తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోట్లో వేసుకుంటే కరిగిపోయే "డేట్స్ హల్వా" - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా - రుచి అమృతమే!

-తక్కువ పదార్థాలతోనే టేస్టీ స్వీట్​ -ప్రిపరేషన్​కు ఎక్కువ సమయం అవసరం లేదు

By ETV Bharat Features Team

Published : 5 hours ago

How to Make Dates Halwa
Dates Halwa (ETV Bharat)

How to Make Tasty Dates Halwa in Telugu:చాలా మంది ఇష్టపడే స్వీట్ రెసిపీలలో ఒకటి.. హల్వా. పండగలు, శుభకార్యాల సమయంలో దీన్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా హల్వానుట్రై చేసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా ఎంతో రుచికరంగా ఉండే "ఖర్జూరం హల్వాను" టేస్ట్ చేశారా? లేదంటే మాత్రం దీన్ని.. ఓసారి తప్పక ట్రై చేయండి. దీని కోసం ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. చాలా తక్కువ ఐటమ్స్​తో ఈ హల్వాను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ.. ఈ సూపర్ టేస్టీ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

డేట్స్ హల్వా తయారీకి కావాల్సినవి :

  • చక్కెర - పావుకిలో
  • 500 గ్రాములు - ఖర్జూరం
  • రెండు కప్పులు - పాలు
  • మూడు టేబుల్ స్పూన్లు - నెయ్యి
  • 1 టీస్పూన్ - యాలకుల పొడి
  • 1 టేబుల్ స్పూన్ - పిస్తాపప్పు
  • 1 టేబుల్ స్పూన్ - బాదం

చక్కెర, బెల్లం లేకుండానే స్వీట్- ఈజీగా హెల్దీగా "కేసరిబాత్" చేసుకోండిలా!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా నాణ్యమైన ఖర్జూరాలనుతీసుకొని వాటిలో గింజలను తొలగించుకోవాలి. ఆపై వాటిని వేడి నీటిలో వేసి ఒక గంటపాటు పక్కన పెట్టేయాలి.
  • గంట తర్వాత మిక్సీ జార్​ తీసుకొని నానిన డేట్స్​ని అందులో వేసి గుజ్జులాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై మందపాటి పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి కాస్త వేడెక్కాక.. గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఖర్జూరం గుజ్జుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌను లో ఫ్లేమ్​లో ఉంచి కాసేపు ఉడికించుకోవాలి. ఆపై చక్కెర, పాలు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. అలా మిక్స్ చేయకపోతే అడుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువ.
  • ఇక అందులో వేసుకున్న చక్కెర కరిగాక.. మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పావుగంట పాటు ఉడికించుకోవాలి.
  • పావుగంట తర్వాత ఖర్జూర మిశ్రమం మంచిగా ఉడికి గట్టిపడుతుంటుంది. అదే టైమ్​లో మిశ్రమం పాన్​కు అంటుకోకుండా ఉంటుంది.
  • ఆ సమయంలో అందులో యాలకుల పొడి వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకొని స్టౌ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే డేట్స్ హల్వా మీ ముందు ఉంటుంది!
  • సర్వ్ చేసుకునేటప్పుడు ఈ హల్వాను బాదం, పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకొని వడ్డించుకోవాలి. ఈ రెసిపీని వేడిగా తిన్నా.. లేదంటే ఫ్రిజ్​లో ఉంచి తీసుకున్నా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది!
  • ఈ సూపర్ టేస్టీ హల్వాను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం దసరా, దీపావళి పండగల సమయంలో ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకొని ఇంటిల్లిపాది ఆస్వాదించండి!

బయటి జిలేబీ అన్​ హెల్దీ కావొచ్చు! - ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోండి - రుచి అమృతమే!

ABOUT THE AUTHOR

...view details