తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

లంచ్​లోకి చిటికెలో చేసుకునే "బంగాళదుంప ముద్ద కూర" - వేడి వేడి అన్నంలో తింటే అమృతమే! - BANGALADUMPA MUDDA KURA RECIPE

ఆలూతో నిమిషాల్లో చేసుకునే అద్దిరిపోయే రెసిపీ - ఒక్కసారి తిన్నారంటే టేస్ట్​కి ఎవరైనా ఫిదా!

POTATO PACHI MIRCHI FRY
Bangaladumpa Mudda Kura (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2024, 6:42 PM IST

Bangaladumpa Mudda Kura Recipe in Telugu :ఎక్కువ మంది ఇష్టపడే కూరగాయలలో ఒకటి.. బంగాళదుంప. దీనితో కర్రీ, ఫ్రై, కుర్మా, ఆలూ రైస్, వడ వంటి రకరకాల వంటకాలు ట్రై చేస్తుంటారు. కానీ, కొందరికి ఆలూతో ఎప్పుడూ రొటీన్ కర్రీలే తినడం బోరింగ్​గా అనిపిస్తోంది. అలాంటి వారికోసమే ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "బంగాళదుంప ముద్ద కూర". దీన్నే బంగాళదుంపపచ్చిమిర్చి వేపుడు అని కూడా అంటారు. సూపర్ టేస్టీగా ఉండే ఈ కర్రీని నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం, చపాతీ ఇలా దేనిలోకైనా ఇది చాలా బాగుంటుంది. ఇంతకీ, ఈ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బంగాళదుంపలు - 3(మీడియం సైజ్​వి)
  • పచ్చిమిర్చి - తగినన్ని
  • ఉల్లిపాయలు - 2(మీడియం సైజ్​వి)
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఆయిల్ - 2 టేబుల్​స్పూన్లు
  • పోపు గింజలు - 1 టేబుల్​స్పూన్ట
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పసుపు - పావుటీస్పూన్
  • ధనియాల పొడి - 1 టీస్పూన్

అన్నం, టిఫెన్స్​లోకి సూపర్ కాంబినేషన్ - ఘుమఘుమలాడే "హరియాలీ దమ్ ఆలూ" - నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

తయారీ విధానం :

  • ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని కుక్కర్​లోకి తీసుకొని ముప్పావు కప్పు వాటర్, కొద్దిగా ఉప్పు వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఇలా బంగాళదుంపలను రెండు ముక్కలు చేసుకొని కుక్కర్​లో ఉడికించడం వల్ల అవి త్వరగా, చక్కగా ఉడుకుతాయి.
  • అవి ఉడికేలోపు మిక్సీ జార్​ తీసుకొని అందులో మీరు తినే కారానికి తగ్గట్లు పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకోవాలి. అలాగే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఉప్పు వేసుకొని కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు కుక్కర్​లో ఉడికించుకున్న బంగాళదుంపలను పొట్టు తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు గింజలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • ఆవాలు చిటపడలాడేవరకు వేయించుకున్నాక.. అందులో నాలుగైదు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, పొడవుగా సన్నగా తరుకున్న ఉల్లిపాయముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్​ మీద రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే కరివేపాకు వేసుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, పసుపుయాడ్ చేసుకొని కలిపి లో ఫ్లేమ్​ మీద ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా వేయించుకునేటప్పుడు ధనియాల పొడి వేసుకోవడంతో పాటు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి.
  • ఆపై మిశ్రమంలో ఎక్కడా పచ్చివాసన లేకుండా ఓ ఐదు నిమిషాల పాటు వేయించుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపి దింపుకుంటే చాలు. అంతే.. యమ్మీ యమ్మీగా "బంగాళదుంప ముద్ద కూర" రెడీ!

లంచ్​ బాక్స్​ స్పెషల్​ - యమ్మీ యమ్మీ "ఆలూ రైస్"​ - ఇలా చేస్తే పిల్లలు అస్సలు వద్దనకుండా తినేస్తారు!

ABOUT THE AUTHOR

...view details