తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

యమ్మీ యమ్మీగా "ఫ్రైడ్ ఎగ్ సలాడ్" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ వేరే లెవల్ అంతే! - Fried Egg Salad Recipe - FRIED EGG SALAD RECIPE

Best Fried Egg Salad Recipe : మీరు ఇప్పటి వరకు వెజిటబుల్స్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ వంటివి తిని ఉంటారు. కానీ, ఎప్పుడైనా ఫ్రైడ్ ఎగ్ సలాడ్ తిన్నారా? లేదంటే.. తప్పకుండా దీనిని ట్రై చేయాల్సిందే. సూపర్ టేస్టీగా ఉండే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ! మరి.. ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

CRISPY EGG SALAD RECIPE
Fried Egg Salad Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Oct 1, 2024, 11:03 AM IST

How to Make Fried Egg Salad Recipe : మనలో చాలా మందికి సలాడ్ అనగానే.. వెజిటబుల్స్, ఫ్రూట్స్​తో ప్రిపేర్ చేసుకునేవి మాత్రమే ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ.. పోషకాలు పుష్కలంగా ఉండే గుడ్డుతో కూడా సూపర్ టేస్టీ సలాడ్ ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? లేదంటే మాత్రం ఈ స్టోరీ చదివి ఇప్పుడే ఓసారి ట్రై చేయండి. పైగా దీన్ని చాలా తక్కువ టైమ్​లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఎగ్స్ - 4
  • ఆయిల్ - తగినంత
  • ఉప్పు - కొంచెం
  • మిరియాల పొడి - కొద్దిగా
  • స్ప్రింగ్ ఆనియన్స్ - కొన్ని
  • రెడ్ క్యాప్సికమ్ - 1
  • యెల్లో క్యాప్సికమ్ - 1
  • ఉల్లిపాయ - 1(చిన్నది)
  • క్యాబేజీ - 1(చిన్నది)
  • చెర్రీ టమాటాలు - 10 నుంచి 12
  • నువ్వుల నూనె - 1 టేబుల్ స్పూన్
  • నిమ్మరసం - కొద్దిగా

సలాడ్ డ్రెస్సింగ్ కోసం :

  • సన్నని వెల్లుల్లి తరుగు - 1 టేబుల్ స్పూన్
  • సన్నని అల్లం తురుము - అర టీస్పూన్
  • ఒక పచ్చిమిర్చి సన్నని తరుగు
  • ఉప్పు - చిటికెడు
  • తేనె - 3 టేబుల్ స్పూన్లు
  • సోయా సాస్ - అర టీస్పూన్

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై చిన్నపాటి పాన్ లేదా కడాయి పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆపై పాన్​ను చేతితో పట్టుకొని నూనె బౌల్​ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా తిప్పుకోవాలి.
  • అనంతరం ఫ్రిజ్​లో నుంచి తీసిన చల్లచల్లని గుడ్డును పగులకొట్టి అందులో వేసుకోవాలి. ఎందుకంటే.. చల్లని గుడ్డు అంత త్వరగా స్ప్రెడ్ అవ్వదు. కాబట్టి చల్లని ఎగ్ వేసుకుంటే ఇడ్లీ మాదిరి మధ్యలో పొంగి.. అంచుల వెంట పల్చగా ఉంటుంది.
  • తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి వెంటనే గరిటెతో కలుపుకోకుండా కాసేపు అలా వదిలేయాలి. అయితే.. గుడ్డు వేగుతున్నప్పుడే దానిపై చిటికెడు చొప్పున మిరియాల పొడి, ఉప్పు వేసుకోవాలి.
  • ఇక గుడ్డు ఒకవైపు మంచిగా వేగి పొంగు వచ్చాక జాగ్రత్తగా గరిటెతో చిదిరిపోకుండా నెమ్మదిగా రెండోవైపు తిప్పి వేసుకోవాలి. ఆ తర్వాత పొంగు రాగానే దాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో.. పైన చెప్పిన ప్రాసెస్ ప్రకారం మరో మూడు గుడ్లను వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే.. మొత్తం నాలుగు గుడ్లను ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట.
  • అనంతరం వేయించుకున్న గుడ్లను సగానికి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు సలాడ్​లోకి కావాల్సిన వెజ్జీస్​ను ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం.. ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్​ను రెండు ఇంచుల పరిమాణంతో కట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత రెడ్ క్యాప్సికమ్​లో పావుభాగం తీసుకొని నిలువుగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేమాదిరిగా.. యెల్లో క్యాప్సికమ్​ను తరుక్కోవాలి.
  • అలాగే.. ఉల్లిపాయను సన్నని నిలువు ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాబేజీని సన్నని తరుగులా తరుక్కోవాలి. అదేవిధంగా.. కొత్తిమీరను తరిగి పెట్టుకోవాలి. చెర్రీ టమాటాలను రెండు భాగాలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం.. ఒక మిక్సింగ్​లో బౌల్​లో సన్నని వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, తేనె, సోయా సాస్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజ్జీస్​ని ఒక్కొక్కొటిగా వేసుకున్నాక.. నువ్వుల నూనె, పావు టీస్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఆపై నిమ్మరసం పిండుకొని వెజ్జీస్​ అన్ని కలిసేలా గరిటెతో నెమ్మదిగా టాస్ చేసుకోవాలి.
  • ఇక చివరగా వేయించుకొని పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఎగ్ ముక్కలు అందులో వేసుకొని మరోసారి అన్నింటినీ బాగా టాస్ చేసుకొని వెంటనే సర్వ్ చేసుకోవాలి. అంతే.. యమ్మీ యమ్మీగా ఉండే "ఫ్రైడ్ ఎగ్ సలాడ్" రెడీ!

ఇవీ చదవండి :

ఆహా అనిపించే ​"ఆఫ్ఘాని ఎగ్​ మసాలా"- సూపర్​ టేస్టీ రెసిపీ - ఇంట్లో ఈజీగా చేసేయండి!

సూపర్ టేస్టీ "బెంగాలీ స్టైల్ ఎగ్ కర్రీ" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా - రుచి అద్దిరిపోతుంది!

ABOUT THE AUTHOR

...view details