తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే - 'ఐరన్ పెనం'పై కూడా దోశలు క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి!

ఐరన్ పాన్​పై దోశలు క్రిస్పీగా రావడం లేదా? - ఈ టిప్స్ పాటిస్తే హోటల్ స్టైల్ గ్యారెంటీ!

Crispy Dosa Making Tips on Iron Tawa
Crispy Dosa Making Tips (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 1:37 PM IST

Crispy Dosa Making Tips on Iron Tawa :మెజార్టీ పీపుల్ ఇష్టపడే బ్రేక్​ఫాస్ట్ రెసిపీలలో దోశ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఇళ్లలో దోశలను ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, నాన్​స్టిక్ పాన్​పై వీటిని చాలా ఈజీగా, క్రిస్పీగా వేసుకుంటారు. అదే.. ఐరన్​ పాన్ మీద వేసుకోవాలంటే మాత్రం కాస్త ఇబ్బందిపడుతుంటారు. ఒకవేళ వేసుకున్నా లావుగా, క్రిస్పీగా వస్తుంటాయి. దీంతో కొందరు ఇంట్లో వేసే దోశలు నచ్చక బయట తింటుంటారు. కానీ, ఇకపై ఆ అవసరం లేదు. దోశలువేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే.. ఐరన్ పాన్​ మీద కూడా క్రిస్పీగా, టేస్టీగా దోశలు వేసుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఈ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పాన్​ని వేడిచేసే క్రమంలో ఇలా చేయండి!

చాలా మంది దోశలు వేసుకునేటప్పుడు స్టౌపై పాన్ పెట్టి అది వేడి కాగానే వేసుకుంటుంటారు. కానీ, ఐరన్​ పాన్​పై దోశలు వేసుకునేటప్పుడు అలా చేయకూడదట. ముందుగా నీట్​గా క్లీన్ చేసుకున్న​ పాన్​ని స్టౌపై పెట్టుకొని హై ఫ్లేమ్ మీద బాగా వేడి అవ్వనివ్వాలి. అంటే పాన్​పై పొగ వచ్చే వరకూ వేడి చేయాలి. అప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆపై కొన్ని వాటర్ చల్లి క్లాత్​తో పాన్ తుడవాలి. అనంతరం స్టౌపై ఆఫ్ చేసి 10 నిమిషాల పాటు పాన్​ని​ చల్లారనివ్వాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసి దోశ వేసుకోవాలి.

ఇలా కాల్చుకోవాలి! :

పాన్ మీద దోశ వేసుకున్నాక దాన్ని దోరగా కాలనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు దోశను మెల్లిగా తీయాలి. మరో దోశను ఇలానే వేసుకోవాలి. అంటే.. ముందుగా ఆయిల్ వేయకుండా దోశ పిండి వేసుకొని ఆపై నూనె వేసి కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఉడికించి నూనె, నెయ్యిఅప్లై చేసుకొని కాల్చుకుంటే చాలు. క్రిస్పీ, టేస్టీ దోశలు మీ ముందు ఉంటాయి.

ఐరన్​ దోశ పెనం నల్లగా మారిందా? - ఇలా చేసి అద్భుతాన్ని చూడండి!

దోశ తీసేటప్పుడు..

మీకు ఒకవేళ దోశను తీసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే ఆ టైమ్​లో గరిటని ఓసారి వాటర్​లో ముంచి తీయండి. ఆపై దోశను తీసుకుంటే తేలిగ్గా వచ్చేస్తుందట. అలాగే ఐరన్​ పాన్‌ని గ్రీజ్ చేసేందుకు సగం ఉల్లిపాయని ఆయిల్​లో ముంచి పెనంపై రాస్తే దోశలు క్రిస్పీగా వస్తాయంటున్నారు నిపుణులు.

ఈ టిప్స్ ఫాలో అవ్వండి :

  • దోశ వేసుకునేటప్పుడు అది కొన్నిసార్లు పాన్​కి అంటుకొని విరిగిపోతుంటుంది. అలాకాకుండా దోశ చక్కగా రావాలంటే పెనంపై కొద్దిగా పిండిని వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి.
  • అలాగే.. బరువు ఎక్కువగా ఉండే ఐరన్ పెనంపై దోశలు వేసుకోండి. దానికి పట్టుకోవడానికి హ్యాండిల్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
  • అదేవిధంగా ఐరన్ పాన్ క్లీనింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పాన్‌ని ఎక్కువగా సబ్బుతో క్లీన్ చేయకుండా చూసుకోవాలి. వేడి నీటితో క్లీన్ చేసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.​

హోటల్ స్టైల్ "క్రిస్పీ దోశలు" - ఇంట్లోనే సులువుగా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ వేరే లెవల్!

ABOUT THE AUTHOR

...view details