ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

పులి కడుపులో మహిళ చెవి దిద్దులు - పోస్టుమార్టంలో షాకింగ్ విషయాలు - WAYANAD TIGER DEATH

కేరళలోని వయనాడ్ జిల్లాలో పులి కళేబరం స్వాధీనం - పోస్టుమార్టం నివేదికలో ఏముందంటే!

wayanad_tiger_death
wayanad_tiger_death (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 12:56 PM IST

Wayanad Tiger Death: అటవీ విస్తీర్ణంలో తగ్గుదల జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమించింది. అడవికి సమీపంలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులు మునుపెన్నడూ లేని విధంగా పులులు, చిరుతలు, భల్లూకాలు, ఏనుగుల దాడికి గురవుతున్నారు. తరచూ ఏనుగుల గుంపు దాడి చేస్తుండగా పులుల దాడిలో మృతి చెందిన వారూ ఉన్నారు. కాగా, మనుషుల రక్తాన్ని మరిగిన ఓ పులి చివరికి మరో పులి దాడిలో మృతి చెందగా పోస్టుమార్టం రిపోర్టు అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ఓ పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు దానికి పోస్టు మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా పులి కడుపులో ఒక జత బంగారు దిద్దులు వారికి లభ్యం కావడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఈ ఆధారంతో వారికి ఓ అనుమానం నివృత్తి కావడం గమనార్హం.

తిరుమలలో గోవిందా, గోవిందా అని ఎందుకంటారో తెలుసా? - అసలు విషయం ఇదీ!

అటవీ ప్రాంతంలో పులి కళేబరాన్ని పరిశీలిస్తున్న అధికారులు (ETV Bharat)

అసలు విషయం ఏమిటంటే వయనాడ్ జిల్లా మనంతవాడి సమీపంలో కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ అనే మహిళపై దాడి చేసిన పులి సమీపంలోని అటవీ ప్రాంతానికి ఈడ్చుకొని వెళ్లి సగానికి పైగా తినేసింది. మనుషుల రక్తాన్ని మరిగిన ఆ పులి రెండో సారి జయసూర్య అనే అటవీ అధికారిపై దాడి చేసి తప్పించుకుంది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించి, పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మ్యాన్ ఈటర్ గా ప్రకటించిన ప్రభుత్వం ఆ పులిని అంతం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి అనుమానాస్పద ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఒక ప్రాంతంలో పులి తిరుగుతున్నట్టు సమాచారం అందడంతో వన్యప్రాణి సంరక్షణ అధికారులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. తెల్లవారు జామున 2.30గంటల సమయంలో పులి తారసపడగా మత్తుమందు ఇచ్చేందుకు విఫలయత్నం చేశారు.

ఇదిలా ఉండగా పులిని చంపే నైపుణ్యం కలిగిన వ్యక్తులతో రంగంలోకి దిగిన పోలీసులకు మనంత వాడి సమీపంలోని పిలకావు అటవీ ప్రాంతంలో పులి కళేబరం ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లిన అటవీ సిబ్బందికి ఓపాడుబడిన ఇంటి వెనుక ఒళ్లంతా గాయాలతో పులి కనిపించింది. కాళ్లు విరిగి, తల పగిలి చనిపోయిందని తెలుసుకున్న అధికారులు కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. పులి మెడపై పదునైన గాయాలున్నాయని, మరో పులితో జరిగిన ఘర్షణలో చనిపోయి ఉండొచ్చని చీఫ్‌ ఫారెస్ట్‌ వెటర్నరీ సర్జన్‌ డాక్టర్‌ అరుణ్‌ జకారియా వెల్లడించారు. ఆ పులిని నిశితంగా పరిశీలించి పోస్టుమార్టంకు తరలించగా షాకింగ్ విషయాలు తెలిశాయి.

పులి కడుపులో మహిళ వెంట్రుకలు, జత చెవి పోగులు లభ్యమయ్యాయి. దీంతో కాఫీ తోటలో రాధ అనే మహిళా కూలీని హతమార్చిన పులి ఇదేనని అధికారులు నిర్ధారించుకున్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత పులి కళేబరాన్ని అటవీ ప్రాంతంలోనే పూడ్చిపెట్టామని అధికారులు పేర్కొన్నారు.

అతి ప్రాచీన వంటకం 'కుంభకోణం సాంబార్' - జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాల్సిందే!

పాతకాలపు 'ఉప్మా' తయారీ విధానం - ఇలా చేస్తే మీకు 100 మార్కులు గ్యారెంటీ!

ABOUT THE AUTHOR

...view details