తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మునక్కాయలతో చారు, కూరలు రొటీన్​ - ఇలా "నిల్వ పచ్చడి" చేసుకోండి! - టేస్ట్ అద్భుతం! - MUNAKKAYA PACHADI

రొటీన్ పచ్చళ్లకు మించిన టేస్ట్ - ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలిపెట్టరు!

Munakkaya Pachadi
DRUMSTICK PICKLE (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 3:54 PM IST

Munakkaya Nilava Pachadi Recipe :ఆవకాయ, టమాటా, ఉసిరికాయ, చింతకాయ నిల్వ పచ్చళ్లు ఎప్పుడూ చేసేవే, తినేవే. అయితే, అవి మాత్రమే కాదు వేసవిలో విరివిగా దొరికే మునక్కాడలతో కూడా అద్దిరిపోయే పచ్చడినిప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్టైల్​లో ఒక్కసారి "మునక్కాయ నిల్వ పచ్చడిని" ట్రై చేశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. అంతేకాకుండా, ఎప్పుడూ రొటీన్ పచ్చళ్లను తిని బోర్ కొట్టిన వారికి సరికొత్త టేస్ట్​ని అందిస్తుంది. వేడి వేడి అన్నంలో దీన్ని కాస్త వేసుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగే వేరబ్బా! పైగా దీన్ని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఈ సూపర్ టేస్టీ పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మునక్కాడలు - 2
  • చింతపండు - 50 గ్రాములు
  • ఆవాలు - 1 టేబుల్​స్పూన్
  • మెంతులు - పావు టేబుల్​స్పూన్
  • కారం - 1 టేబుల్​స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం :

  • ఆయిల్ - 4 టేబుల్​స్పూన్లు
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • మినపప్పు - 1 టీస్పూన్
  • ఆవాలు - అరటీస్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • ఎండుమిర్చి - 4
  • కరివేపాకు - కొద్దిగా
  • ఇంగువ - పావుటీస్పూన్
  • పసుపు - అరటీస్పూన్

ఇదొక్కటి వేసి "పల్లీ చట్నీ" చేయండి - టిఫెన్స్​లోకి పర్ఫెక్ట్ టేస్ట్​తో అదుర్స్ అనిపిస్తుంది!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి వేడి నీరు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు కాస్త లేతగా ఉండే మునక్కాయలనుతీసుకొని శుభ్రంగా కడగాలి. ఆపై పొడి క్లాత్​తో తుడిచి ఏమాత్రం తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత రెండు ఇంచుల పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆవాలు, మెంతులు వేసి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్​లోకి తీసుకొని మెత్తని పౌడర్​లా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక అందులో ముందుగా కట్ చేసి ఆరబెట్టుకున్న మునక్కాయ ముక్కలను వేసి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • మునక్కాయలను మరీ ఎక్కువగా వేయించకుండా లైట్​గా​ వేగాక వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే నూనెలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి తుంపలు వేసి తాలింపుని రెండు నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి.
  • తాలింపు కొద్దిగా వేగాక కరివేపాకు, పసుపు, ఇంగువ యాడ్ చేసుకొని మరికాసేపు వేయించాలి.
  • పోపు మంచిగా వేగాక అందులో నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని స్టెయినర్​లోకి తీసుకొని వడకట్టుకొని పోసుకోవాలి. ఆపై ఒకసారి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలి. అంటే మిశ్రమంలోని వాటర్ అంతా ఇగిరిపోయి గుజ్జు కాస్త దగ్గరగా అయ్యాక స్టౌ ఆఫ్ చేసుకొని దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • తాలింపు చల్లారే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కారం, ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాల మిశ్రమం వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో వేయించి పక్కకు తీసుకున్న మునక్కాడ ముక్కలను వేసి ఆ మిశ్రమం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో చల్లారిన చింతపండు తాలింపు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని ఒకరోజంతా అలాగే నాననివ్వాలి.
  • ఒక రోజు నానబెట్టుకున్నాక పచ్చడిలో చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది. ఈ స్టేజ్​లో ఓసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "మునక్కాడ నిల్వ పచ్చడి" రెడీ!

బ్యాచిలర్స్ స్పెషల్ కమ్మని "టమాటా పచ్చడి" - ఉడకబెట్టకుండా పదే పది నిమిషాల్లో రెడీ!

ABOUT THE AUTHOR

...view details