తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

వింటర్ స్పెషల్ : రెస్టారెంట్ స్టైల్ "చికెన్ కార్న్ సూప్" - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!

చల్లటి గాలులకు వెచ్చదనాన్ని అందించే సూపర్ టేస్టీ చికెన్ కార్న్ సూప్ - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

How to Make Chicken Corn Soup
Chicken Sweet Corn Soup (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2024, 9:02 AM IST

How to Make Chicken Sweet Corn Soup :చలికాలం స్టార్ట్ అయిపోయింది. ఈ క్రమంలోనే చాలా మంది వెచ్చదనం కోసం రకరకాల సూప్స్​ని ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. అలాంటివారికోసమే ఒక అద్దిరిపోయే నాన్​వెజ్ సూప్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "రెస్టారెంట్ స్టైల్ చికెన్ స్వీట్​ కార్న్ సూప్". చాలా రుచికరంగా ఉండే దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు! పైగా ఈ సూప్​ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ సూప్​ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • స్వీట్ కార్న్ - పావు కప్పు
  • బోన్​లెస్ చికెన్ - 50 గ్రాములు
  • సన్నని క్యారెట్ తరుగు - 2 టీస్పూన్లు
  • సన్నని ఫ్రెంచ్ బీన్స్ తరుగు - 1 టేబుల్​స్పూన్
  • పంచదార - అరటీస్పూన్
  • అరోమాటిక్ పౌడర్ - అరటీస్పూన్
  • నల్ల మిరియాల పొడి - అరటీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • తెల్ల మిరియాల పొడి - అరటీస్పూన్
  • గుడ్డు సొన - 1 టేబుల్ స్పూన్
  • కార్న్ ఫ్లోర్ - 1 టీస్పూన్

ఈ చలిలో మటన్ పాయా.. సూప్ జుర్రేస్తే జిందగీ ఖుష్ అవ్వాల్సిందే!

తయారీ విధానం :

  • ముందుగా మిక్సీ జార్​ తీసుకొనిస్వీట్ కార్న్ వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే, బోన్​లెస్​ చికెన్​ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని అరలీటర్ వాటర్ పోసుకోవాలి. తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్, చికెన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై స్టౌను హై ఫ్లేమ్​లో ఉంచి కనీసం 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అయితే, మిశ్రమం మరుగుతున్నప్పుడు దానిపై ఒక తేట ఫామ్ అవుతుంది. అప్పుడు దాన్ని గరిటెతో తీసేస్తుండాలి. ఆ తేటను ఎంత బాగా తొలగించుకుంటే సూప్ అంత రుచికరంగా వస్తుందని గుర్తుంచుకోవాలి.
  • అలా 15 నిమిషాల పాటు మిశ్రమాన్ని బాగా మరిగించుకున్నాక.. అందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్ తరుగు, పంచదార, అరోమాటిక్ పౌడర్, నల్ల మిరియాల పొడి, ఉప్పు, తెల్ల మిరియాల పొడి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. అరోమాటిక్ పౌడర్ దొరక్కపోతే స్కిప్ చేయొచ్చు.
  • ఆపై స్టౌను హై ఫ్లేమ్​లో ఉంచి మరో 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. అలా మరిగించుకునేటప్పుడు మళ్లీ మిశ్రమంపైనా ఒక తేట ఫామ్ అవుతుంది. దాన్ని గరిటెతో తొలగిస్తుండాలి.
  • ఇక మిశ్రమం బాగా మరుగుతున్నప్పుడు మంచిగా బీట్ చేసుకున్న గుడ్డు సొనను అందులో వేసి బాగా మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
  • ఆలోపు ఒక చిన్న బౌల్​లో కార్న్​ఫ్లోర్ తీసుకొని 30ఎంఎల్ వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆవిధంగా మిశ్రమాన్ని మరిగించుకున్నాక అందులో మిక్స్ చేసుకుని పెట్టుకున్న కార్న్​ ఫ్లోర్​ను కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుతూ మరో 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి.
  • అయితే, కార్న్​ఫ్లోర్ మిశ్రమం పోశాక మరీ ఎక్కువ సేపు సూప్​ను బాయిల్ చేసుకోవద్దు. అలా చేస్తే సూప్ మరీ చిక్కగా, జావ మాదిరిగా అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • అందుకే, కార్న్ ఫ్లోర్ వేసుకున్నాక మిశ్రమం కొద్దిసేపు మరిగి కాస్త చిక్కగా మారగానే దింపేసుకుంటే సరిపోతుంది. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే పర్ఫెక్ట్ "రెస్టారెంట్ స్టైల్ చికెన్ స్వీట్​కార్న్ సూప్" రెడీ!

చల్లని సాయంకాలం వేళ వేడివేడిగా "క్యారెట్‌ జింజర్​ సూప్‌"- నిమిషాల్లో అద్దిరిపోయే టేస్ట్!

ABOUT THE AUTHOR

...view details