించిన కాయగూరలు/పాస్తా/నూడుల్స్‌ వంటివి వడకట్టుకోవడానికి, చింతపండురసం నుంచి గుజ్జును వేరు చేయడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. అలాంటి టైమ్​లో మీ వంటింట్లో చిన్న చిన్న రంధ్రాలున్న ఓ జల్లెడ లాంటి బౌల్​ ఉంటే ఆ పని ఈజీగా అవుతుంది! అదీ ప్లాస్టిక్‌ కంటే స్టీల్‌ది ఎంచుకోవడం బెటర్.
  • అదేవిధంగా.. కిచెన్​లో కొలతల స్పూన్లు, మిక్సింగ్‌ బౌల్స్‌ని అందుబాటులో ఉంచుకుంటే అవసరమున్నప్పుడు వెంటనే యూజ్ చేసుకోవచ్చు. తద్వారా కొలత సరిగ్గా సరిపోతుంది. తక్కువ పదార్థాల కోసం పెద్ద బౌల్స్‌ని వాడి పని పెంచుకోకుండా జాగ్రత్తపడవచ్చంటున్నారు.

వంట కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే తక్కువ టైమ్​లోనే ఫుడ్​ రెడీ!

  • మనం వాడుతున్న కొద్దీ వంటింట్లోని కత్తులు పదును కోల్పోతాయి. అలాగని.. వాటిని పదే పదే కత్తులు/కత్తెరలు పదును పెట్టే వాళ్ల దగ్గరికి తీసుకెళ్లలేం. అదే.. ఇంట్లోనే ఓ ‘నైఫ్‌ షార్ప్‌నర్‌’ ఉంటే ఎప్పుడంటే అప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు.
  • చిన్న చిన్న సీసాల దగ్గర నుంచి పెద్ద క్యాన్ల వరకు సీల్‌ చేసిన మూత ఓపెన్‌ చేయాలంటే కాస్త కష్టపడాల్సిందే! అదే.. అలాంటి టైమ్​లో ఓ క్యాన్‌ ఓపెనర్ని చేతికి అనువుగా ఉంచుకున్నారంటే పని ఈజీ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల మూతల్ని ఓపెన్ చేయడానికి ‘మల్టీ-ఫంక్షన్‌ క్యాన్‌ ఓపెనర్లు’ దొరుకుతున్నాయి.
  • చాలా మంది వంటింట్లో పదార్థాలు అమర్చిన కవర్లను ప్యాక్‌ చేయడానికి లేదా సీల్‌ చేయడానికి రబ్బర్లను వాడుతుంటారు. కానీ, పెద్ద పెద్ద ప్యాకింగ్‌ల కోసం ఇవి సరిపోకపోవచ్చు. కాబట్టి వాటికి బదులుగా కొన్ని సీలింగ్‌ క్లిప్స్‌ని హ్యాండీగా ఉంచుకుంటే పని సులువవుతుందంటున్నారు నిపుణులు. వీటితో పాటు ప్యాకెట్‌ని పూర్తిగా సీల్‌ చేయడానికి ఓ ‘మినీ బ్యాగ్‌ సీలర్‌’ కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
  • కిచెన్​లో.. కొన్ని రకాల పదార్థాలు కలుపుకోవడానికి విస్క్‌/బీటర్‌ని ఉపయోగిస్తుంటాం. నిజానికి దీనివల్ల పని సులువే అయినా ఆ పిండి మిశ్రమాన్ని వదిలించడం మాత్రం కాస్త కష్టమే! అందుకే.. దాన్ని వాడడానికి ముందే ‘విస్క్‌ వైపర్‌’ని తొడగండి. విస్క్‌ని పట్టి ఉంచే ఈ వైపర్‌ని పని పూర్తయ్యాక తొలగించి.. ఆపై మరోసారి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. తద్వారా పని త్వరగా పూర్తవ్వడమే కాకుండా.. సమయం ఆదా అవుతుందంటున్నారు నిపుణులు.

చుక్క లేకుండా నిమ్మరసం పిండొచ్చు- సెకన్​లో రెండు కజ్జీకాయలు చేయచ్చు- ఈ కిచెన్ టూల్స్ చూశారా?

ABOUT THE AUTHOR

...view details