తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సూపర్ టేస్టీ "రెస్టారెంట్ స్టైల్ చికెన్ హండి" - ఇలా చేస్తే న్యూ ఇయర్ పార్టీ అద్దిరిపోవాల్సిందే! - CHICKEN HANDI RECIPE

అదుర్స్ అనిపించే రెస్టారెంట్ స్టైల్ చికెన్ హండి - వేడివేడి అన్నం, చపాతీ, రోటీలోకి సూపర్ కాంబో!

Restaurant Style Chicken Handi
Chicken Handi Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2024, 5:06 PM IST

Restaurant Style Chicken Handi Recipe :వేడివేడి అన్నం, కమ్మని పులావ్‌, బటర్ నాన్​, మాంచి రోటీ.. ఇలా దేనికైనా సరే చికెన్‌ కూర ఉంటే ఆ మజానే వేరు. అయితే, ఆ వంటకాలకు తగినట్లు చికెన్ కూరకూడా రుచిగా ఉండాలి. అప్పుడే ఆ కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుంది. అందుకే మీకోసం అలాంటి ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే, రెస్టారెంట్ స్టైల్ "చికెన్ హండి కర్రీ". టేస్ట్​ అద్దిరిపోతుంది! పైగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. న్యూ ఇయర్​కి ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ ఫుల్ ఖుష్ అవ్వాల్సిందే! మరి, ఇంకెందుకు ఆలస్యం అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • స్కిన్​లెస్ చికెన్ - అరకిలో
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • నెయ్యి - 1 టేబుల్​స్పూన్
  • ఉల్లిపాయలు - 2 (మీడియం సైజ్​వి)
  • టమాటాలు - 2 (మీడియం సైజ్​వి)
  • పచ్చిమిర్చి - 3
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • పసుపు - అరటీస్పూన్
  • ధనియాల పొడి - 1 టేబుల్​స్పూన్
  • జీలకర్ర పొడి - 1 టీస్పూన్
  • కారం - తగినంత
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పెరుగు - 200 గ్రాములు
  • కసూరి మేతి - 1 టేబుల్​స్పూన్
  • ఫ్రెష్ క్రీమ్ - 3 టేబుల్​స్పూన్లు
  • గరంమసాలా - అరటీస్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

న్యూ ఇయర్​ స్పెషల్​ ​నాన్​వెజ్ థాలీ "మటన్​ బిర్యానీ, చికెన్​ తవా, ఫిష్​ ఫ్రై" చేసేయండిలా - రుచితో పాటు పార్టీ అదుర్స్​!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా చికెన్​ని శుభ్రంగా కడిగి ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. ఆ మిశ్రమం వేడయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్వేసుకొని బ్రౌన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆనియన్స్ వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అవి మెత్తబడే వరకు వేయించుకోవాలి.
  • టమాటా ముక్కలు ఉడికాక మంటను లో ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకొని అందులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్​ని వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలా కలిపి లో ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. అలా చికెన్​ని వేయించుకునేటప్పుడే ఉప్పుని యాడ్ చేసుకోవాలి.
  • ఆవిధంగా చికెన్​ని వేయించుకున్నాక అందులో పెరుగుని వేసుకొని కలిపి మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి.
  • ఆ తర్వాత ఒకసారి కలిపి మూతపెట్టి మరో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అనంతరం మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై సన్నని పచ్చిమిర్చి తరుగు, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ వేసి మరోసారి చక్కగా కలుపుకోవాలి.
  • అనంతరం గరంమసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ టైమ్​లో అవసరమనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత మూత తీసి కొత్తిమీరతరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "రెస్టారెంట్ స్టైల్ చికెన్ హండి కర్రీ" రెడీ!

బ్యాచిలర్స్ రెసిపీ "చికెన్ టిక్కా బిర్యానీ" - వంట రాని వారు కూడా ఈజీగా చేసేస్తారు!

ABOUT THE AUTHOR

...view details