Natu Kodi Pulusu Recipe : నాటు కోడి పులుసు అంటే ఇష్టం లేని నాన్ వెజ్ ప్రియులు ఉంటారా? నాటు కోడి అనే పేరు వినగానే నోరూరుతుంది. ఇష్టమైన వంటకమే అయినా, చాలా మందికి నాటు కోడి పులుసు చేయడం అంతగా తెలియదు. పులుసు అనగానే నీళ్లు ఎక్కువగా పోసుకుని కుక్కర్లో వేసి ఉడికిస్తుంటారు. కానీ, అలా చేసే వంటకం అంతగా రుచి ఉండదు. కానీ, చికెన్ ఎముకలు, మాంసంలోని రసం అంతా చారులోకి ఇంకిపోతేనే రుచి బాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో పళ్లెం నిండా నాటు కోడి రసం పోసుకుని తింటుంటే ఆ మజానే వేరు. మసాలా నషాలానికి అంటి జలుబు, దగ్గు లాంటి సీజనల్ రోగాలు పారిపోతాయంతే!
చెట్టినాడ్ స్టైల్ టమోటా, పుదీనా చట్నీ - ఇడ్లీ, దోసెల్లోకి సూపర్ కాంబినేషన్!
ఎన్నటికీ మర్చిపోలేని నాటు కోడి (పులుసు) రసం తయారీ విధానం తెలుసుకుందాం పదండి!
చక్కని రుచికరమైన నాటు కోడి పులుసు కోసం గ్రామాల్లో దొరికే కోడి (కంట్రీ చికెన్) ని తెచ్చుకుంటే మంచిది. రుచిని పెంచడానికి చికెన్ ముక్కల్ని కొద్దిగా (షేప్ మారిపోకుండా) దంచి పెట్టుకోవాలి. పులుసుకు సరిపడా నల్ల మిరియాలు, పచ్చిమిర్చి తీసుకుని ముందుగా మసాలా సిద్ధం చేసుకోవాలి.
పొడి కోసం కావలసిన పదార్థాలు
- టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు
- టేబుల్ స్పూన్ కొత్తిమీర
- 1/2 స్పూన్ జీలకర్ర
- 1/4 స్పూన్ మెంతులు (మెంతి) గింజలు
- 1.5 టేబుల్ స్పూన్ కందిపప్పు
- 3 టమోటాలు (తరిగు)
- 15 కొత్తిమీర కాడలు
- 50 గ్రాములు చింతపండు (నానబెట్టుకోవాలి)
- 1/2 స్పూన్ పసుపు
- ఉప్పు (రుచికి సరిపడా)
- 750 మి.లీ. నీరు
పులుసు కోసం :
- చికెన్ ముక్కలు (ఎముకలున్న ముక్కల్ని రోట్లో కొద్దిగా దంచి పెట్టుకోవాలి)
- 7-8 వెల్లుల్లి (వేయించడానికి)
- 10-12 వెల్లుల్లి కాయలు (రసం కోసం)
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- 2 చీలికలు పచ్చిమిర్చి
- కొత్తిమీర ఆకులు (తరిగినవి)
పోపు కోసం :
- టేబుల్ స్పూన్ నూనె
- 1/2 స్పూన్ ఆవాలు
- 1/2 స్పూన్ జీలకర్ర
- 2 ఎండు ఎర్ర మిరపకాయలు
- 2 కొమ్మలు కరివేపాకు
- ఇంగువ (చిటికెడు)
పులుసు కోసం పొడి తయారీ ఇలా..
తక్కువ మంట మీద పాన్ వేడి చేసి, నల్ల మిరియాలు, కొత్తిమీర, జీలకర్ర, మెంతులు, కందిపప్పు వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించి చల్లార్చిన తర్వాత రోట్లో/మిక్సీలో వేసుకుని బరకగా దంచుకోవాలి.
రసం కోసం ఒక గిన్నెలో టమోటా ముక్కల్ని, కొత్తిమీర, ఉప్పు, పసుపుతో కలుపుకొని పిండుకోవాలి. ఆ రసానికి నానబెట్టిన చింతపండు కలుపుకొని రసం తీసి పెట్టుకోవాలి. వడకట్టిన ద్రవంలో 750 ఎంఎల్ నీరు కలుపుకోవాలి.
కాల్చిన కోడి ముక్కల్ని ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనెలో ఫ్రై చేసుకోవాలి. అదే సమయంలో 7నుంచి 8 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని చికెన్ బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఈ సమయంలో వచ్చే వాసన మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
వేయించిన చికెన్‌లో టమోటా, చింతపండు సారం కలుపుకోవాలి. చీల్చిన రెండు పచ్చిమిర్చి వేసి మరిగిస్తూ మధ్యలో ముందుగా తయారు చేసుకున్న పొడిని కలుపుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు మెత్తగా అయ్యే వరకు రసాన్ని మరిగిస్తే సరిపోతుంది.
మరోవైపు పోపు కోసం చిన్న పాన్‌లో టేబుల్ స్పూన్ నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, చివరగా ఇంగువ వేసుకుని వేయించాలి. చివరగా వేడివేడిగా మరుగుతున్న చికెన్ పులుసులో పోపు పోసి కలుపుకోవాలి. తాజాగా తరిగిన కొత్తిమీర చల్లి 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగిస్తే సరి. అప్పటికే మీ ముక్కుపుటాలు అదిరిపోయేలా వచ్చే సువాసన మిమ్మల్ని ఆలస్యం చేయనివ్వదంటే నమ్మండి. వేడి వేడి అన్నంలో పులుసు పోసుకుని ఆరగించడమే.
ఘాటైన "వెల్లుల్లి రసం" - వేడివేడి అన్నంతో తింటే జలుబు, పొడిదగ్గు నుంచి రిలీఫ్!
రాత్రిళ్లు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? - వాటి అరుపుల వెనుక కారణాలేంటో తెలుసా?