తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఎప్పుడూ బజ్జీలు, పకోడీలే కాదు - ఇలా "క్యారెట్ కీర ప్యాన్​కేక్స్" చేయండి! - నూనె తక్కువ, రుచి ఎక్కువ! - CUCUMBER CARROT PAN CAKES

రొటీన్ స్నాక్స్​ని మించిని టేస్ట్ - నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

Carrot Cucumber Pan Cake Recipe
Cucumber Pan Cake Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2025, 5:13 PM IST

Carrot Cucumber Pan Cake Recipe in Telugu : చాలా మందికి ఈవెనింగ్ టైమ్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఒక పిల్లలైతే బడి నుంచి రాగానే మమ్మీ తినడానికి స్నాక్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంటారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది బజ్జీలు, పకోడీ, గారెలు, పునుగులు వంటి స్నాక్స్ చేసి పెడుతుంటారు. అయితే, ఎప్పుడూ రొటీన్ రెసిపీస్ కాకుండా ఈసారి కాస్త వెరైటీగా ప్లాన్ చేయండి. మీకోసమే ఒక అద్దిరిపోయే స్నాక్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "క్యారెట్ కీర ప్యాన్​కేక్స్". ఇవి చాలా రుచికరంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. పైగా ఇవి పకోడీలంతనూనెను పీల్చవు! మరి, ఈ సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీకి ఏయే పదార్థాలు అవసరం? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యప్పిండి - ముప్పావు కప్పు
  • శనగపిండి - 2 టేబుల్​స్పూన్లు
  • మొక్కజొన్న పిండి - 2 టేబుల్​స్పూన్లు
  • సగ్గుబియ్యం పిండి - 1 టేబుల్​స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • క్యారెట్ - 1
  • ఉల్లిపాయ - 1
  • కీరదోస - 1
  • కొత్తిమీర తరుగు - చారెడు
  • అల్లం పేస్ట్ - అర చెంచా
  • మిరియాల పొడి - అర చెంచా
  • బేకింగ్ పౌడర్ - అర చెంచా
  • నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే క్యారెట్, చెక్కు తీసిన కీరను సన్నగా తరుముకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా తరిగి పెట్టుకొన్న సన్నని ఉల్లిపాయ తరుగు, క్యారెట్, కీర తురుము వేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో బియ్యప్పిండి, శనగపిండి, మొక్కజొన్నపిండి, సగ్గుబియ్యంపిండి, మిరియాల పొడి, అల్లం పేస్ట్, ఉప్పు, బేకింగ్ పౌడర్, కొత్తమీర తరుగు, అర కప్పు వాటర్ యాడ్ చేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి. ఆపై చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • అనంతరం చపాతీ పీట మీద పాలిథిన్ పేపర్ పరచి కాస్త నూనె అప్లై చేసి ఒక్కో ఉండను ఉంచి చేతి వేళ్ల సాయంతో గుండ్రంగా, కట్​లెట్స్ మాదిరిగా వత్తుకోవాలి
  • ఇప్పుడు స్టౌపై పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెనం వేడయ్యాక ముందుగా చేసుకున్న ప్యాన్​​కేక్స్​ను వేసుకొని రెండువైపులా మంచిగా కాల్చుకోవాలి.
  • ఆ తర్వాత ప్లేట్​లోకి తీసుకొని టమాటాసాస్, కెచప్ లేదా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "క్యారెట్ కీర ప్యాన్​కేక్స్" రెడీ! మరి, నచ్చితే మీరూ ఈవెనింగ్ టైమ్ ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా లాగిస్తారు!

ABOUT THE AUTHOR

...view details