ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

నైట్​ మేకప్​ తీయకుండానే పడుకుంటున్నారా ? మీ అందం కరిగిపోతుందట! - MAKEUP SIDE EFFECTS

కంటి సమస్యలతో పాటు డార్క్​ సర్కిల్స్​ ముప్పు ఉందంటున్న నిపుణులు!

Effects of Not Removing Makeup
Effects of Not Removing Makeup (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2025, 3:50 PM IST

Effects of Not Removing Makeup :చాలా మంది అమ్మాయిలకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, శుభకార్యలకు హాజరైనా మేకప్ వేసుకోవడం అలవాటే. ఈ క్రమంలో రాత్రి పడుకునే ముందు మాత్రం దీన్ని పూర్తిగా తొలగించక తప్పదు. లేకపోతే వివిధ రకాల చర్మ సౌందర్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐ మేకప్‌ విషయంలోనూ ఇది వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఐ మేకప్‌ తొలగించుకోకపోతే ఎలాంటి సమస్యలొస్తాయి ? దీన్ని సరైన పద్ధతిలో తొలగించుకోవడం ఎలా? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

ఎక్కువ మంది వేడుకల సమయంలో రోజంతా అలసిపోయి ఇంటికి చేరిన తర్వాత, ఏదో పైపైన మొహం కడిగేసుకొని మేకప్‌ సంగతి రేపు చూసుకుందాంలే అనుకుంటారు. అయితే ఈ అజాగ్రత్తే లేనిపోని కంటి సమస్యల్ని తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్కిన్​ అలర్జీలు తప్పవు!

ఐ మేకప్​ పూర్తిగా తొలగించుకోకుండా పైపైన శుభ్రం చేసుకొని పడుకుంటుంటారు కొంతమంది అమ్మాయిలు. ఈ క్రమంలో నైట్​ మనకు తెలియకుండానే కళ్లు దురద పుట్టచ్చు, నలపచ్చు. దాంతో మేకప్‌ కళ్లలోకి చేరుతుంది! అలాగే అటూ ఇటూ దొర్లే క్రమంలో బెడ్‌షీట్స్‌, దిండ్లకి సైతం మేకప్ అంటుకుంటుంది. అక్కడి నుంచి చర్మం పైకి చేరి లేనిపోని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఐ మేకప్‌ని పూర్తిగా తొలగించుకోవాలని సూచిస్తున్నారు.

మస్కారా తొలగిస్తున్నారా?

మేకప్​లో భాగంగా కనురెప్పల్ని తీర్చిదిద్దుకోవడానికి , వాటిని వంపులు తిరిగేలా చేయడానికి మస్కారా వాడుతుంటారు. అయితే మస్కారా రెప్పలకు మందంగా అంటుకొని వాటిని అలాగే బిగుసుకుపోయేలా చేస్తుంది. దాంతో కనురెప్పల్లోని నూనె గ్రంథులు మూసుకుపోతాయి. ఇక నైట్​ మొత్తం మస్కారా పెట్టుకొని ఉండడం వల్ల రెప్పలకు తేమ అందక అవి తమ సహజత్వాన్ని కోల్పోతాయి. పెళుసుబారిపోయి తెగిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇదిలాగే కొనసాగితే కనురెప్పలు క్రమంగా పల్చబడి కంటి అందం పాడవుతుంది. కాబట్టి నైట్​ ఇంటికి చేరుకున్న తర్వాత మస్కారాను పూర్తిగా తొలగించుకోవడం మర్చిపోవద్దు.

డార్క్​ సర్కిల్స్​ ముప్పు!

రాత్రి పడుకున్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకున్నట్లే, కళ్లూ రాత్రి పూట రిలాక్సవుతాయి. ఈ క్రమంలో కళ్ల చుట్టూ ఉండే స్కిన్​ సెల్స్​ యాక్టివేట్‌ అయి అక్కడి చర్మాన్ని రిపేర్‌ చేసుకుంటాయి. అయితే నైట్​ టైమ్​లో మేకప్‌ తొలగించకుండా అలాగే పడుకోవడం వల్ల దీనిలోని కెమికల్స్​ ఈ కణాల పనితీరును అడ్డుకుంటాయి. తద్వారా కళ్ల కింద డార్క్​ సర్కిల్స్​, కంటి చుట్టూ వాపు వంటి సమస్యలొస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కాబట్టి నైట్​ టైమ్ కళ్లకు వేసుకున్న మేకప్‌ తొలగించి వాటికి కాస్త సాంత్వన ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఘాటైన "వెల్లుల్లి రసం" - వేడివేడి అన్నంతో తింటే జలుబు, పొడిదగ్గు నుంచి రిలీఫ్​!

శ్రీకాకుళం స్పెషల్​ స్వీట్​ "ధనుర్మాస చిక్కీలు" - కేవలం ఈ సీజన్​లోనే లభిస్తాయి!

ABOUT THE AUTHOR

...view details